Optical illusion: మీకో ఛాలెంజ్.. ఈ చిత్రంలో దాక్కున్న జింకను 25 సెకన్లలో గుర్తించడం మీ వల్ల అవుతుందా..?
ABN , Publish Date - Oct 31 , 2024 | 07:59 PM
సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ అడవిని చూడొచ్చు. అందులో పెద్ద పెద్ద వృక్షాలతో పాటూ పూల మొక్కలు కూడా ఉన్నాయి. అలాగే ఈ చిత్రంలో ఓ జింక కూడా దాక్కుని ఉంది. దాన్ని 25 సెకన్ల వ్యవధిలో గుర్తించేందుకు ప్రయత్నించండి..
ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాల వల్ల కాలక్షేపంతో పాటూ బ్రెయిర్ షార్ప్‌గా మారుతుందని అందరికీ తెలిసిందే. అందుకే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించేందుకు నెటిజన్లు తెగ ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే ఇలాంటి పజిల్స్‌లో కొన్ని ఫొటోలు నెటిజన్లకు పెద్ద పరీక్ష పెడుతుంటాయి. కానీ ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించినప్పుడు మనలోని టాలెంట్ బయటపడుతుంది. అలాగే మనలో ఏకాగ్రత కూడా పెంపొందుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం మీ ముందుకు ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ జింక దాక్కుని ఉంది. దాన్ని 20 సెకన్లలో గుర్తించేందుకు ప్రయత్నించండి..
సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ (Optical illusion Viral Photo) చిత్రం తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ అడవిని చూడొచ్చు. అందులో పెద్ద పెద్ద వృక్షాలతో పాటూ పూల మొక్కలు కూడా ఉన్నాయి. అలాగే కొన్ని మొక్కల మధ్య ఓ పాము కూడా కనిపిస్తుంది.
అదేవిధంగా వృక్షాలకు అవతలి వైపు పెద్ద పెద్ద కొండలను కూడా చూడొచ్చు. అయితే ఇక్కడ మీ కంటికో పెద్ద పరీక్ష పెడుతున్నాం. ఈ చిత్రంలో ఓ జింక కూడా (hiding deer) దాక్కుని ఉంది.
అదేంటీ ఇక్కడ ఎలాంటి జంతువూ లేదే అని మీకు సందేహం రావొచ్చు. కానీ కంటికి కనిపించకుండా జింక దాక్కుని ఉంది. దాన్ని గుర్తించడం పెద్ద సవాలే గానీ.. కాస్త నిశితంగా పరిశీలిస్తే మాత్రం కనుక్కోవడం పెద్ద కష్టమేమీ కాదు.
ఎంతో మంది ఆ జింకను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే వారిలో చాలా తక్కువ మంది మాత్రమే గుర్తించగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ జింక ఎక్కడుందో కనిపెట్టేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ దాన్ని గుర్తించడం ఇప్పటికీ మీకు కష్టంగా అనిపిస్తుంటే.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.
ఈ చిత్రం చూడకుండా 25 సెకన్లలోపు జింకను గుర్తించిన వారిలో ఏకాగ్రతతో పాటూ నిశిత పరిశీలనా దృష్టి కూడా ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..
Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..
Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..
మరిన్ని వైరల్ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి..