Share News

మాంత్రికుడి డైలాగ్‌... క్రేజీగా!

ABN , Publish Date - Oct 20 , 2024 | 07:27 AM

సోషల్‌ మీడియాలో మీమ్స్‌, కామెడీ సీన్స్‌లో, యువతరం మాటల్లో, యూట్యూబర్ల వ్లాగుల్లో, చిన్నపిల్లల ఊత పదాల్లో ఇప్పుడు ఓ డైలాగ్‌ మార్మోగిపోతోంది. ఇన్‌స్టా రీల్స్‌, ఎక్స్‌ పోస్టులనే బ్రేక్‌ చేస్తోంది. ఆ డైలాగ్‌... ‘చీన్‌ టపాక్‌ డమ్‌ డమ్‌’. ప్రసిద్ధ కార్టూన్‌ సిరీస్‌ ‘చోటా భీమ్‌’ నాలుగో సీజన్‌లో మాంత్రికుడు అనే ఈ డైలాగ్‌ వెనుక విశేషాలే ఇవి...

మాంత్రికుడి డైలాగ్‌... క్రేజీగా!

సోషల్‌ మీడియాలో మీమ్స్‌, కామెడీ సీన్స్‌లో, యువతరం మాటల్లో, యూట్యూబర్ల వ్లాగుల్లో, చిన్నపిల్లల ఊత పదాల్లో ఇప్పుడు ఓ డైలాగ్‌ మార్మోగిపోతోంది. ఇన్‌స్టా రీల్స్‌, ఎక్స్‌ పోస్టులనే బ్రేక్‌ చేస్తోంది. ఆ డైలాగ్‌... ‘చీన్‌ టపాక్‌ డమ్‌ డమ్‌’. ప్రసిద్ధ కార్టూన్‌ సిరీస్‌ ‘చోటా భీమ్‌’ నాలుగో సీజన్‌లో మాంత్రికుడు అనే ఈ డైలాగ్‌ వెనుక విశేషాలే ఇవి...

- ఈ డిజిటల్‌ ఎరాలో ఏ డైలాగ్‌ ఎప్పుడు పాపులర్‌ అవుతుందో ఎవరికీ తెలీదు. ‘చోటా భీమ్‌’ కార్టూన్‌ సిరీస్‌లో ‘టకియా’ అనే మాంత్రికుడు తన మంత్రాలతో ఊరి వారిని ఇబ్బంది పెడుతుంటాడు. దాంతో అతన్ని కొట్టి ‘ధోలక్‌పూర్‌’ కారాగారంలో బంధించేట్లు చేస్తాడు భీమ్‌. అక్కడ టకియాతో కలసి భోజనం చేస్తుంటారు తక్కిన ఖైదీలు. వీళ్లంతా భీమ్‌ వల్లనే జైలుకొచ్చామని చెబుతారు. భీమ్‌ను అంతం చేయాలంటారు. భోజనం సరిగా లేదని కన్నీళ్లు పెడుతుంటారంతా. ఆ సమయంలో ఈ మంత్రగాడు ప్లేట్‌ కింద పెట్టి తన రెండు చేతులను పైకెత్తి ‘చీన్‌ టపాక్‌ డమ్‌ డమ్‌’ అంటాడు. మంత్రవిద్యలో అదో మంత్రం టకియాకు. ఇదే ఇప్పుడు ఇంటర్నెట్‌ పుణ్యమా అని తెగ వైరల్‌ అవుతోంది.


- ఏది అర్థం కాకున్నా... అన్నం తింటున్నా... సమాధానం లేని ప్రశ్న అడిగినా... పానీ పూరీ తిన్నాక, బండివాడు పైసలు కట్టమన్నప్పుడు... ఇలా ఏ పిచ్చి పని చేసినా సరదాగా ‘చీన్‌ టపాక్‌ డమ్‌ డమ్‌’ అంటున్నారు యూట్యూబర్స్‌, ఇన్‌స్టా కుర్రోళ్లు. ‘బాహుబలి’ చిత్రంలో శివగామి ‘కట్టప్పా’ అని గట్టిగా అరిచే యూట్యూబ్‌ షార్ట్‌ వీడియోలో కూడా ‘చీన్‌ టపాక్‌ డమ్‌ డమ్‌’ డైలాగ్‌ వాయిస్‌ను జత చేశారు. ఇలా అవసరం ఉన్నా లేకున్నా అంతా సరదాగా వాడుతున్న డైలాగ్‌ ఇది.

- ఈ డైలాగ్‌ సౌండ్‌ జనాలను ఇంతలా ఊపేస్తుందని ‘చోటా భీమ్‌’ కార్టూన్‌ సిరీస్‌ నిర్వాహకులకే తెలీదు. ‘చోటా భీమ్‌’ సీజన్‌ 4లో 47 వ ఎపిసోడ్‌లో ఈ డైలాగ్‌ ఉంది.


- 1966లో వచ్చిన ‘లడ్కా లడ్కీ’ చిత్రంలో కిశోర్‌కుమార్‌, ముంతాజ్‌ జోడీగా నటించారు. ఈ చిత్రంలో కిశోర్‌కుమార్‌ పదే పదే ‘చీన్‌ పటాక్‌ డమ్‌ డమ్‌’ అంటాడు. అప్పట్లో కొందరు కామెడీ కోసం ఈ డైలాగ్స్‌ వేసుకునేవారట. ఆ డైలాగ్‌ను ‘చోటాభీమ్‌’లో తప్పుగా పలికించారని కొందరంటున్నారు. ఏమైతేనేం... 58 ఏళ్ల తర్వాత కిశ్‌ర్‌కుమార్‌ నాస్టాల్జియా డైలాగ్‌ ఇలా ఫన్నీగా వినపడటం విశేషమే.

- పిల్లలు అన్నం తిననని మారాం చేసినా, హోమ్‌వర్క్‌ చేయనని మంకుపట్టు పట్టినా... తల్లులు ‘చీన్‌ టపాక్‌ డమ్‌ డమ్‌’ అంటున్నారు. దాంతో బుద్ధిగా మారుతున్నారు పిల్లలు. ఇలాంటి చిత్ర విచిత్రమైన రీల్స్‌తో సోషల్‌ మీడియాలో వినోదం పండుతోంది.


nani3.2.jpg

- శ్రద్ధాకపూర్‌, ఐశ్వర్య శర్మ వంటి అనేకమంది సెలబ్రిటీలు కూడా ఈ డైలాగ్‌తో రీల్స్‌ చేయడంతో క్రేజీగా మారింది.

- డైలాగ్‌ పాపులర్‌ కావడంతో మార్కెట్‌ ఒక్కసారిగా ఈ క్రేజ్‌పై దృష్టి సారించింది. ఇంకేం... టీషర్టులు, బ్యాగులు, పిల్లల నోట్‌ పుస్తకాలు అన్నింటిపై డైలాగ్‌తో కూడిన టకియా ప్రత్యక్షమవుతున్నాడు.

Updated Date - Oct 20 , 2024 | 07:27 AM