Optical Illusion: మీలోని పరిశీలనా శక్తికి పరీక్ష.. ఇందులోని పిల్లల అసలు తల్లి ఎవరో కనుక్కోండి చూద్దాం..
ABN , Publish Date - Nov 24 , 2024 | 08:58 PM
ఇక్కడ కనిపిస్తు్న్న చిత్రంలో ఇద్దరు పిల్లలు ఇసుకతో ఇల్లు కడుతూ ఆడుకుంటుంటారు. అయితే ఆ పక్కనే ముగ్గురు మహిళలు నిలబడి ఉంటారు. ఆ పిల్లలు నా పిల్లలు.. అంటే నా పిల్లలు .. అంటూ ముగ్గురూ గొడవపడుతుంటారు. అయితే ఆ పిల్లల అసలు తల్లి ఎవరో గుర్తించేందుకు ప్రయత్నించండి మరి..
సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు తెగ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని తెగ ఆసక్తిని కలిగిస్తుంటాయి. అలాగే మరికొన్ని అంతే స్థాయిలో మన మెదడుకు పరీక్ష పెడుతుంటాయి. ఇంకొన్ని చిత్రాలు ఎంత సేపు ప్రయత్నించినా సమాధానం కనుక్కోలేని విధంగా ఉంటాయి. అయితే ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించేందుకు చాలా మంది పోటీ పడుతుంటారు. చివరకు వారిలో కొందరు మాత్రమే సమాధానాన్ని కనుక్కోగలుగుతుంటారు. తాజాగా, మీ కోసం ఇలాంటి చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తు్న్న చిత్రంలోని పిల్లల అసలు తల్లి ఎవరో కనుక్కోండి చూద్దాం.
సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical Illusion Viral Photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తు్న్న చిత్రంలో ఇద్దరు పిల్లలు ఇసుకతో ఇల్లు కడుతూ ఆడుకుంటుంటారు. అయితే ఆ పక్కనే ముగ్గురు మహిళలు నిలబడి ఉంటారు. ఆ పిల్లలు నా పిల్లలు.. అంటే నా పిల్లలు (children) .. అంటూ ముగ్గురూ గొడవపడుతుంటారు.
ఓ మహిళ చేతిలో రెండు ఐస్‌క్రీములను పట్టుకుని నిలబడి ఉంటుంది. మరో మహిళ భుజానికి ఓ బ్యాగు తగిలించుకుని ఉంటుంది. ఆ బ్యాగులో ఓ పాల డబ్బా కూడా ఉంటుంది. ఇక మూడో మహిళ ఒట్టి చేతులో నిలబడి ఉంటుంది. ఈ ముగ్గురూ ఆ పిల్లల కోసం గొడవపడుతున్నారు. ఇక్కడ మీ పరిశీలనా శక్తికి ఓ పరీక్ష పెడుతున్నాం. ఆ ముగ్గురు మహిళల్లో ఒకరు అసలు తల్లి ఉన్నారు. ఆమె ఎవరో (Identify the real mother of the child) గుర్తుపట్టేందుకు ప్రయత్నించండి.
Optical illusion: ఇందులో మీరు మొదట ఏదైతే చూశారో.. దాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోండి..
ఆ పిల్లల తల్లిని కనుక్కోవడం అంత సులభం కాదు. అలాగని అంత పెద్ద కష్టం కూడా కాదు. చాలా మంది అసలు తల్లిని గుర్తించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొందరు మాత్రమే గుర్తించగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ పిల్లల తల్లి ఎవరో గుర్తించేందుకు ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటికీ ఆ తల్లిని గుర్తించలేకుంటే మాత్రం ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోచ్చు.
ఆ ముగ్గురు మహిళల్లో ఓ మహిళ భుజంపై టాటూ ఉంటుంది. ఆ పిల్లల భుజంపై కూడా అలాంటి టాటూనే చూడొచ్చు. కాబట్టి ఆ పిల్లల తల్లి ఐస్ క్రీం పట్టుకున్న మహిళ అని తెలిసిపోయింది. ఈమెను ముందే గుర్తించిన వారిలో పరిశీలనా శక్తి ఎక్కువ ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..
మరిన్ని వైరల్ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి..