Viral: బాబోయ్.. బాణసంచా దుకాణం పెట్టుకున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్!
ABN , Publish Date - Oct 27 , 2024 | 08:51 PM
సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ఓ వ్యక్తి దీపావళి సందర్భంగా బాణసంచా షాపు పెట్టడం నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసి జనాలు ఆశ్చర్యపోతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మరికొద్ది రోజుల్లో భారతీయులంతా దీపావళి జరుపుకోబోతున్నారు. మార్కెట్లో ఇప్పటికే ఈ సందడి కనిపిస్తోంది. అనేక చోట్ల బాణసంచా షాపులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చేసిన పని నెటిజన్లను ఆకట్టుకుంటోంది. రే పేరిట ఉన్న అకౌంట్లో సదరు టెకీ తాను ఈ దీపావళికి ఏం చేయబోతోందీ చెప్పుకొచ్చాడు (viral).
Viral: ప్రపంచంలో తొలిసారిగా ‘డిజిటల్ కండోమ్’ను రూపొందించిన జర్మన్ కంపెనీ!
ఈ సారి తాను స్వస్థలంలో బాణసంచా షాపు పెట్టబోతున్నట్టు అతడు చెప్పుకొచ్చాడు. మరికొందరు స్నేహితులతో కలిసి ఈ షాపును ఏర్పాటు చేసినట్టు వివరించాడు. ఇందుకు సంబంధించిన అధికారిక అనుమతులన్నీ తెచ్చుకున్నట్టు కూడా వివరించారు. త్వరలో ఈ షాపు ప్రారంభిస్తామని తెలిపాడు. ఉదయం 10 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ ఆఫీసు పని చూసుకుని ఆ తరువాత రాత్రి 9 గంటల వరకూ షాపులో కూర్చుని టపాసులు అమ్ముతానని అన్నాడు. తానుండే చోట స్థానికులు ఆన్‌లైన్‌లో వస్తువులు కొనేందుకు ఇష్టపడరని, అందుకే ఇలా షాపు ప్రారంభించాననని వివరించాడు. అయితే, తన స్వస్థలం ఏదో మాత్రం అతడు చెప్పలేదు.
Viral: బాస్ తిట్టడంతో షాక్! చలనం లేకుండా బొమ్మలా మారిపోయిన యువతి!
ఈ ఉదంతం నెట్టింట తెగ వైరల్ అయ్యింది. అనేక మంది అతడి వ్యాపారదృక్పథాన్ని మెచ్చుకున్నారు. సమయానుకూలమైన వ్యాపారాన్ని ఎంచుకున్నావని అన్నారు. మరికొందరు మాత్రం ఆశ్చర్యపోయారు. ఇది చాలా శ్రమతో కూడుకున్న సైడ్ బిజినెస్ అని, అతడి ధైర్యానికి మెచ్చుకోవాల్సిందేనని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం వైరల్‌గా మారింది.
ఇదిలా ఉంటే, దేశరాజధాని ఢిల్లీలో బాణసంచా కాల్చడంపై పూర్తిస్థాయి నిషేధం అమలవుతోంది. గ్రీన్ క్రాకర్స్‌పై కూడా నిషేధం విధించారు. అయితే, పొరుగు రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరప్రదేశ్‌లల్లో మాత్రం గ్రీన్ క్రాకర్స్‌ను ప్రత్యేక సమయాల్లో మాత్రమే కాల్చేందుకు స్థానిక అధికారులు అనుమతించారు.
Viral: దీపావళి రోజున ఇంట్లో ఒంటరిగా మహిళ! ఇంతలో ఊహించని విధంగా..