Share News

Puzzle: ఈ రెండు ఫొటోల్లో 3 తేడాలున్నాయి.. అవేంటో కనిపెట్టారంటే మీరే జీనియస్..

ABN , Publish Date - Apr 13 , 2024 | 04:18 PM

ఆప్టికల్ ఇల్యూషన్, ఫజిల్ ఫొటోల్లో కొన్నింటిని పరిష్కరించడం చాలా కష్టంగా ఉంటుంది. వాటిని చూసినప్పుడు చిన్న అనుమానం కూడా రాదు. కానీ అందులో మనకు తెలీకుండా కొన్ని వస్తువులు దాగి ఉండడమో, లేదా అనేక తేడాలు ఉండడమో జరుగుతుంటుంది. అలాంటి...

Puzzle: ఈ రెండు ఫొటోల్లో 3 తేడాలున్నాయి.. అవేంటో  కనిపెట్టారంటే మీరే జీనియస్..

ఆప్టికల్ ఇల్యూషన్, ఫజిల్ ఫొటోల్లో కొన్నింటిని పరిష్కరించడం చాలా కష్టంగా ఉంటుంది. వాటిని చూసినప్పుడు చిన్న అనుమానం కూడా రాదు. కానీ అందులో మనకు తెలీకుండా కొన్ని వస్తువులు దాగి ఉండడమో, లేదా అనేక తేడాలు ఉండడమో జరుగుతుంటుంది. అలాంటి ఫజిల్ ఫొటోలకు సమాధానాలు తెలుసుకునేందుకు నెటిజన్లు తెగ ఆసక్తిని కనబరుస్తుంటారు. ఇలాంటి వారి కోసం మేము ప్రస్తుతం ఓ ఫజిల్ ఫొటోను మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలు ఉన్నాయి. అవేంటో కనిపెట్టడానికి ప్రయత్నించండి..

సోషల్ మీడియాలో ఓ ఫజిల్ ఫొటో (Fuzzy viral photo) తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో కుర్చీలో కూర్చున్న బాస్.. తన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. చేతిలో పేపర్ పట్టుకుని అందులో తప్పును చూపిస్తూ తన సిబ్బందిని మందలిస్తున్నాడు. దీంతో సదరు సిబ్బంది తన బాస్ ముందు భయంభయంగా చేతులు కట్టుకుని నిలబడి ఉంటాడు.

Viral Video: ఎక్సకవేటర్‌తో మట్టి తవ్వుతుండగా ఊహించని ఘటన.. బండను పైకి ఎత్తి చూడగా షాకింగ్ సీన్..

ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఈ రెండు చిత్రాల్లో (Three differences in two pictures) మొత్తం 3 తేడాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే ఇందులో విజయవంతం అవుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఈ రెండు ఫొటోల్లో దాగి ఉన్న 3 తప్పులను పసిగట్టేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ మీకూ కష్టంగా అనిపిస్తుంటే.. ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

Puzzle-photos.jpg

Viral Video: పడుకున్న ఆవులను హింసించాడు.. చూస్తుండగానే అతడికి ఎలాంటి ఫలితం దక్కిందో చూస్తే..

Updated Date - Apr 13 , 2024 | 04:18 PM