Monitar Lizard: టెస్టు మ్యాచ్‌లో అనుకోని అతిథి.. బౌండరీ లైన్ వద్ద హంగామా!
ABN , Publish Date - Feb 03 , 2024 | 06:10 PM
అప్పుడప్పుడు క్రికెట్ మ్యాచ్‌ల్లో కొన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. రక్షణ వలయం చీల్చుకొని అభిమానులు రావడమో.. పావురాలు, కాకులు లేదా పాములు వంటి అనుకోని అతిథులు మైదానాల్లో అడుగుపెట్టి కాసేపు డిస్టర్బ్ చేయడమో.. వంటివి అరుదుగా జరుగుతుంటాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా ఉడుము షాకిచ్చింది.
అప్పుడప్పుడు క్రికెట్ మ్యాచ్‌ల్లో కొన్ని ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. రక్షణ వలయం చీల్చుకొని అభిమానులు రావడమో.. పావురాలు, కాకులు లేదా పాములు వంటి అనుకోని అతిథులు మైదానాల్లో అడుగుపెట్టి కాసేపు డిస్టర్బ్ చేయడమో.. వంటివి అరుదుగా జరుగుతుంటాయి. ఇప్పుడు లేటెస్ట్‌గా ఉడుము షాకిచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు కానీ.. బౌండరీ వద్ద దర్శనమిచ్చి, కాసేపు హంగామా సృష్టించింది. ఈ ఘటన కొలంబో టెస్టు మ్యాచ్‌లో వెలుగు చూసింది.
ఆ వివరాల్లోకి వెళ్తే.. శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య కొలంబో వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. శనివారం నాడు రెండో రోజు ఆట జరుగుతున్న సమయంలో.. మైదానంలోకి అనుకోని అతిథి ప్రవేశించింది. 48వ ఓవర్ వద్ద ఈ ఉడుము బౌండరీ లైన్ వద్ద దర్శనమివ్వడంతో.. అంపైర్లు అలర్ట్ అయ్యి మ్యాచ్‌ని కాసేపు ఆపేశారు. అందరి దృష్టి దానివైపే మళ్లింది. చివరికి సిబ్బంది రంగంలోకి దిగి, దాన్ని మైదానం నుంచి బయటకు పంపించేశారు. అయితే.. అది అంత ఈజీగా వెళ్లలేదు. మొదట్లో ఓ వ్యక్తి దాన్ని తరిమేందుకు ప్రయత్నించగా.. అది పరుగులు పెట్టి, ఇతరుల్ని భయపెట్టించింది. దీంతో.. అక్కడ కాసేపు నవ్వులు పూశాయి. ఫైనల్‌గా అది మైదానం వీడింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు 198 పరుగులకే ఆలౌట్ అయ్యింది. రహ్మత్ షా ఒక్కడే 91 పరుగులతో జట్టుని ఆదుకున్నాడు. మిగతా బ్యాటర్లందరూ ఘోరంగా విఫలమయ్యారు. అనంతరం బ్యాటింగ్‌కి దిగిన శ్రీలంక.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి 410 పరుగులు చేసింది. ఏంజెలో మాథ్యూస్ (141), దినేశ్ చండిమాల్ (107) శతకాలతో చెలరేగారు. ఈ ఇద్దరి పుణ్యమా అని.. శ్రీలంక భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది.