Share News

Job Offer: జస్ట్ స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తే చాలు.. సంవత్సరానికి రూ. 30 కోట్ల జీతం..!

ABN , Publish Date - Aug 24 , 2024 | 09:37 PM

The Pharos Lighthouse: కొన్ని ఉద్యోగాల గురించి వింటే విచిత్రంగా ఉంటాయి. అలాంటి విచిత్రమైన ఉద్యోగాల్లో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఉద్యోగం కూడా ఒకటి. చేసే పని తక్కువే అయినా.. జీతం మాత్రం కోట్లలో ఉంది. జస్ట్ స్విచ్ ఆన్ ఆప్ చేస్తే చాలు రూ. 30 కోట్లు జీతం పొందవచ్చు. మరి ఆ జాబ్ ఏంటి? ఎక్కడ ఉంది ఈ ఉద్యోగం..

Job Offer: జస్ట్ స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తే చాలు.. సంవత్సరానికి రూ. 30 కోట్ల జీతం..!
The Pharos Light House

30 Crores Job Offer: ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాల ఉద్యోగాలు ఉన్నాయి. కొన్ని ఉద్యోగాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. అలాంటి ఉద్యోగం గురించే ఇప్పుడు మనం తెలుసుకుంది. ఈ ఉద్యోగంలో చేసే పని తక్కువగా ఉన్నా.. జీతం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఇంతకీ ఈ ఉద్యోగం ఎక్కడ ఉంది? ఏం పని చేయాలి? జీతంతో పాటు.. ఇంకా ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా? వంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.


ఈ ఉద్యోగం చేయాల్సింది ఒక లైట్ హౌస్‌పై. సాధారణంగా సముద్రంలో ఓడలకు మార్గనిర్దేశం చేసేందుకు ఈ లైట్‌ హౌస్‌లను ఉపయోగిస్తారు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకునే లైట్ హౌస్ చాలా పురాతనమైన.. పేరు ప్రఖ్యాతులు కలిగినది. సాహసాలు చేసేందుకు ఇష్టపడే వారికి.. ఈ ప్రదేశం, ఈ ఉద్యోగం అనువైనదిగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉద్యోగం చేసే వారికి ఏడాదికి రూ. 30 కోట్ల జీతం ఇస్తారు. అంతేకాలు.. ఇతర విలాసవంతమైన సౌకర్యాలు కూడా కల్పిస్తారు. అయితే, ఇక్కడ ఉద్యోగం చేయడం అంత ఈజీ కాదు. చాలా ప్రమాదకరమైన ఉద్యోగంగా దీనిని పేర్కొంటారు.


ఈ ప్రదేశం ఎక్కడుంది? అసలు దీని చరిత్ర ఏంటి?

ప్రముఖ నావికుడు కెప్టెన్ మారిషస్ సముద్రంలో ప్రయాణిస్తుండగా.. ఒకసారి ఈజిప్టులోని అలెగ్జాండ్రియా సమీపంలో భారీ తుఫానును ఎదుర్కొన్నాడు. ఈ ప్రాంతంలో చాలా పెద్ద రాళ్లు ఉండేవి. ఫలితంగా మారిషస్ నౌకకు భారీ నష్టం జరిగింది. అంతేకాదు.. పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. అందుకే ఈ ప్రదేశంలో లైట్ హౌస్ ఉండాల్సిన అవసరం ఉందని మారిషస్ ద్ఘాటించారు. దీంతో అక్కడి పాలకు సైతం దీనిని సమర్థించారు. ఈ ప్రదేశంలో ఓడలకు మార్గనిర్దేశం చేసేందుకు లైట్ హౌస్ అవసరమని అక్కడి పాలకులు వాస్తుశిల్పిని పిలిచారు. ఈ ప్రాంతంలోని రాళ్ల కారణంగా నౌకలు దెబ్బతినకుండా ఉండేందుకు సముద్రం మధ్యలో లైట్‌హౌస్‌ను నిర్మించాలని వాస్తుశిల్పిని ఆదేశించారు.


ప్రత్యేక ఏర్పాట్లు..

