Share News

Viral News: పెళ్లికి ముందు ఊహించని ట్విస్ట్.. వైద్య పరీక్షల్లో షాకింగ్ రిజల్ట్

ABN , Publish Date - May 06 , 2024 | 03:17 PM

అది చైనాలోని హుబీ ప్రావిన్స్. స్థానికంగా నివాసముంటున్న దంపతులకు ఓ కుమార్తె ఉంది. ఆమె పెళ్లీడుకి రావడంతో, ఒక అబ్బాయితో పెళ్లి నిశ్చయించారు. ఏప్రిల్ నెలలో అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలని ముహూర్తం..

Viral News: పెళ్లికి ముందు ఊహించని ట్విస్ట్.. వైద్య పరీక్షల్లో షాకింగ్ రిజల్ట్

అది చైనాలోని (China) హుబీ ప్రావిన్స్. స్థానికంగా నివాసముంటున్న దంపతులకు ఓ కుమార్తె ఉంది. ఆమె పెళ్లీడుకి రావడంతో, ఒక అబ్బాయితో పెళ్లి నిశ్చయించారు. ఏప్రిల్ నెలలో అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలని ముహూర్తం ఖరారు చేశారు. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను కూడా మొదలుపెట్టారు. కానీ.. ఇంతలోనే ఓ షాకింగ్ ట్విస్ట్ వెలుగు చూసింది. మరికొన్ని రోజుల్లోనే పెళ్లి ఉందనగా.. ఆ అమ్మాయి కడుపులో విపరీతమైన నొప్పి వచ్చింది. దీంతో వైద్య పరీక్షలు చేయించగా.. ఎవ్వరూ ఊహించని సంచలన రిపోర్ట్ బయటపడింది. ఆమె అమ్మాయి కాదు, అబ్బాయి అని విషయం తేలింది. దీంతో.. కుటుంబ సభ్యులందరూ ఖంగుతిన్నారు.


పిచ్చికి కూడా ఓ హద్దుండాలి భయ్యా! ప్రాణాలను రిస్క్‌లో పెట్టి మరీ..

ఆ యువతి పేరు లీ యువాన్ (Li Yuan) (పేరు మార్చబడింది). ఆమె వయసు 27 సంవత్సరాలు. పుట్టుకతో వచ్చే ‘అడ్రినల్ హైపర్‌ప్లాసియా’ అనే వ్యాధితో ఆమె బాధ పడుతున్నట్టు వైల్లడైంది. ఆమెకు గతంలోనూ ఇలాగే సమస్యలు ఎదురైనా.. పేరెంట్స్ పెద్దగా పట్టించుకోలేదు. ఆమెకు 18 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వైద్య పరీక్షలు చేయగా.. ఆమెలో అసాధారణ హార్మోన్లు ఉన్నాయని డాక్టర్లు గుర్తించారు. అంతేకాదు.. యవ్వనంలో అడుగుపెట్టినప్పి నుంచి ఆమె వక్షోజాల పెరుగుదల సరిగా లేకపోవడాన్ని వైద్యులు గమనించారు. ఇందుకు క్రోమోజోమ్‌ల పరీక్ష చేయించాలని ఆమె తల్లిదండ్రులను వాళ్లు సూచించారు. కానీ.. ఈ విషయాన్ని పేరెంట్స్ అంత సీరియస్‌గా తీసుకోలేదు.

నాగపూజ చేయమంటే.. ఏకంగా జీవించేశారు.. చివరికి..

ఈ క్రమంలోనే లీ యువాన్‌కు పెళ్లి ఫిక్స్ చేయడం, కొన్ని రోజుల్లోనే వివాహ వేడుక ఉందనగా ఆమె వైద్య పరీక్షలు చేయించుకోవడం, ఆమె పొట్టలో వృషణాలు (Testicles) ఉన్నాయని తేలడం జరిగింది. 27 ఏళ్ల పాటు మహిళగా జీవితం గడిపిన తమ కుమార్తె పురుషుడు అనే విషయం తెలిసి తల్లిదండ్రులు షాక్‌కి గురయ్యారు. ఫైనల్‌గా.. వైద్యులు ఆపరేషన్ నిర్వహించి, ఆమె పొట్టలో ఉన్న ఆ వృషణాలను తొలగించడం జరిగింది. ఇప్పుడు ఆమెకు ఫాలో-అప్ పరీక్షలు, దీర్ఘకాలిక హార్మోన్ థెరపీ అవసరమని డాక్టర్లు చెప్పారు. అయితే.. ఆమె పెళ్లి సంగతులపై ఎలాంటి వివరాలు అందుబాటులో లేవు.

Read Latest Viral News and Telugu News

Updated Date - May 06 , 2024 | 03:17 PM