Share News

Viral Video: మొసలితో స్టంట్స్.. బతుకుజీవుడా అంటూ..!!

ABN , Publish Date - Jul 20 , 2024 | 11:15 AM

వన్యప్రాణులతో ఆటలాడడం చాలా ప్రమాదకరం. వాటిని ఎంత మచ్చిక చేసుకున్నా మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. లేకపోతే ప్రాణాల మీదకు రావడం ఖాయం. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఆ విషయం అర్థమవుతుంది.

Viral Video: మొసలితో స్టంట్స్.. బతుకుజీవుడా అంటూ..!!
Man Was Trying To Do Stunt With Crocodile

వన్యప్రాణులతో (Wild Animals) ఆటలాడడం చాలా ప్రమాదకరం. వాటిని ఎంత మచ్చిక చేసుకున్నా మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. లేకపోతే ప్రాణాల మీదకు రావడం ఖాయం. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి మొసలిని తక్కువగా అంచనా వేసి దానితో ఓ స్టంట్ చేయడానికి ప్రయత్నించాడు (Stunt With Crocodile). అది తన సహజ ధోరణిలో ప్రవర్తించడంతో బతికి బట్టకట్టడానికి నానా తంటాలు పడ్డాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంంది (Viral Video).


@NeverteIImeodd అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి మొసలిని ఇసులో పడుక్కోబెట్టి దాని పై కూర్చున్నాడు. చుట్టూ జనం ఉండగా అతడు ఆ మొసలితో స్టంట్ చేయడానికి ప్రయత్నించాడు. మొసలి నోరు తెరిచి తన తలను దాని దవడల మధ్య పెట్టాడు. వెంటనే ఆ మొసలి తన నోరు మూసి ఆ వ్యక్తి తలను కొరకడానికి ప్రయత్నించింది. దీంతో చుట్టు పక్కల వారు అతడిని కాపాడడానికి పరుగులు పెట్టారు. ఎంత మంది వచ్చినా ఆ మొసలి తన పట్టు సడలించలేదు. చివరకు గాయాలతో ఆ వ్యక్తి బయటపడ్డాడు.


ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 1.4 కోట్ల మంది ఈ వీడియోను వీక్షించారు. 51 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``అతి విశ్వాసం ఇలాగే చేటు చేస్తుంది``, ``అతడు మరణాన్ని చూశాడు``, ``మృత్యువు నోట్లు తలపెట్టాడు``, ``కచ్చితంగా పిచ్చి వాళ్లే ఇలా చేస్తారు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Picture Puzzle: మీ ఐక్యూ రేంజ్ ఏంటో తెలుసుకోండి.. కింది ఫొటోలో విభిన్నంగా ఉన్న రాకెట్‌ను 10 సెకెన్లలో కనిపెట్టండి..!


Viral Video: నిద్రపోతున్న వ్యక్తికి షాకింగ్ అనుభవం.. కళ్లు తెరవగానే భారీ కొండచిలువను చూసి అతడేం చేశాడంటే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 20 , 2024 | 12:05 PM