Share News

Viral Video: వామ్మో.. ఫోన్ పిచ్చి పడితే ఇలాగే ఉంటుందేమో! ఆ మహిళ తెలివి చూస్తే కళ్లు తేలెయ్యాల్సిందే!

ABN , Publish Date - May 21 , 2024 | 11:44 AM

ప్రస్తుతం చాలా మందికి మొబైల్ ఫోన్ అనేది నిత్యావసర వస్తువుగా మారిపోయింది. నీరు, తిండి, గాలి, బట్టలుతోపాటు మొబైల్ కూడా లేకపోతే చాలా మంది బతకలేని పరిస్థితుల్లో ఉన్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ మొబైల్ ఫోన్‌లకు బానిసలుగా మారుతున్నారు.

Viral Video: వామ్మో.. ఫోన్ పిచ్చి పడితే ఇలాగే ఉంటుందేమో! ఆ మహిళ తెలివి చూస్తే కళ్లు తేలెయ్యాల్సిందే!
Funny video of Mobile Addiction

ప్రస్తుతం చాలా మందికి మొబైల్ (Mobile) ఫోన్ అనేది నిత్యావసర వస్తువుగా మారిపోయింది. నీరు, తిండి, గాలి, బట్టలుతోపాటు మొబైల్ కూడా లేకపోతే చాలా మంది బతకలేని పరిస్థితుల్లో ఉన్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ మొబైల్ ఫోన్‌లకు బానిసలుగా మారుతున్నారు (Mobile Addiction). మొబైల్ లేకుండా కొన్ని నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితి. ముఖ్యంగా సోషల్ మీడియా వినియోగం, రీల్స్ (Reels) వీక్షించడం బాగా ఎక్కువైపోయింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే కళ్లు తేలెయ్యాల్సిందే (Viral Video).


@Kiran_Saran77 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ మహిళ ఇంటి పనులు చేసుకుంటోంది. బట్టలు ఉతుకుతోంది. ఆ సమయంలో కూడా అమె మొబైల్‌ను పక్కన పెట్టాలనుకోలేదు. అందుకోసం ఓ ప్రత్యేక ఏర్పాటు చేసుకుంది. తన తలపై ఓ కర్రను కట్టుకుని దానికి తన మొబైల్‌ను తగిలించింది. మొబైల్ నీటిలో పడినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఆ మొబైల్‌ను కవర్‌లో ఉంచింది. పని చేసుకుంటూనే రీల్స్ చూసుకుంటోంది.


ఈ వీడియోను సరదాగా రూపొందించినప్పటికీ, బయట చాలా మంది పరిస్థితి ఇంత కంటే భిన్నంగా లేదు. చాలా మంది ఇదే స్థాయిలో మొబైల్ అడిక్షన్‌తో బాధపడుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 22 వేల మంది ఈ వీడియోను వీక్షించారు. ``గొప్ప ట్రిక్ కనిపెట్టిన ఆ మహిళకు అవార్డు ఇవ్వాలి``, ``మొబైల్ వినియోగంలో ఇది హై లెవెల్`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Opitcal Illusion: మీ కళ్లు పవర్‌ఫుల్ అనుకుంటున్నారా?.. ఈ ఫొటోలోని మూడు గుడ్లగూబలను 8 సెకెన్లలో కనిపెట్టండి!


Viral Video: భయంకరమైన యాక్సిడెంట్.. కారును ఢీకొట్టిన ట్రక్ బ్రిడ్జ్‌కు ఎలా వేలాడుతోందో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 21 , 2024 | 11:44 AM