Share News

Viral Video: ``ఏదో ఒకరోజు చనిపోతా.. అయినా నేను పాస్ కావాలనుకుంటున్నా``.. విద్యార్థి జవాబు చూసి టీచర్ షాక్!

ABN , Publish Date - Jul 05 , 2024 | 01:41 PM

ఇటీవలి కాలంలో విద్యార్థుల ఆన్సర్ షీట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. సరిగ్గా చదవకుండా పరీక్షలకు వచ్చే విద్యార్థులకు తమకు తోచిన సమాధానాలు రాస్తూ పాస్ చేయాలని టీచర్లను వేడుకుంటున్నారు. టీచర్లు ఆ జవాబు పత్రాలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

Viral Video: ``ఏదో ఒకరోజు చనిపోతా.. అయినా నేను పాస్ కావాలనుకుంటున్నా``.. విద్యార్థి జవాబు చూసి టీచర్ షాక్!
Student Funny answer

ఇటీవలి కాలంలో విద్యార్థుల (Students) ఆన్సర్ షీట్లు (Answer Sheets) సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. సరిగ్గా చదవకుండా పరీక్షలకు వచ్చే విద్యార్థులకు తమకు తోచిన సమాధానాలు రాస్తూ పాస్ చేయాలని టీచర్లను వేడుకుంటున్నారు. టీచర్లు ఆ జవాబు పత్రాలను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ ఫన్నీ ఆన్సర్లు (Funny Answers) సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటిదే ఓ ఫన్నీ జవాబు నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).


rakesh.sharma.sir అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ టీచర్ జవాబు పత్రాలను దిద్దుతున్నారు. హర్ష్ బెనివాల్ అనే విద్యార్థి ఆన్సర్ షీట్‌ను చూపిస్తున్నారు. ఒక్కో ప్రశ్నకు ఆ విద్యార్థి పొందిన మార్కులను చూపుతూ చివర్లో అతడు హిందీలో రాసిన దాన్ని చూపించారు. ``ఎంత చదివినా ఏం ఉపయోగం. ఏదో ఒకరోజు చనిపోవాలి. అయినా నేను పాస్ కావాలనుకుంటున్నా`` అంటూ ఆ కుర్రాడు వేదాంత ధోరణిలో ఫన్నీ లైన్స్ రాశాడు. అవి చూసి టీచర్ ఆశ్చర్యపోయాడు.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లక్షల్లో వ్యూస్ సంపాదించింది. 3.2 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``కుర్రాడు రాసిన అన్సర్ లీక్ అయింది``, ``వెరీ ఫన్నీ`` అంటూ కామెంట్లు చేశారు. అంతేకాదు టీచర్ చేసిన ఆ పోస్ట్‌కు హర్ష్ బెనివాల్ కూడా స్పందిస్తూ.. ``థాంక్యూ సర్`` అని కామెంట్ చేశాడు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. యూట్యూబర్‌కు కూడా ఇంత పిచ్చి ఫ్యాన్స్ ఉంటారా? ఐషో స్పీడ్‌కు నార్వేలో చుక్కలు చూపించిన ఫ్యాన్స్!


Viral Video: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కే షాక్.. పానీపూరీ అమ్మే వ్యక్తి సంపాదన ఎంతో విని కళ్లు తేలేసిన యువతి!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 05 , 2024 | 01:41 PM