Share News

Viral: 300 మంది ఉద్యోగుల్ని కోటీశ్వరుల్ని చేసి.. విచారంలో కంపెనీ యజమాని! ఎందుకంటే..

ABN , Publish Date - Oct 20 , 2024 | 06:40 PM

మిలియన్ల డాలర్లకు తన సంస్థను విక్రయించిన ఓ ఐఐటీ పట్టభద్రుడికి చివరకు విచారమే మిగిలింది. ఈ డీల్ వద్ద ఉద్యోగుల్లో కొందరు కోటీశ్వరులైనప్పటికీ, తాను నిర్మించిన సంస్థ దూరం కావడం తలుచుకుంటే ఇప్పటికీ విచారంగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు.

Viral: 300 మంది ఉద్యోగుల్ని కోటీశ్వరుల్ని చేసి.. విచారంలో కంపెనీ యజమాని! ఎందుకంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఆయనో ఎన్నారై.. పేరు జ్యోతి బన్సల్. ఐఐటీ ఢిల్లీలో చదివిన బన్సల్ అమెరికాలో యాప్‌డైనమిక్స్ అనే స్టార్టప్ సంస్థను స్థాపించారు. తొమ్మిదేళ్ల కష్టం తరువాత వృద్ధిలోకి వచ్చిన సంస్థను చివరకు మల్టీ బిలియన్ డాలర్‌ డీల్‌లో విక్రయించారు. 2017లో జరిగిన ఈ డీల్ పెను సంచలనం సృష్టించింది. అప్పటికే సంస్థ షేర్లు కొనుగోలు చేసిన కొందరు ఉద్యోగులు ఈ డీల్‌తో రాత్రికి రాత్రి కోటీశ్వరులుగా మారిపోయారు. కానీ నాటి నిర్ణయం తలుచుకుంటే ఇప్పటికీ బాధగా అనిపిస్తుందని బన్సల్ తాజాగా తెలిపారు. తన జీవితంలో అత్యంత విషాదకరమైన రోజు అదే అని అన్నారు (Viral).

Viral: రూ.4.2 కోట్ల ఆదాయం! తన సక్సెస్ ఫార్ములా చెప్పిన యువకుడిపై జనాల ఫైర్

బన్సల్ కష్టం ఫలించడంలో యాప్‌డైనమిక్స్ అనతికాలంలోనే మంచి అభివృద్ధి సాధించింది. 2017లో ఐపీఓకు కూడా సిద్ధమైంది. ఇంతలో బన్సల్‌కు ప్రముఖ సంస్థ సిస్కో నుంచి ఊహించని ఆఫర్ వచ్చింది. యాప్‌డైనమిక్స్ కొనుగోలుకు సిద్ధమైన సిస్కో ఇందుకు భారీ మొత్తాన్ని ఆఫర్ చేసింది. ఇక తన స్టార్టప్‌ను వృద్ధిలోకి తెచ్చేందుకు బన్సల్ చాలా శ్రమించారు. ఆరేళ్ల పాటు రాత్రనకా పగలనకా కష్టపడి సంస్థకు గుర్తింపు తెచ్చిపెట్టారు. ఈ ప్రయాణంలో ఉద్యోగులు కూడా కీలక పాత్ర పోషించారు. సిస్కో ఆఫర్ సమయానికి యాప్‌డైనమిక్స్‌లో ఏకంగా 1200 మంది పనిచేస్తున్నారు. ఓవైపు తాను నెలకొల్పిన సంస్థ..మరోవైపు సిస్కో ఆఫర్, ఉద్యోగుల భవితవ్యం..దీంతో బన్సల్ ఏం చేయాలనేదానిపై చాలా తర్జనభర్జనలు పడ్డారు. చివరకు సిస్కోకు యాప్‌డైనమిక్స్‌ను విక్రయించేందుకే నిర్ణయించారు.


