Share News

Viral: డేట్‌పై వెళ్లేందుకు ఉద్యోగులకు లీవ్స్ ఇస్తున్న సంస్థ! ఎందుకంటే..

ABN , Publish Date - Sep 09 , 2024 | 06:52 PM

ప్రేమలో పడ్డ ఉద్యోగులకు తమ మనసుకు నచ్చిన వారితో షికారుకు వెళ్లేందుకు సెలవులిస్తున్న ఓ సంస్థ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిసోంది.

Viral: డేట్‌పై వెళ్లేందుకు ఉద్యోగులకు లీవ్స్ ఇస్తున్న సంస్థ! ఎందుకంటే..

ఇంటర్నెట్ డెస్క్: ప్రేమలో పడ్డ ఉద్యోగులకు తమ మనసుకు నచ్చిన వారితో షికారుకు వెళ్లేందుకు సెలవులిస్తున్న ఓ సంస్థ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఉద్యోగులతో గొడ్డు చాకిరీ చేయించుకునే సంస్థలున్న నేటి జమానాలో ఈ థాయ్‌లాండ్ సంస్థ వినూత్న ప్రయత్నం నెట్టింట చర్చనీయాంశంగా మారింది (Viral).

Viral: 70 ఏళ్ల వయసులో డాక్టర్ అయిన వృద్ధుడు! ఎందుకని అడిగితే..

థాయ్‌లాండ్‌కు చెందిన ఓ మార్కెటింగ్ సంస్థ ఈ కొత్త ఒరవడికి నాంది పలికింది. ఓ ఉద్యోగి డేట్‌పై వెళ్లేందుకు సెలవు కోరడంతో అక్కడ ఈ సంప్రదాయం మొదలైంది. విధుల్లో తీరక లేకుండా గడుపుతున్న తనకు గర్ల్‌ఫ్రెండ్‌తో షికారుకు వెళ్లేందుకు సెలవు కావాలంటూ అతడు దరఖాస్తు చేసుకున్నాడు. ఇది చదివిన మేనేజర్ తొలుత ఆశ్చర్యపోయాడు. అనంతరం, అతడు కోరినట్టు సెలవు మంజూరు చేయడంతో పాటు ఇకపై ఉద్యోగులందరికీ ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. ఉద్యోగులు తమ మనసుకు నచ్చిన వారితో డేట్స్‌పై వెళ్లేందుకు జీతంతో కూడిన సెలవు తీసుకోవచ్చని అన్నారు. దీంతో, ఉద్యోగుల్లో సంబరం అంబరాన్ని అంటింది (This Thailand Company Grants Employees Special Leaves To Go On Dates).


జులై నుంచి డిసెంబర్ వరకూ ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని సంస్థ ప్రకటించింది. అయితే, వారం ముందుగానే ఉద్యో్గులు ఈ తరహా సెలవుకు దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. అంతేకాకుండా, తోడు కోసం వెతుక్కునే ఉద్యోగుల డేటింగ్ యాప్స్ ఖర్చులు, సబ్‌స్క్రిప్షన్ డబ్బులు తామే భరిస్తామని కూడా భరోసా ఇచ్చింది. ఈ విధానం వెనకున్న కారణాన్ని కూడా సంస్థ మేనేజర్ వివరించారు. ప్రేమలో పడ్డ వారిలో సంతోషం, సానుకూల దృక్పథం తొణికిసలాడుతుందని చెప్పారు. దీంతో, పనిప్రదేశంలో కూడా ఉత్సాహకర వాతావరణం ఉంటుందని అన్నారు.


అయితే, ఈ సంస్థ అమలు చేస్తున్న విధానం స్థానికంగానే కాకుండా నెట్టింట కూడా చర్చనీయాంశమైంది. ఉద్యోగులకు ఓ సంస్థ ఇలాంటి సౌకర్యం ఇస్తోందంటే నమ్మలేకపోతున్నామని కొందరు అన్నారు. కార్పొరేట్ ప్రపంచంలో ఇలాంటి విధానాన్ని తామెప్పుడూ చూడలేదని అన్నారు. వ్యక్తిగత జీవితానికి ఉన్న ప్రాధాన్యాతను ఈ విధానం చాటిచెబుతోందని అన్నారు. అయితే, ఈ చర్యతో కంపెనీ తమ ఉద్యోగుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూస్తోందని కూడా కొందరు కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.

Read Latest and Viral News

Updated Date - Sep 09 , 2024 | 08:44 PM