Share News

Optical illusion: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును.. 10 సెకన్లలో కనిపెట్టండి చూద్దాం..

ABN , Publish Date - Apr 23 , 2024 | 05:00 PM

ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ ఫొటోల్లో కొన్ని తెగ ఆసక్తిని కలిగిస్తుంటాయి. కొన్ని ఫొటోల్లో దాగి ఉన్న వస్తువులు, మరికొన్ని ఫొటోల్లో ఉన్న తేడాలు, అలాగే కొన్ని ఫొటొల్లోని తప్పులను పసిగట్టేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. అయితే అందులో కొంత మంది మాత్రమే సక్సెస్ అవుతుంటారు. ఇలాంటి..

Optical illusion: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును.. 10 సెకన్లలో కనిపెట్టండి చూద్దాం..

ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ ఫొటోల్లో కొన్ని తెగ ఆసక్తిని కలిగిస్తుంటాయి. కొన్ని ఫొటోల్లో దాగి ఉన్న వస్తువులు, మరికొన్ని ఫొటోల్లో ఉన్న తేడాలు, అలాగే కొన్ని ఫొటొల్లోని తప్పులను పసిగట్టేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. అయితే అందులో కొంత మంది మాత్రమే సక్సెస్ అవుతుంటారు. ఇలాంటి ఆసక్తికర ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఫొటోను మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ తప్పు దాగి ఉంది. అదేంటో 10 సెకన్లలో కనిపెట్టేందుకు ప్రయత్నించండి..


సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటో (Optical illusion viral photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో రాతి యుగం కాలం నాటి సన్నివేశాన్ని చూడొచ్చు. ఓ వ్యక్తి తన ఇంటికి ఎదురుగా కట్టెలతో నిప్పు వెలిగించాడు. నిప్పు ఎదురుగా కూర్చుని తన రాతి గొడ్డలిని సరి చేసుకుంటున్నాడు. అదే సమయలో ఓ మహిళ చేతిలో కట్టెల మోపుతో నడుచుకుంటూ వస్తుంటుంది.

Viral Video: వంట గదిలో ఉక్కపోతకు వినూత్న పరిష్కారం.. ఇతడి అతి తెలివి చూస్తే అవాక్కవ్వాల్సిందే..

వారి వెనుక పెద్ద పెద్ద వృక్షాలను కూడా చూడొచ్చు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు సిసలు ట్విస్ట్ దాగి ఉంది. ఈ చిత్రంలో ఓ తప్పు (hidden mistake in the picture) దాగి ఉందన్నమాట. అదేంటీ అంతా బాగానే ఉంది కదా... ఇందులో తప్పు ఎక్కడ ఉంది.. అని మీకు అనుమానం రావొచ్చు. కానీ కాస్త తీక్షణంగా పరిశీలిస్తే ఆ తప్పేంటో ఈజీగా తెలిసిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం మీ మెదడకు పని పెట్టండి. ఎంత సేపు చూసినా ఆ తప్పును పసిగట్టలేకపోతుంటే.. ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

Viral Video: ఐబ్రోస్ చేయించుకునేందుకు బ్యూటీపార్లర్‌కు వెళ్లింది.. అపాయింట్‌మెంట్ దొరక్కపోవడంతో అక్కడే..

ఈ చిత్రంలో వారిని చూస్తే.. అది రాతి యుగం కాలానికి సంబంధించినదిగా అర్థం అవుతుంది. మరి ఇందులో మహిళ కాళ్లను గమనిస్తే.. షూ వేసుకుని కనిపిస్తుంది. ఆ కాలంలో షూలు వేసుకోవడం అసాధ్యం కాబట్టి.. ఈ చిత్రంలో తప్పు ఆమె కాళ్లకు షూలు ఉండడం అన్నమాట. ఈ తప్పును ఎవరైతే కనిపెట్టారో వారికి తీక్షణమైన దృష్టి ఉన్నట్లు అర్థం.

Optical-Illusion-Viral-Phot.jpg

Viral Video: డ్రైవర్ ఎంతకీ కిందకు దిగకపోవడంతో అనుమానం.. ఏమైందా అని లోపల చూడగా..

Updated Date - Apr 23 , 2024 | 05:01 PM