Share News

Health: 2 నెలల్లో 7 కిలోలు తగ్గిన యువతి! ఒకే ఒక సింపుల్ ట్రిక్‌తో..

ABN , Publish Date - Nov 03 , 2024 | 10:09 AM

బరువు తగ్గాలంటే తిండి తగ్గించాలన్న భావన తప్పని చెబుతోందో యువతి. తిండికి బదులు కెలొరీలు దృష్టిలో పెట్టుకుంటే మంచి ఫలితాలు ఉంటాయంటూ సోదాహరణంగా చెప్పుకొచ్చింది. ఇది ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Health: 2 నెలల్లో 7 కిలోలు తగ్గిన యువతి! ఒకే ఒక సింపుల్ ట్రిక్‌తో..

ఇంటర్నెట్ డెస్క్: ఒక్కొక్కరిదీ ఒక్కో శరీర తత్వం. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగితే మంచి ఫలితాలు ఉంటాయి. అయితే, పొట్ట చుట్టూ కొవ్వు తగ్గించుకోవడం అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఒకరికి ప్రయోజనం చేకూర్చే విధానం మరొకరి విషయంలో నిరుపయోగంగా మారొచ్చు. బరువు తగ్గాలంటే తిండి తగ్గించాలని కూడా చాలా మంది భావిస్తుంటారు. ఇది తప్పని చెబుతున్న యువతి ఓ సింపుల్ టెక్నిక్‌తో కేవలం 2 నెలల్లో ఏకంగా 7 కేజీల బరువు తగ్గింది. ఆమె పంచుకున్న టెక్నిక్ ప్రస్తుతం వైరల్ (Viral) అవుతోంది

Viral: పురుషుల్లో క్యాన్సర్! ఈ లక్షణాలుంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి!


తిండి తగ్గిస్తే బరువు తగ్గుతారన్న భావన తప్పని లియానా అనే యువతి చెప్పుకొచ్చింది. ఆమె చెబుతున్న దాని ప్రకారం, బరువు తగ్గేందుకు కెలొరీలు తక్కువగా తీసుకోవాలి. ఈ రెండు విధానాల మధ్య జీవితాల్ని మార్చేసేంతటి తేడా ఉన్నది. కూరగాయలు కడుపునిండా తిన్నా శరీరానికి కెలొరీలు తక్కువగానే అందుతాయి.

‘‘మనం ఎంత కెలొరీలు తింటున్నామన్న దానిపైనే అంతా ఆధారపడి ఉంటుంది. కాబట్టి దిన్ని దృష్టిలో పెట్టుకుని ఆహారపు అలవాట్లను మార్చుకోవాలి. కెలొరీలు తక్కువగా ఉన్న ఆహారం తింటే కడుపు నిండుగా ఉండటంతో పాటు బరువు కూడా తగ్గుతారు. కాబట్టి మన లక్ష్యం తిండి తగ్గించడం కాదు.. కెలొరీలు తగ్గించడం. శరీరానికి ఎన్ని కెలొరీలు అవసరమో అన్ని కెలొరీలు మాత్రమే ఉండే ఆహారాన్ని తీసుకుంటే సులువుగా బరువుతగ్గుతారు’’ అని ఆమె చెప్పుకొచ్చింది.


Health: బరువు తగ్గేందుకు నడకకు మించిన ఎక్సర్‌సైజు లేదు! ఎందుకంటే..

అయితే, బరువు తగ్గేందుకు కేవలం తిండిని నియంత్రించడమే కాకుండా వ్యాయామం కూడా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. తరచూ కసరత్తులు చేస్తూ ఉంటే బరువు తగ్గడంతో పాటు శరీరం దృఢంగా మారుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగై జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Read Latest and Health News

Updated Date - Nov 03 , 2024 | 10:18 AM