Share News

Viral: 100 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉండే చీర.. నీతా అంబానీ ఫేవరెట్!

ABN , Publish Date - Nov 29 , 2024 | 09:42 PM

అనంత్ అంబానీ పెళ్లివేడుకలో పటోల చీరలు హైలైట్‌గా నిలిచాయి. నీతా అంబానీకి ఇష్టమైన ఈ చీరలు వందేళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉంటాయట. మరి ఈ చీరల విశేషాలు ఏమిటో తెలుసుకుందాం.

Viral: 100 ఏళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉండే చీర.. నీతా అంబానీ ఫేవరెట్!

ఇంటర్నెట్ డెస్క్: భారతీయులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా అనంత్ అంబానీ వివాహ వేడుక జరిగింది. నభూతో న భవిష్యత్ అన్న రీతిలో ముఖేశ్ అంబానీ..తన కుమారుడి వివాహాన్ని జరిపించారు. దేశవిదేశాల నుంచి అతిరథమహారథులు ఎందరో ఈ వేడుకకు హాజరయ్యారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకను చూసి ప్రపంచమే ఆశ్చర్యపోయింది. అయితే, పటోల చీరలు ఈ వేడుకలో హైలైట్‌గా నిలిచాయి. దాదాపు 100 ఏళ్ల పాటు పాడుకాకుండా ఉండేలా రూపొందించిన ఈ చీరలు నీతా అంబానీకి ఎంతో ఇష్టమని కూడా అక్కడి వారు తెలిపారు. మరి ఈ చీర విశిష్టత ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం (Viral).

Viral: శ్వేతజాతీయురాలిని పెళ్లాడితే డైవర్స్ తప్పదన్నారు..ఎన్నారై వీడియో వైరల్


పటోలా చీరలను గుజరాత్‌లోని పటాన్ ప్రాంతంలో తయారు చేస్తారు. వివిధ రంగుల్లో ఉండే ఈ సిల్క్ చీరలు చూడగానే ఆకట్టుకునేలా ఉంటాయని అక్కడి వారు చెబుతున్నారు. చేనేత కార్మికులు ఈ చీరలను స్వయంగా నేస్తారని అక్కడి వారు తెలిపారు. 10 నుంచి 12 మంది చేనేత కళాకారులు కనీసం ఆరు నెలల పాటు కష్టపడి ఒక చీరను సిద్ధం చేస్తారట. భారతీయ సంప్రదాయ వస్త్ర పరిశ్రమకు చిహ్నంగా నిలుస్తున్న ఈ చీరలను కనీసం 100 సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా నిలిచుంటాయట. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ చీరను సాధారణ పద్ధతుల్లో ఉతకరు. వాటి నాణ్యత ఏళ్ల పాటు నిలిచుండేలా ప్రత్యేకమైన డ్రై క్లీనింగ్ పద్ధతిలో శుభ్రపరుస్తారు.

Viral: కాలిపై పిల్లి రక్కడంతో తెగిన నరం.. తీవ్ర రక్తస్రావమై యజమాని మృతి!


ఈ చీరలు భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయ్యాయి. జర్మనీ, అమెరికా, రష్యాల్లో కూడా ఈ చీరలను మెచ్చే వారు ఉన్నారు. చేనేత కార్మికుల నైపుణ్యాలకు చిహ్నంగా నిలిచే ఈ పొటోల చీరలు భారత్‌లో అత్యధికంగా అమ్ముడుపోయే చీరల్లో రెండో స్థానంలో ఉన్నాయట. వీటి ప్రత్యేకతల రీత్యా ఇవి ఓ విలాస వస్తువుగా కూడా పేరు గాంచాయి. ఒక్కో చీర ధర రూ.10 వేల నుంచి గరిష్ఠంగా రూ.7 లక్షల వరకూ ఉంటుంది.

Viral: రూ.6,015 కోట్లను చెత్తలో పారేసిన గర్ల్‌ఫ్రెండ్! జరిగిందేంటో తెలిస్తే..

Viral: ఈ ఆడ ఏనుగు కష్టం చూస్తే గుండె తరుక్కుపోతుంది! ఎంతైనా తల్లి కదా..

Read Latest and Viral News

Updated Date - Nov 29 , 2024 | 10:22 PM