Share News

Storage Tips: ఈ 5 టిప్స్ పాటించండి.. వర్షాకాలంలో కూరగాయలు, ఆహారాలు త్వరగా పాడైపోవు..!

ABN , Publish Date - Aug 01 , 2024 | 12:37 PM

వేసవికాలం వేడి కారణంగా ఆహారాలు, కూరగాయలు, ఆకుకూరలు కుళ్లిపోతుంటాయి. అయితే వాతావరణం మారినా కూరగాయల విషయంలో ఈ బెంగ మాత్రం పోదు. వర్షాల కారణంగా కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువ తేమగా ఉంటాయి.

Storage Tips: ఈ 5 టిప్స్ పాటించండి.. వర్షాకాలంలో కూరగాయలు, ఆహారాలు త్వరగా పాడైపోవు..!
storage tips

వేసవికాలం వేడి కారణంగా ఆహారాలు, కూరగాయలు, ఆకుకూరలు కుళ్లిపోతుంటాయి. అయితే వాతావరణం మారినా కూరగాయల విషయంలో ఈ బెంగ మాత్రం పోదు. వర్షాల కారణంగా కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువ తేమగా ఉంటాయి. వీటిని ఎంత జాగ్రత్తగా నిల్వ చేసినా తొందరగా తేమ పెరిగి కుళ్ళిపోతాయి. అలా కాకుండా కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే వాటికి కింద చెప్పుకున్న విధంగా నిల్వ చేసుకోవాలి..

ఫ్రిజ్ మెయింటెన్స్..

వర్షాల కారణంగా కూరగాయలు, ఆకుకూరలు సహజంగానే తేమలో ఎక్కువ తడిసి ఉంటాయి. ఇలాంటి వాటికి చల్లని వాతావరణం తగిలితే కుళ్లిపోతాయి. ముఖ్యంగా ఫ్రిజ్ శుభ్రంగా లేకపోతే తేమ పెరిగి, నీరు లీకవుతూ బ్యాక్టీరియా ఏర్పడుతుంది. అందుకే ఫ్రిజ్ ను బేకింగ్ సోడా, నిమ్మరసం, వెనిగర్ వంటి పదార్థాలతో శుభ్రం చేయాలి. ఫ్రిజ్ శుభ్రంగా మెయింటైన్ చేయాలి. ఫ్రిజ్ దుర్వాసన రాకుండా బేకింగ్ సోడా, కట్ చేసిన నిమ్మ ముక్కలను ఫ్రిజ్ లో ఉంచాలి.

రోజూ బెల్లం టీ తాగితే ఏం జరుగుతుందంటే..!


ఆకుకూరలు..

వర్షాకాలంలో ఆకుకూరలు చాలా తొందరగా కుళ్లిపోతాయి. బచ్చలికూర, పాలకూర, కొత్తిమీర, పుదీనా, తోటకూర వంటివి నిల్వ చేసేముందు వాటిలో కుళ్లిపోయిన ఆకులను వేరు చేసి, వేర్లను కత్తిరించి, వాటిని కాగితంలో చుట్టి పెట్టాలి. ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి.

కంటైనర్లు..

వండిన ఆహారం అయినా, వండని ఆహారం అయినా వాటిని నిల్వ చేయడానికి గాలి చొరబడని కంటైనర్లలో నిల్వ చేయాలి. కంటైనర్లు మన్నికగా ఉండాలి. ఇలాంటి కంటైనర్లు ఆహారం చెడిపోకుండా ఎక్కువ సేపు తాజాగా ఉంచుతాయి.

మాంసాహారం ఎక్కువగా తినేవారికి ఇన్ని రోగాలు వస్తాయా..!


పండ్లు, కూరగాయలు..

పండ్లు, కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే కొనుగోలు దగ్గర జాగ్రత్త పడాలి. ఏ చిన్న కుళ్ళు లేకుండా చూసుకోవాలి. పండ్లకు రంధ్రాలున్నా, పండ్లు మెత్తగా ఉన్నా, అలాగే బాగా పండిపోయి ఉన్నా అవి తొందరగా పాడైపోతాయి. తాజాగా ఉన్న పండ్లు, కూరగాయలను కొన్న తరువాత వాటిని బాగా కడిగి, తేమ లేకుండా తుడిచి, గాలిలో బాగా ఆరిన తరువాత వాటిని నిల్వచేయాలి. ఇలా చేస్త్ చెడిపోవు.

వండిన ఆహారం..

వండిన ఆహారాన్ని నిల్వ చేయడం వర్షాకాలంలో మంచిది కాదు.. చల్లని వాతావరణానికి నిల్వ చేసిన ఆహారాలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఒక వేళ చల్లని ఆహారాన్ని తిరిగి వేడి చేసి తిన్నా ఆరోగ్యానికి ముప్పే.. అయితే వండిన ఆహారాలు నిల్వ చేసే ఉద్దేశం ఉన్నవారు వాటిని వేడిగా ఉండగానే కంటైనర్లలో వేసి ఫ్రిజ్ లో ఉంచకూడదు. గది ఉష్ణోగ్రత వద్దకు వచ్చిన తరువాత వాటిని ఎయిర్ టైట్ కంటైనర్లలో నిల్వ చేయాలి.

వర్షాకాలంలో ప్రతి రోజూ ఒక కప్పు తులసి టీ తాగితే ఏం జరుగుతుంది?

వైట్ రైస్ కు బదులు బ్రౌన్ రైస్ తింటే.. జరిగేదిదే..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 01 , 2024 | 12:37 PM