Viral: వామ్మో! క్యాప్సికమ్‌తో ఇలాంటి ప్రమాదం కూడా ఉంటుందా? షాకింగ్ వీడియో
ABN , Publish Date - Jun 01 , 2024 | 12:14 PM
ఓ మహిళ క్యాప్సికమ్ తరుగుతుండగా దారం ఆకారంలో ఉన్న పురుగు బయటపడిన ఉదంతం ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది అత్యంత ప్రమాదకరమైన పురుగని, కడుపులోకి వెళితే తీవ్ర అనారోగ్యం తప్పదని వీడియోలో హెచ్చరించారు.
ఇంటర్నెట్ డెస్క్: క్యాప్సికమ్.. ఎంతో మందికి నచ్చే ఆహారం ఇది. ఇందులో పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. అయితే,క్యాప్సికమ్ తరుగుతుండగా ఓ మహిళకు భారీ షాక్ తగిలింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ (Viral) అవుతోంది. దీన్ని చూసి జనాలు దడుసుకుంటున్నారు.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ మహిళ క్యాప్సికమ్ కూర తరుగుతుండగా అందులో దారం ఆకారంలో ఉన్నదొకటి బయటపడింది. చూడటానికి అది దారం లాగా ఉన్నప్పటికీ లైట్ తీసుకోవద్దని వీడియోలో సూచించారు. వాస్తవానికి ఇది అత్యంత ప్రమాదకరమైన పురుగట. క్యాప్సికమ్ లో కనిపించే ఈ పురుగును తొలగించకుండా తింటే తీవ్ర అనారోగ్యం తలెత్తుతుందని హెచ్చరిస్తున్నారు. ఒక్కోసారి చావు కూడా తప్పదని చెబుతున్నారు. ఈ పొరుగు కడుపులోకి చేరాక అక్కడున్న కణజాలాన్ని తినడం ప్రారంభిస్తుంది. చివరకు ఇది మరణానికి దారి తీస్తుంది. అంతేకాదు, ఈ పురుగు గుడ్లు కడుపులోకి వెళ్లినా ఇబ్బందులు తప్పవట (Strange worm crawling out of capsicum shocks internet).
Cheetah Speed: చీతాకు అంతటి వేగం ఎలా సాధ్యమైందంటే..
@krishnavallabhi పేరిట ఉన్న అకౌంట్లో ఈ వీడియోను పోస్టు చేశారు. ఇక పురుగును చూసిన వారందరూ దడుసుకుంటున్నారు. చూడటానికి దారం లాగా ఉన్న దీంతో ఇంతటి ప్రమాదమా అని నోరెళ్లబెడుతున్నారు. అసలు క్యాప్సికమ్ లో ఇలాంటి పురుగులు ఉంటాయన్న విషయమే తమకు తెలియదని మరికొందరు అన్నారు. కూరలు తరిగే విషయంలో జాగ్రత్తగా ఉండాలని, పురుగులు, పుచ్చులు లేకుండా చూసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఇలా రకరకాల కామెంట్స్ తో వీడియో వైరల్ గా మారింది. వేల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. మరి మీరూ ఈ వీడియోపై ఓ లుక్కేయండి.