Share News

Viral: బట్టతలను జయించిన మిలియనీర్! ఈయన టెక్నిక్ ఏంటంటే..

ABN , Publish Date - Oct 24 , 2024 | 04:40 PM

బహుళ అంచెల వ్యూహంతో తాను బట్టతల నుంచి ఎలా విముక్తి పొందిందీ చెబుతూ ఓ టెక్ మిలియన్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. జనాలు ఆశ్చర్యపోయేలా చేస్తోంది.

Viral: బట్టతలను జయించిన మిలియనీర్! ఈయన టెక్నిక్ ఏంటంటే..

ఇంటర్నెట్ డెస్క్: బ్రయన్ జాన్సన్.. 47 ఏళ్ల ఈ టెక్ మిలియనీర్ ఈ మధ్య కాలంలో సంచలనాలకు కేరాఫ్‌గా మారారు. ప్లాస్మా థెరపీతో 20 ఏళ్ల నాటి యవ్వనాన్ని సొంతం చేసుకున్నానంటూ ఇటీవల హల్‌చల్ చేసిన ఆయన తాజాగా బట్టతలనూ జయించొచ్చంటూ రుజువులతో సహా జనాల ముందుకొచ్చారు. 47 ఏళ్ల వయసులో పూర్తిగా బట్టతల రావాల్సిన స్థితి నుంచి తప్పించుకున్నానని ఆయన చేసిన ప్రకటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. జనాలు ఆశ్చర్యపోయేలా చేస్తోంది.

Viral: ఇందుకేగా పిల్లల జీవితాలు నాశనమయ్యేది! తండ్రి అయ్యుండీ ఇలా చేయొచ్చా?


‘‘జన్యుపరంగా చూస్తే నాకిప్పటికే బట్టతల వచ్చేయాలి. 20ల్లో ఉండగానే జుట్టు ఊడటం మొదలైంది. తెల్లజుట్టు కూడా వచ్చేసింది. ఇప్పుడు నాకు 47 ఏళ్లు. ఈ వయసులో నేను ఒత్తైన జుట్టును సొంతం చేసుకున్నాను. 70 శాతం తెల్లజుట్టు లేదు. ఇదెలా సాధ్యమైందంటే..’’ అంటూ ఆయన తను అనుసరించిన విధానం గురించి వివరించారు.

బహుళ అంచెల వ్యూహాన్ని అనుసరించి తాను బట్టతల బారిన పడకుండా తప్పించుకున్నానని బ్రయన్ చెప్పుకొచ్చారు. ఓ ప్రత్యేక మైన ఆయిల్ నెత్తికి రాసుకోవడంతో పాటు రెడ్ లైట్ థెరపీ, పోషకాహారంతో బట్టతలను నివారించానని వివరించారు. తాను వాడిన నూనెలో మినాక్సిడిల్, మెలటోనిన్, కెఫీన్, విటమిన్ డీ3 ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ఈ చికిత్సలో మినాక్సిడిల్‌ అత్యంత కీలకమని, అయితే, దీన్ని తక్కువ మోతాదులోనే వాడాలని సూచించారు. లేకపోతే అవాంఛిత రోమాల సమస్య, తలనొప్పి వేధిస్తాయని హెచ్చరించారు. ఎర్రకాంతిని వెదజల్లే ఓ ప్రత్యేకమైన టోపీతో కూడా మంచి ఫలితాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఎర్రనికాంతి వల్ల శిరోజాలు దృఢంగా మారతాయని, చర్మానికి రక్తప్రసరణ పెరిగి జుట్టు కుదుళ్లు బలంగా మారతాయని వివరించారు.

Viral: బాయ్‌ఫ్రెండ్‌కు కోట్ల ఆస్తి వారసత్వంగా రానుందని తెలిసి హత్య! చివరకు..


పలు ప్రైవేటు సంస్థలు కూడా ప్రస్తుతం బట్టతల చికిత్సలపై పరిశోధనలు చేస్తున్నాయని, కొన్ని విధానాల తాలుకు ఫలితాలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. అయితే, ఇవి మార్కెట్లోకి వచ్చేందుకు ఇంకా కొన్నేళ్ల సమయం పడుతుందని అన్నారు.

యవ్వనంగా కనబడేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్న బ్రయన్.. వృద్ధాప్యం దరిచేరకుండా ఉండేందుకు వివిధ రకాల చికిత్సలపై ఏటా 2 మిలియన్ల డాలర్లకు పైగా ఖర్చుపెడుతున్నారు. పోషకాహారం, తగినంత నిద్ర వంటి విషయాల్లో పక్కా షెడ్యూల్ ఫాలో అవుతూ వృద్ధాప్యాన్ని వాయిదే వేసేందుకు, కోల్పోయిన యవ్వనాన్ని వీలైనంతగా తిరిగి తెచ్చుకునేందుకు ప్రయత్ని్స్తున్నారు. కొన్నేళ్ల క్రితం బ్రెయిన్ ట్రీ పేమెంట్ సొల్యూషన్స్ అనే డిజిటల్ చెల్లింపుల కంపెనీని బ్రయన్ స్థాపించారు. ఆ తరువాత దాన్ని 800 మిలియన్ డాలర్లకు ఈబే సంస్థకు అమ్మేసి మిలియనీర్‌గా అవతరించారు. ప్రస్తుతం ఆయన నికర సంపద విలువ 400 మిలియన్ డాలర్లని సమాచారం.

Viral: ఎడారిలో చిక్కుకుపోయిన యువతులకు వింత అనుభవం! ఉబెర్ యాప్‌లో ఒంటెల సవారీ!


Read Latest and Viral News

Updated Date - Oct 24 , 2024 | 04:50 PM