Share News

Viral: రైళ్లల్లో వెళ్లే వాళ్లు జాగ్రత్త! ఈ దొంగ ఫోన్ కొట్టేసిన తీరు చూస్తే..

ABN , Publish Date - Jun 01 , 2024 | 06:00 PM

రైలు ప్రయాణికుడి నుంచి ఓ దొంగ ఫోను దొంగిలించిన తీరు నెట్టింట వైరల్ గా మారింది. జనాలు షాకయ్యేలా చేస్తోంది. ఇలా అయితే, రైలు ప్రయాణాలు కష్టమేనంటూ అనేక మంది కామెంట్ చేస్తున్నారు.

Viral: రైళ్లల్లో వెళ్లే వాళ్లు జాగ్రత్త! ఈ దొంగ ఫోన్ కొట్టేసిన తీరు చూస్తే..
Stealing phone from railway passenger

ఇంటర్నెట్ డెస్క్: పిక్ పాకెట్ గాళ్లు ఉన్నారు జాగ్రత్త.. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్‌లో తరచూ కనిపించే హెచ్చరిక ఇది. అయితే, రైల్వే స్టేషన్‌లో పోలీసులు దొంగల ఆటకట్టించేందుకు సదా సిద్ధంగా ఉంటారు. కానీ, వీళ్ల కళ్లుకప్పి ప్రయాణికుల సొత్తును దోచుపోయే కేటుగాళ్లు ఎల్లప్పుడు రెడీ ఉంటారు. ఇందుకు రుజువుగా ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral) అవుతోంది.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ దొంగ రైల్లోని ప్రయాణికుడి వద్ద ఉన్న ఫోన్ ను ఊహించని విధంగా చోరీ చేశాడు. ప్రయాణికులు కిటికీ పక్కన కూర్చుని ఉండటా ఓ దొంగ ప్లాట్ ఫాంపై పరిగెత్తుకుంటూ అతడిని సమీపించాడు. కిటికీలోంచి లోపలకు చేయిపెట్టి మెరుపు వేగంతో ఫోన్ లాక్కుని పారిపోయాడు. రైలు వేగం పుంజుకోవడంతో ప్రయాణికుడు రైలు దిగలేక లోపలే ఉండిపోయాడు (Theif steals form railway passenger video goes viral).

Viral: వరుసగా 3 సార్లు భారతీయుడికి గిన్నిస్ రికార్డు! ఇతడేం చేశాడంటే..


వీడియోలో ఇదంతా చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఇలాగైతే రైలు ప్రయాణం కష్టమేనంటూ కామెంట్ చేశారు. తమకు ఇలాంటి భయానక అనుభవాలు ఎదురయ్యాయని కొందరు అన్నారు. తన ఫోను ఇలాగే కొట్టేస్తే తాను రైలు దిగి అతడి వెంటపడి ఫోన్ వెనక్కు తెచ్చుకున్నట్టు ఓ వ్యక్తి చెప్పాడు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో వైరల్ గా మారింది. జనాలు దిమ్మెరపోయేలా చేస్తోంది.

Read Viral and Telugu News

Updated Date - Jun 01 , 2024 | 06:01 PM