Share News

Viral Video: కర్రీ పాయింట్‌లో ఘుమఘుమలాడే కూర.. గరిటెను తిప్పి చూడగా.. ఒళ్లు జలదరించే సీన్...

ABN , Publish Date - Feb 21 , 2024 | 03:30 PM

కర్రీ పాయింట్‌లో తయారు చేసే కూరలు శుభ్రంగా ఉండవని తెలిసినా వేరే దారి లేక చాలా మంది అవే కొనుక్కుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఒళ్లు జలదరించడం ఖాయం.

Viral Video: కర్రీ పాయింట్‌లో ఘుమఘుమలాడే కూర.. గరిటెను తిప్పి చూడగా.. ఒళ్లు జలదరించే సీన్...

పెద్ద పెద్ద నగరాల్లోనే కాదు.. ఓ మోస్తరు పట్టణాల్లో కూడా ఇప్పుడు కర్రీ పాయింట్లు (Curry Points) కుప్పలు తెప్పలుగా వచ్చేశాయి. చాలా మందికి కర్రీ పాయింట్లలో కూరలు తెచ్చుకుని తినేయడం అలవాటు. అక్కడ తయారు చేసే కూరలు శుభ్రంగా ఉండవని, రుచి కోసం పలు రసాయనాలు కలుపుతారని తెలిసినా వేరే దారి లేక చాలా మంది అవే కొనుక్కుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video) చూస్తే ఒళ్లు జలదరించడం ఖాయం. ఆ వీడియోలోని ఓ కూర బకెట్‌లో ప్రమాదకర పాము (Snake) కనిపించింది.

stylish.satyam అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను పంచుకున్నారు. బంగాళాదుంపలు, క్యాబేజీలతో అప్పుడే వండిన కూరను బకెట్‌లో వేశారు. అయితే అందులో ఏదో కదులుతున్నట్టు అనిపించింది. గరిటెతో తిప్పి చూడగా లోపలి నుంచి ఓ పాము బయటకు వచ్చింది. ఆ పాము బతికే ఉంది (Snake in Curry). అది ప్రపంచంలోనే మూడో విషపూరిత సర్పం అని తేలింది. అదృష్టమేమిటంటే ఎవరికీ ఆ కూర ఇవ్వకముందే ఆ పాము కంటబడింది. ఆ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు.

ఈ షాకింగ్ వీడియోకు మిలియన్‌కు పైగా వ్యూస్ వచ్చాయి. 75 వేల మందికి పైగా లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ``పూర్తిగా వండిన తర్వాత ఆ బకెట్‌లో పాము పడి ఉంటుంది``, ``అది నాన్-వెజ్ కర్రీ``, ``అది పాము కూర``, ``భారత్‌లో ఇలాంటివి సర్వ సాధారణం``, ``పామును పక్కన పడేసి కూర వడ్డించేస్తే సరిపోతుంది కదా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Feb 21 , 2024 | 03:30 PM