Share News

Super Blue Moon: ఈ రోజు కనిపించనున్న సూపర్ బ్లూ మూన్... ఇది నిజంగా నీలం రంగులో ఉంటుందా..?

ABN , Publish Date - Aug 19 , 2024 | 01:45 PM

ఆగస్టు 19 వ తేదీ సోమవారం భారతదేశం అంతా రాఖీ పూర్ణిమ హేళలో మునిగిపోతుంది. కానీ ప్రపంచం మాత్రం ఆకాశం వైపు ఆశ్చర్యంగా చూడటానికి సంసిద్దమవబోతోంది. దీనికి కారణం సూపర్ బ్లూ మూన్.

Super Blue Moon: ఈ రోజు కనిపించనున్న సూపర్ బ్లూ మూన్... ఇది నిజంగా నీలం రంగులో ఉంటుందా..?
Super blue Moon

చంద్రుడికి సంబంధించిన సంఘటనలు అన్ని పౌర్ణమి రోజే చోటు చేసుకుంటాయి. ఆగస్టు 19 వ తేదీ సోమవారం భారతదేశం అంతా రాఖీ పూర్ణిమ హేళలో మునిగిపోతుంది. కానీ ప్రపంచం మాత్రం ఆకాశం వైపు ఆశ్చర్యంగా చూడటానికి సంసిద్దమవబోతోంది. దీనికి కారణం సూపర్ బ్లూ మూన్. సూపర్ బ్లూ మూన్ ఖగోళ చరిత్రలో చాలా అరుదుగా చోటు చేసుకునే సందర్భం. సూపర్ మూన్, బ్లూ మూన్ అనే పదాలు తరచుగా వింటూనే ఉంటాం. ఈ రోజు ఆవిష్కారం కాబోతున్న సూపర్ బ్లూ మూన్ ఎలా ఏర్పడుతుంది? ఈరోజు చందమామ నిజంగానే నీలం రంగులో ఉంటుందా? తెలుసుకుంటే..

Super Blue Moon: రాఖీ పౌర్ణమి రోజు అరుదైన దృశ్యం.. ఈ రోజు చంద్రుడు ఎలా ఉంటాడంటే..!



సూపర్ బ్లూ మూన్ ఖగోళ శాస్త్రంలో అద్భుతంగా ఆవిష్కారం కాబోతోంది. ఇది చాలా అరుదుగా చోటు చేసుకునే సంఘటన. చంద్రుడు భూమికి 90శాతం దగ్గరగా వచ్చినప్పుడు చంద్రుడు సాధారణం కంటే పెద్దగా కనిపిస్తాడు. ఈ సందర్బంలో చందమామను సూపర్ మూన్ అంటారు. ఇక సంవత్సరం క్యాలెండర్ లో నాలుగు పౌర్ణమిలలో మూడవ పౌర్ణమి నాడు బ్లూ మూన్ ఏర్పడుతుంది.

టీ ని మళ్ళీ వేడి చేసి తాగుతుంటారా? ఈ నిజాలు తెలిస్తే..!


నిజంగానే నీలం రంగులో ఉంటుందా?

సూపర్ మూన్ పేరుకు తగ్గట్టు పెద్దగా ఉన్నట్టే బ్లూ మూన్ దాని పేరుకు తగ్గట్టు నీలం రంగులో ఉంటుందని చాలా మంది అనుకుంటారు. అయితే ఇది నిజం కాదు. నిజానికి బ్లూ మూన్ చోటు చేసుకునే రోజు చంద్రుడు నీలం రంగులో ఉండడు. ధూళి లేదా పొగ వంటి చిన్న చిన్న కణాలు ఎరుపు రంగులో ఉండే కాంతి తరంగ దైర్ఘ్యాలను చెదరగొడుతుంటాయి. దీని వల్ల చంద్రుడు నీలం రంగులో కనిపిస్తాడట. ఈ విషయాన్ని NASA తెలిపింది. అయితే సూపర్ మూన్, బ్లూ మూన్ రెండూ రాఖీ పూర్ణిమ రోజే రావడంతో సూపర్ బ్లూ మూన్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇలాంటి సూపర్ బ్లూ మూన్ తరువాత 2037లోనే చూడగలమట. అందుకే ఈ రోజు ఆకాశంలో సూపర్ బ్లూ మూన్ ను అందరూ వీక్షించండి. సూపర్ బ్లూ మూన్ వెన్నెల వెలుగులో రాఖీ సంబరాలు చేసుకోండి.

ఈ సమస్యలున్నవారు పొరపాటున కూడా వాల్నట్స్ తినకూడదు..!

ఖాళీ కడుపుతో నానబెట్టిన జీడిపప్పు తింటే ఏం జరుగుతుందంటే..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Aug 19 , 2024 | 01:45 PM