Share News

Viral Video: ఆహా.. ఈ దొంగోడు ఎంత మంచివాడు.. ఇంట్లో సామాన్లు పట్టుకుపోయినా ఎంతో విలువైన సలహా ఇచ్చాడు!

ABN , Publish Date - Jun 26 , 2024 | 04:02 PM

సాధారణంగా దొంగలు ఇంట్లోకి చొరబడితే మొత్తం అన్నీ దోచుకుని అక్కణ్నుంచి వీలైనంత త్వరగా వెళ్లిపోవాలని అనుకుంటారు. తాము ఎవరి వస్తువుల చోరీ చేశామో వారి మంచి గురించి ఆలోచించరు. అయితే చైనాలో ఓ దొంగ మాత్రం కాస్త విభిన్నంగా ఆలోచించాడు.

Viral Video: ఆహా.. ఈ దొంగోడు ఎంత మంచివాడు.. ఇంట్లో సామాన్లు పట్టుకుపోయినా ఎంతో విలువైన సలహా ఇచ్చాడు!
Thief

సాధారణంగా దొంగలు (Thief) ఇంట్లోకి చొరబడితే మొత్తం అన్నీ దోచుకుని అక్కణ్నుంచి వీలైనంత త్వరగా వెళ్లిపోవాలని అనుకుంటారు. తాము ఎవరి వస్తువుల చోరీ చేశామో వారి మంచి గురించి ఆలోచించరు. అయితే చైనా (China)లో ఓ దొంగ మాత్రం కాస్త విభిన్నంగా ఆలోచించాడు. తను చోరీ చేయడం వల్ల యజమాని ఏమైనా ఇబ్బంది పడతాడేమో అని అనుమానించాడు. అందుకే ఓ చిన్న నోట్ ఇంట్లో పెట్టాడు. అవసరమైతే తనను సంప్రదించమని ఆఫర్ కూడా ఇచ్చాడు. ఈ ఘటన చైనాలో జరిగింది (Viral News).


చైనాలోని షాంగై‌లో నెల రోజుల క్రితం ఓ ఇంట్లోకి దొంగ ప్రవేశించాడు. ఆ ఇంట్లోని ఖరీదైన ల్యాప్‌టాప్, వాచ్ దొంగిలించాడు. అవి తీసుకుని వెళ్లిపోకుండా యజమానికి మంచి సలహా కూడా ఇచ్చాడు. అదేంటో తెలిస్తే నవ్వాపుకోలేరు. ``బాస్.. నేను మీ ఇంట్లో వాచ్, ల్యాప్‌టాప్ తీసుకుంటున్నా. మీరు మీ ఇంటికి మరింత భద్రతను కల్పించండి. యాంటీ-థెప్ట్ సిస్టమ్‌ను మెరుగుపరుచుకోండి. నేను ఇక్కడున్న అన్ని ఫోన్లను, ల్యాప్‌టాప్‌లను తీసుకోవడం లేదు. కేవలం రెండే తీసుకుంటున్నాను. అవి కూడా మీకు కావాలంటే నన్ను సంప్రదించండి`` అని నోట్ రాసి ఆ ఇంట్లో పెట్టాడు.


ఆ నోట్‌పై తన మొబైల్ నెంబర్‌ను కూడా రాశాడు. ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు ఆ దొంగను పట్టుకున్నారు. రైలులో ప్రయాణిస్తుండగా అతడిని అరెస్ట్ చేశారు. అతడు దొంగిలించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. ``ఆ దొంగకు చాలా అహంకారం``, ``అతడు దయగల దొంగ`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: టైమ్ బాగోకపోతే సింహం అయినా కుక్కలా మారాల్సిందే.. ఓ ఇంటి ముందు మృగరాజును ఎలా కట్టేశారో చూడండి..


Viral Video: అమ్మా.. ఎన్ని తెలివితేటలు తల్లి.. రీల్స్ కోసం ఆమె వాడిన టెక్నిక్ చూస్తే గిన్నీస్ బుక్ ఎక్కించాల్సిందే..!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 26 , 2024 | 04:02 PM