Share News

Viral Wedding Card: వేరే లెవల్ థింకింగ్.. వెరైటీ వెడ్డింగ్ కార్డ్

ABN , Publish Date - Sep 21 , 2024 | 07:13 PM

ప్రతిదీ వినూత్నంగా ఆలోచించే కుర్రకారు.. తమ పెళ్లి కార్డులను కూడా విభిన్నంగా డిజైన్ చేయిస్తోంది.

Viral Wedding Card: వేరే లెవల్ థింకింగ్.. వెరైటీ వెడ్డింగ్ కార్డ్

ఇంటర్నెట్ డెస్క్: ప్రతిదీ వినూత్నంగా ఆలోచించే కుర్రకారు.. తమ పెళ్లి కార్డులను కూడా విభిన్నంగా డిజైన్ చేయిస్తోంది. మొన్నటికి మొన్న కరీంనగర్‌కు చెందిన ఓ పెళ్లి కొడుకు పూర్తి తెలంగాణ యాసలో పత్రికను అచ్చు వేయించాడు. సదరు వెడ్డింగ్ కార్డు నెట్టింట వైరల్ అయింది. తాజాగా మరో యువకుడు తన వివాహ పత్రికను వినూత్నంగా డిజైన్ చేయించారు. ఆ కార్డు ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇంతకు పెళ్లి పత్రికలో ఉన్న ప్రత్యేకత ఏంటా అనుకుంటున్నారా.. అది యాపిల్ మ్యాక్‌బుక్ రూపంలో ఉండటమే.


అచ్చం మ్యాక్ బుక్‌లా ఉన్న ఈ పెళ్లి పత్రిక ముచ్చట్లేంటో తెలుసుకుందామా.. తమిళనాడుకు చెందిన డీఎస్పీ మనోజ్‌కుమార్‌ తన వివాహానికి ఆహ్వానిస్తూ.. ఈ పత్రికను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాన్ని చూసిన వారు పక్కాగా మ్యాక్ బుక్కే అనుకుంటారు. దాన్ని తరచి చూస్తే తప్ప నిజమేంటో ఎవరికీ తెలియదు అదొక పెళ్లి పత్రిక అని. పత్రికను తెరిచి చూస్తే అందులో ఓవైపు గూగుల్‌ క్రోమ్ బ్రౌజర్, మరోవైపు కీ బోర్టు కనిపిస్తోంది. బంధుమిత్రులంతా మనోజ్‌, షాలినీల పెళ్లి వేడుక గురించి గూగుల్‌లో సెర్చ్‌ చేసినట్లు ఇందులో చూపించారు. మూహూర్త సమయం, కళ్యాణ వేదికకు సంబంధించిన వివరాలతో పాటు గూగుల్‌ లొకేషన్‌ కూడా ఇచ్చారు. ఇలా చిత్రవిచిత్రంగా ఉన్న ఈ వెడ్డింగ్ కార్డైతే నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. కొందరు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ఆ పెళ్లి పత్రిక వీడియో ఏంటో చూసేయండి..

Viral News: తెలంగాణ యాసలో పెళ్లి కార్డు.. నెటిజన్లు ఫిదా

Prasadam Row: ప్రసాదంలోనూ.. గీ..కుడేనా!?
Ghee: స్వచ్చమైన నెయ్యిని ఎలా గుర్తించాలి? తిరుపతి లడ్డులో కల్తీ నెయ్యి వెనుక బయటపడిన నిజాలేంటి?

Updated Date - Sep 21 , 2024 | 07:23 PM