Viral Video: తుది వీడ్కోలు ఇలాగే ఉండాలేమో.. డెకరేట్ చేసిన కారులో వీళ్లు వెళ్తోంది పెళ్లికి కాదు..
ABN , Publish Date - Nov 26 , 2024 | 05:48 PM
ఓ వ్యక్తి బర్త్‌డే అయినా, పెళ్లి రోజు అయినా ఎంతో సంబరంగా జరుపుకుంటారు. అయితే అదే వ్యక్తి తుది శ్వాస విడిచి ప్రపంచానికి వీడ్కోలు పలికినప్పుడు మాత్రం ఆత్మీయుల కళ్లు చెమ్మగిల్లుతాయి. మొత్తం విషాద వాతావరణం నెలకొంటుంది. అతడికి బాధాతప్త హృదయాలతో వీడ్కోలు పలుకుతారు.
బిడ్డ పుడితే (Birth) తల్లిదండ్రులే కాదు కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషిస్తారు. కుటుంబ సమేతంగా సంబరాలు చేసుకుంటారు. అందరి ముఖాల్లో ఎంతో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆ వ్యక్తి బర్త్‌డే అయినా, పెళ్లి రోజు అయినా ఎంతో సంబరంగా జరుపుకుంటారు. అయితే అదే వ్యక్తి తుది శ్వాస విడిచి (Death) ప్రపంచానికి వీడ్కోలు పలికినప్పుడు (Last journey) మాత్రం ఆత్మీయుల కళ్లు చెమ్మగిల్లుతాయి. మొత్తం విషాద వాతావరణం నెలకొంటుంది. అతడికి బాధాతప్త హృదయాలతో వీడ్కోలు పలుకుతారు. అయితే, ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కనిపించిన అంతిమ యాత్ర దృశ్యాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు (Viral Video).
mmtaa5519 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ఊరేగింపు కనిపిస్తోంది. కొంతమంది వ్యక్తి సంగీత వాయిద్యాలు వాయిస్తూ, డ్యాన్స్ చేస్తే పాడుతూ, ఉల్లాసంగా కనిపించారు. వెనుక అందంగా డెకరేట్ చేసిన ఓ కారు నెమ్మదిగా వస్తోంది. ఎవరైనా మొదట ఆ దృశ్యాన్ని చూస్తే పెళ్లి ఊరేగింపు అనుకుంటారు. అయితే అందంగా డెకరేట్ చేసిన ఆ కారుపై మృతదేహాన్ని చూసి షాక్ అవక తప్పదు. అప్పటివరకు ఆనందంగా ఉన్న మనసులో కాస్తంత విషాదానికి చోటు ఇవ్వక తప్పదు. ఓ వ్యక్తి అంతిమ యాత్రను ఓ సంబరంలా జరపడం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఏకంగా 110 సంవత్సరాలు బ్రతికిన ఓ వ్యక్తి అంతిమ వీడ్కోలుకు సంబంధించిన దృశ్యం అది. ఈ వీడియోను రాజస్థాన్‌లోని కరన్‌పూర్‌లో చిత్రీకరించారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను మిలియన్ల మంది వీక్షించారు. 24 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``శరీరాన్ని వదలి దేవుడి దగ్గరకు వెళ్లేటపుడు కూడా అంతే ఆనందంగా వెళ్లాలి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఈ తెలివి తేటలు చూస్తే షాకవ్వాల్సిందే.. బైక్ ఇంజిన్‌లతో ఈ వ్యక్తి ఏం చేశాడో చూడండి..
Picture Puzzle: మీ పరిశీలనా శక్తికి సవాల్.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 10 సెకెన్లలో కనిపెట్టండి..
Viral Video: రోడ్డుపై డెత్ స్టంట్.. డబుల్ డెక్కర్ బైక్ స్టంట్ చూస్తే చెమటలు పట్టడం ఖాయం..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి