Share News

Viral: సుధామూర్తి చెప్పిన జీవిత సత్యం! యువత పెళ్లికి ముందే ఇది తెలుసుకోవాలి!

ABN , Publish Date - Jun 28 , 2024 | 07:26 PM

స్త్రీ పురుష సమానత్వం అర్ధాన్ని సైకిల్ ఉదాహరణతో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్మన్ సుధామూర్తి వివరించిన తీరు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Viral: సుధామూర్తి చెప్పిన జీవిత సత్యం! యువత పెళ్లికి ముందే ఇది తెలుసుకోవాలి!

ఇంటర్నెట్ డెస్క్: నేటి జమానాలో వైవాహిక వ్యవస్థ పెను మార్పులకు లోనవుతోంది. ప్రేమ, బాధ్యత, సర్దుబాటు ధోరణుల స్థానంలో హక్కులు, అధికారాలు వచ్చి చేరడంతో వైవాహిక బంధానికి బీటలు వారుతున్న ఘటనలు అనేక వెలుగు చూస్తున్నాయి. ఇగోలు అనేక బంధాల్ని తెంచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు స్త్రీపురుష సమానత్వం అంటే ఏంటో రాజ్యసభ ఎంపీ, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్మన్ సుధామూర్తి వివరించిన తీరు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ (Viral) అవుతోంది.


ఈ ఘటన ఎప్పుడు జరిగిందీ తెలియకపోయినప్పటికీ సుధా మూర్తి సూచన మాత్రం నెట్టింట పెద్ద చర్చకు దారి తీసింది. ‘‘జీవితం సైకిల్ లాంటిది. సైకల్ ముందుకు సాగాలంటే రెండు చక్రాలు అవసరం. ఒకటి చక్రం స్త్రీ అయితే మరో చక్రం పురుషుడు. నాకు ఆ చక్రం అవసరం లేదు అని అంటే జీవితం ముందుకు సాగదు’’ అని సుధామూర్తి అన్నారు. స్త్రీపురుషులు సమానత్వం భిన్నరకాలుగా ఉంటుందని ఆమె వివరించారు. స్త్రీలకు సహజంగానే ఇతరుల భావోద్వేగాలను అంచనా వేసి అర్థం చేసుకునే శక్తి ఎక్కువగా ఉంటుందని అన్నారు. స్త్రీలు సమర్థవంతంగా సంస్థల్లో మేనేజర్ల పాత్ర పోషించగలరని అన్నారు. అయితే, పురుషులకు మాత్రం ఎమోషనల్ కోయిఫిషెంట్ కాస్త తక్కువగా ఉంటుందని చెప్పారు (Sudha Murty Describes Gender Equality With Bicycle Analogy In Viral Video).

Viral: 5 స్టార్ హోటల్ బాల్కనీలో దుస్తులు ఆరేసిన భారతీయ మహిళ! చివరకు..


కాగా, ఈ వీడియోపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. అనేక మంది సుధామూర్తి అభిప్రాయంతో ఏకీభవించారు. జీవన ప్రయాణం సాఫీగా సాగిపోవాలంటే స్త్రీ పురుషులకు ఒకరి తోడు మరొకరికి అవసరమన్నారు. పెళ్లి చేసుకోబోయే జంటలు ఈ సత్యం తప్పక తెలుసుకోవాలని కొందరు కామెంట్ చేశారు. కొందరు మాత్రం ఆధునిక కాలంలో వైవాహిక బంధం బలహీనపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఒంటరి వాళ్ల సంఖ్య విపరీతంగా పెరుగుతుందని జోస్యం చెప్పారు.

Read Viral and Telugu News

Updated Date - Jun 28 , 2024 | 07:30 PM