Share News

Viral Video: ఇదొక వింత రెస్టారెంట్.. ప్లేట్‌లను వాడరు.. ఫుడ్ ఎలా సర్వ్ చేస్తున్నారో చూడండి..

ABN , Publish Date - Jul 05 , 2024 | 10:12 AM

ఇటీవలి కాలంలో జనాలకు బయట ఆహారం తినే అలవాటు విపరీతంగా పెరిగిపోయింది. వీకెండ్ వచ్చినా లేదా ఏదైనా ప్రత్యేక సందర్భంలోనూ చాలా మంది రెస్టారెంట్లకు క్యూ కడుతున్నారు. దీంతో రెస్టారెంట్లు రకరకాల ప్రయోగాలతో జనాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తూ తమ బిజినెస్ పెంచుకుంటున్నాయి.

Viral Video: ఇదొక వింత రెస్టారెంట్.. ప్లేట్‌లను వాడరు.. ఫుడ్ ఎలా సర్వ్ చేస్తున్నారో చూడండి..
Thailand Restaurant

ఇటీవలి కాలంలో జనాలకు బయట ఆహారం (Food) తినే అలవాటు విపరీతంగా పెరిగిపోయింది. వీకెండ్ వచ్చినా లేదా ఏదైనా ప్రత్యేక సందర్భంలోనూ చాలా మంది రెస్టారెంట్లకు (Restaurant) క్యూ కడుతున్నారు. దీంతో రెస్టారెంట్లు రకరకాల ప్రయోగాలతో జనాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తూ తమ బిజినెస్ పెంచుకుంటున్నాయి. రకరకాల థీమ్‌లతో జనాలను ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లోని ఓ రెస్టారెంట్ (Thailand Restaurent) అలాంటి వెరైటీ టెక్నిక్‌తో జనాలను ఆకట్టుకుంటోంది. ఆ రెస్టారెంట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


asistenliburan అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ రెస్టారెంట్ ఆహార ప్రియులతో కిటకిటలాడుతోంది. అయితే ఆ రెస్టారెంట్ సిబ్బంది చాలా వెరైటీగా తమ వినియోగదారులకు ఫుడ్ అందిస్తున్నారు. సాధారణంగా ఏ రెస్టారెంట్‌లో అయినా ప్లేట్‌లలో ఆహారం వడిస్తారు. అయితే ఆ రెస్టారెంట్లో మాత్రం కార్లు, ప్లాస్టిక్ చైర్లు, మేజిక్ జార్లు, ప్లాస్టిక్ రాక్‌లు, జెర్రీ క్యాన్‌ల బొమ్మల్లో ఆహారాన్ని నింపి అందిస్తున్నారు. వినియోగదారులు వెరైటీగా అక్కడి ఆహారాన్ని ఆస్వాదిస్తున్నారు.


ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 50 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. 4 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది వెరీ ఫన్నీ``, ``మనం కోరుకున్న బొమ్మలో ఫుడ్ ఇస్తారా?``, ``ప్లాస్టిక్‌లో ఫుడ్ తినడం మంచిది కాదు``, ``ఆ రెస్టారెంట్‌కు పిల్లలను తీసుకెళితే కష్టమే`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కే షాక్.. పానీపూరీ అమ్మే వ్యక్తి సంపాదన ఎంతో విని కళ్లు తేలేసిన యువతి!


Puzzle: ఈ ఫొటోలోని అమ్మాయిలో ఏదో తేడా ఉంది.. 8 సెకెన్లలో కనిపెడితే మీ పరిశీలనా శక్తి గొప్పదే!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 05 , 2024 | 10:12 AM