Share News

Viral: వామ్మో.. స్టూడెంట్ బెదిరింపునకు బిత్తరపోయిన ప్రిన్సిపాల్.. 10కి 10 మార్కులు ఎందుకేశాడంటే..

ABN , Publish Date - Jul 20 , 2024 | 12:55 PM

దేవుడి కంటే గురువు గొప్ప వాడని గతంలో నమ్మేవారు. గురువును పూజించేవారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో గురువులకు ఇచ్చే గౌరవం క్రమంగా తగ్గిపోతోంది. అందుకు విద్యార్థులు ఎంత కారణమో, గురువుల ప్రవర్తన కూడా అంతే కారణం.

Viral: వామ్మో.. స్టూడెంట్ బెదిరింపునకు బిత్తరపోయిన ప్రిన్సిపాల్.. 10కి 10 మార్కులు ఎందుకేశాడంటే..
Stundent wrote funny letter to principal

దేవుడి కంటే గురువు (Teacher) గొప్ప వాడని గతంలో నమ్మేవారు. గురువును పూజించేవారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో గురువులకు ఇచ్చే గౌరవం క్రమంగా తగ్గిపోతోంది. అందుకు విద్యార్థులు ఎంత కారణమో, గురువుల ప్రవర్తన కూడా అంతే కారణం. ఆదర్శంగా ఉండాల్సిన టీచర్లు తమ బలహీనతలతో విద్యార్థుల (Student) ముందు అబాసు పాలవుతున్నారు. తాజాగా ఓ టీచర్‌కు విద్యార్థి రాసిన లేఖ (Letter) చదివితే విషయం మీకే అర్థమవుతుంది. పరీక్షా పత్రాలలో విద్యార్థులు రాసే ఫన్నీ సమాధానాలు ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఆన్సర్ షీట్ కూడా అలాగే వైరల్ అవుతోంది (Viral Video).


comedian_kavita అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఆ వీడియో ప్రకారం.. ఓ విద్యార్థి తన స్కూల్ ప్రిన్సిపాల్‌ను బెదిరిస్తూ నేరుగా ఓ మెసేజ్ రాశాడు. ``సర్.. నేను నా గాళ్‌ఫ్రెండ్‌తో కలిసి పిజ్జా షాప్‌నకు వెళ్లా. పిజ్జా షాప్‌లో పూజా మేడమ్‌తో ఉన్న మిమ్మల్ని చూశాను. వీడియో కూడా తీశాను. మీరు నా ఫీజ్‌ను మాఫీ చేయకపోతే ఆ వీడియో బయటపెడతాను. అలాగే పరీక్షలో నాకు ఎక్కువ మార్కులు వేయాలి. బెదిరింపుతో మీ విధేయ విద్యార్థి, పేరు పప్పు చోర్, నాలుగో తరగతి`` అని రాశాడు.


అది నిజమా?, ఫేక్ అనేది తెలియడం లేదు కానీ, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ జవాబు పత్రంపై పదికి పది మార్కులు వేసి ఉన్నాయి. ఈ వీడియోకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. 5.2 లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``చివరి లైన్ చాలా బాగుంది``, ``వినయపూర్వకమైన బెదిరింపు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: మొసలితో స్టంట్స్.. బతుకుజీవుడా అంటూ..!!


Picture Puzzle: మీ ఐక్యూ రేంజ్ ఏంటో తెలుసుకోండి.. కింది ఫొటోలో విభిన్నంగా ఉన్న రాకెట్‌ను 10 సెకెన్లలో కనిపెట్టండి..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 20 , 2024 | 12:55 PM