మొత్తానికి ఈజిప్టులోని అలెగ్జాండ్రియాలోని ఫారోహ్ ద్వీపంలో లైట్‌హౌస్‌ను నిర్మించారు. దీనిని 'ది ఫారోస్ ఆఫ్ అలెగ్జాండ్రియా' అని కూడా పిలుస్తారు. ఈ భవనం అద్భుతమైన నిర్మాణ శైలిని కలిగి ఉంది. ఈ దీపస్తంభంలో మొదట అగ్నిని వెలిగించేవారు. ఈ కాంతి చాలా దూరం కనిపించేది. లెన్స్ సహాయంతో ఈ అగ్నిని దూరం నుంచి చూసే వ్యవస్థను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. తద్వారా ఇక్కడికి వచ్చే నౌకలు ప్రమాదాలకు గురవకుండా సేఫ్‌గా ఒడ్డుకు చేరుకునేవి.


పూర్వ కాలంలోనూ లైట్‌హౌస్‌లను ఉపయోగించడం జరిగింది. ఓడలు, ఓడలు దారితప్పకుండా ఉండేందుకు, ప్రమాదాలకు గురికాకుండా నిరోధించే ఉద్దేశ్యంతో లైట్‌హౌస్‌లు నిర్మించడం జరిగింది. అయితే, పూర్వం సముద్ర తీరం ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి మాత్రమే లైట్‌హౌస్‌లు నిర్మించారు. ఆ తర్వాత సముద్రంలో లోతులేని భాగం, రాళ్లు ఎక్కువగా ఉండే ప్రదేశాలను సైతం సూచిస్తూ కూడా వీటిని నిర్మించారు. విద్యుత్ కనుగొన్న తరువాత.. దీపకాంతి స్థానంలో విద్యుత్ లైట్స్‌ని లైట్‌హౌస్‌లో ఏర్పాటు చేశారు. ఈ విద్యుత్ దీపాల కాంతి చాలా దూరం కనిపించేలా ఏర్పాటు చేశారు.


చాలా ప్రత్యేకం..

అలెగ్జాండ్రియాలోని ఫారోల లైట్‌హౌస్ మానవుడు నిర్మించిన తొలి లైట్‌హౌస్‌లలో ఒకటి. ఈ లైట్ హౌస్ 284, 246 BC మధ్య నిర్మించారు. ఈ ప్రదేశానికి చేరుకోవడం నేటికీ సవాలే. అందుకే ఈ లైట్ హౌస్ ప్రపంచంలోని అత్యంత ప్రఖ్యాంతిగాంచినదిగా పరిగణిస్తారు.

Light-House.jpg


జీతం రూ. 30 కోట్లు..

ఇక ఇందులో లైట్ ఆన్ చేసే వ్యక్తి జీతం సంవత్సరానికి రూ. 30 కోట్లు. ఉద్యోగి చేసే పని ఏంటంటే లైట్ హౌస్‌లో విద్యుత్ దీపం నిరంతరంగా వెలుగుతూనే ఉండేలా చూసుకోవాలి. అయితే, ఈ లైట్ హౌస్ చాలా సంక్లిష్టమైన ప్రాంతంలో ఉంది. ఈ లైట్ హౌస్ చేరుకోవడం కూడా చాలా కష్టమైన పని. అందుకే.. ఈ లైట్ హైస్‌లో పని చేసే ఉద్యోగికి ఏకంగా రూ. 30 కోట్లు జీతం ఆఫర్ చేస్తున్నారు.


ఏం పని చేయాలి..?

ఈ లైట్ హైస్ నిర్మానుష్య ప్రాంతంలో ఉంటుంది. ఉద్యోగి అక్కడే నిసరించాల్సి ఉంటుంది. పైగా ఈ ప్రాంతంలో భారీగా ఉరుములు, మెరుపులు, తుపానులు సంభవిస్తాయి. ఇలాంటి పరిస్థితిలోనూ లైట్ హౌస్‌లో విద్యుత్ లైట్ ఆగిపోకుండా చూసుకోవాలి. అంతేకాదు.. ఈ లైట్ హౌస్‌ ఉన్న ప్రాంతంలో సముద్రపు అలలు భారీగా ఎగసిపడుతాయి. లైట్ సగం మేర నీటి అలలు ఎగసిపడుతాయి. ఇలాంటి పరిస్థితిలో ఒక్కోసారి ఉద్యోగా ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం కూడా ఉంది. అందుకే.. ఇక్కడ జాబ్ చేయడం అంత ఈజీగా కాదని చెబుతారు. ఈ కారణంగానే.. భారీ జీతం, సకల సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ ఉద్యోగం చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారట.


Also Read:

ఉద్యోగులకు కొత్త పెన్షన్ స్కీమ్..

N కన్వెన్షన్‌కు ఎందుకీ పరిస్థితి?

N కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా వివరణ

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 24 , 2024 | 09:37 PM