Viral: వీళ్ల లైఫ్ ఖతం! లాస్ట్ బెంచ్‌లో ఈ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారో చూస్తే..

‘‘ఆ సమయంలో అందరిలో సంతోషం వెల్లివిరిసింది. కానీ నేను మాత్రం విచారంలో కూరుకుపోయా. ఈ సంస్థ కోసం నేను ఏకంగా 9 ఏళ్లు కష్టపడ్డా. నిబద్ధతతో పనిచేశా. కానీ ఊహించని విధంగా సంస్థ ప్రయాణం ముగింపునకు చేరింది. అప్పట్లో సంస్థకు చెందిన సుమారు 300 మంది ఈ డీల్ కారణంగా మిలియనీర్లు అయ్యారు. డజన్ల కొద్దీ ఉద్యోగుల షేర్ల విలువ 5 మిలియన్లు దాటింది’’ అని బన్సల్ వివరించారు.

అయితే, యాప్‌డైనమిక్స్ విక్రయం వెనక ఆర్థిక అంశాల కంటే ఉద్యోగులకు మేలు చేయాలన్నదే తన ఉద్దేశమని బన్సల్ అన్నారు. ఐపీఓకు వెళ్లి సొంతంగా నెలదొక్కుకునే క్రమంలో ఎదురయ్యే సవాళ్లు, సిస్కోకు విక్రయిస్తే ఉద్యోగులకు కలిగే ప్రయోజనాల గురించి సునిశితంగా ఆలోచించి చివరకు సంస్థను విక్రయించేందుకే ఆయన మొగ్గు చూపారు.

Viral: వారెవ్వా.. పనిమనిషికి ఎలాంటి గిఫ్ట్ ఇచ్చాడో చూడండి..!


‘‘ఈ విక్రయం పూర్తయినే సిస్కో వంటి పెద్ద సంస్థలో భాగమవుతాం. వారి కస్టమర్లు, మార్కెట్‌కు దగ్గరవుతాం. ఇక నా ఉద్యోగులకు ఎటువంటి సంస్థలో భాగం కానున్నారనేది రెండో అంశం. ఏమాటకామాటే చెప్పుకోవాలి.. ఈ డీల్ పూర్తయ్యాక సిస్కో యాజమాన్యం యాప్‌డైనమిక్స్ యూనిట్‌కు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది’’ అని ఆయన అన్నారు.

అయితే, ఇంత ఆర్థిక విజయం సాధించినా కూడా నాటి రోజుల్ని తలచుకుంటే ఇప్పటికీ విచారంగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘సంస్థ వ్యవస్థాపకుడిగా నాకు ఈ డీల్ కేవలం డబ్బుకు సంబంధించినది కాదు. కంపెనీతో నాకు ఓ అవినాభావ సంబంధం ఉండేది. అయితే, ఏ విధంగా చూసినా ఇది మంచి ఫలితమే కానీ ఓ అధ్యాయనం ముగిసిందని చెప్పకతప్పదు. ఏదో కోల్పోయానన్న భావన వెంటాడింది’’ అని అన్నారు.

ఆ తరువాత బన్సల్ ట్రేసబుల్, హార్నెస్ అనే మరో స్టార్టప్ సంస్థలను నెలకొల్పారు. 2022లో హార్నెస్ సంస్థ మార్కెట్ విలువ 3.7 మిలియన్ డాలర్లకు చేరింది. అయితే, యాప్‌డైనమిక్స్ విక్రయం..సంస్థ ఉద్యోగులపై పెద్ద ప్రభావమే చూపించిందని అన్నారు.

Viral: జర్మనీలో ఈ ఎన్నారైలు ఏం చేశారో చూడండి.. నెట్టింట తిట్ల వర్షం!

Viral: ఈ బస్సు డ్రైవర్ గ్రేట్.. అందరూ ఇలా చేస్తే రోడ్డు ప్రమాదాలే జరగవు!

Read Latest and Viral News

Updated Date - Oct 20 , 2024 | 06:48 PM