Share News

Viral Video: వామ్మో.. ఇదెక్కడి సర్‌ప్రైజ్ రా బాబూ.. బర్త్‌డే విషెస్ పేరుతో ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్‌కు నిప్పు.. తర్వాతేం జరిగిందంటే..

ABN , Publish Date - Sep 28 , 2024 | 08:37 AM

స్నేహితుడి బర్త్ డే పార్టీకి ఎలాంటి సర్‌ప్రైజ్ ఇవ్వాలా అని ఫ్రెండ్స్ తెగ ఆలోచిస్తుంటారు. కొందరు పార్టీలు ఇస్తుంటారు. మరికొందరు కేక్ తీసుకొచ్చి కట్ చేయిస్తుంటారు. స్నేహితుడి జీవితంలోని అతి ముఖ్యమైన రోజును అతడికి గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేయాలని అనుకుంటారు.

Viral Video: వామ్మో.. ఇదెక్కడి సర్‌ప్రైజ్ రా బాబూ.. బర్త్‌డే విషెస్ పేరుతో ఫ్రెండ్ ప్రైవేట్ పార్ట్‌కు నిప్పు.. తర్వాతేం జరిగిందంటే..
Birthday Surprise Turns Disastrous

స్నేహితుడి (Friend) బర్త్ డే పార్టీకి ఎలాంటి సర్‌ప్రైజ్ (Birthday Surprise) ఇవ్వాలా అని ఫ్రెండ్స్ తెగ ఆలోచిస్తుంటారు. కొందరు పార్టీలు ఇస్తుంటారు. మరికొందరు కేక్ తీసుకొచ్చి కట్ చేయిస్తుంటారు. స్నేహితుడి జీవితంలోని అతి ముఖ్యమైన రోజును అతడికి గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేయాలని అనుకుంటారు. కొందరు మాత్రం ఫ్రెండ్‌కు వినూత్నంగా బర్త్ డే విషెస్ చెప్పాలని పిచ్చి పనులు చేస్తుంటారు. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో వీడియోల కోసం కొందరు పిచ్చి ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది (Viral Video).


@gharkekalesh అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. బర్త్ డే బాయ్ తన గదిలో ప్రశాంతంగా పడుక్కున్నాడు. ఆ సమయంలో అతడి స్నేహితులు సైలెంట్‌గా రూమ్‌లోకి ప్రవేశించారు. అతడి ప్యాంట్‌పై ఏదో ఆయిల్ వేశారు. ఆ తర్వాత అగ్గిపుల్లతో ఆ కుర్రాడి ప్యాంట్‌కు నిప్పంటించారు. ``హ్యాపీ బర్త్‌ డే టూ యూ`` అంటూ గట్టిగా పాట అందుకున్నారు. హఠాత్తుగా లేచిన ఆ కుర్రాడు తన ప్యాంట్‌కు అంటుకున్న నిప్పును చూసి ఒక్కసారిగా భయపడిపోయాడు.


వెంటనే వెనక్కి తిరిగి ఆ మంటను ఆర్పేసుకున్నాడు. అనంతరం స్నేహితులను కొట్టడానికి వెళ్లాడు. కాసేపటి తర్వాత అతడి కోపం చల్లారి వాళ్లతో కలిసిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వైరల్ వీడియోను 6.5 లక్షల మంది వీక్షించారు. 4 వేల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది చాలా కాస్ట్లీ సర్‌ప్రైజ్``, ``ఇది చాలా భయంకరం``, ``ఇది చాలా డేంజరస్ సర్‌ప్రైజ్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

IQ Test: మీ ఐక్యూ ఏ స్థాయిలో ఉందో టెస్ట్ చేసుకోండి.. ఈ ముగ్గురిలో బాస్ ఎవరో కనిపెట్టండి..



Viral Video: వామ్మో.. చీమ కూడా ఇంతలా భయపెడుతుందా? జర్మన్ ఫొటోగ్రాఫర్ తీసిన ఫొటో చూస్తే షాకవ్వాల్సిందే..


Viral Video: 5 రూపాయలతో 50 కిలోమీటర్లు.. బీహార్ కుర్రాడు తయారు చేసిన ఈ వెరైటీ బైక్ స్పెషాలిటీ ఏంటంటే..


Viral Video: తెలివంటే ఇదీ.. బైక్ ఇంజిన్, ఫ్యాన్‌తో వినూత్న వాహనం.. గాల్లోకి ఎగిరే చౌకైన విహంగం..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Sep 28 , 2024 | 08:37 AM