Viral Video: గాల్లో ఒళ్లు గగుర్పొడిచే ఫైటింగ్.. చేప కోసం రెండు పక్షుల పోరాటం.. చివరకు ఏం జరిగిందో చూడండి..
ABN , Publish Date - Jun 07 , 2024 | 01:20 PM
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో ఆసక్తికరమైనవి చాలా మందిని ఆకట్టుకుని వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా జంతువుల వేటకు సంబంధించిన వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో ఆసక్తికరమైనవి చాలా మందిని ఆకట్టుకుని వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా జంతువుల వేటకు సంబంధించిన వీడియోలు (Hunting Videos) చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో రెండు పక్షుల (Birds) మధ్య ఆకాశంలో భీకర పోరాటం జరిగింది. ఆ ఫైటింగ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).
mukul.soman అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న వీడియోలో రెండు గ్రద్ధల మధ్య ఓ చేప కోసం ఫైటింగ్ జరుగుతోంది (Eagles fighting for fish). ఓ ముసలి గ్రద్ధ, చిన్న గ్రద్ధ ఆహారం కోసం గాలిలో పోటీ పడ్డాయి. రెండు కాళ్లతో ఫైటింగ్ చేసుకుంటూ గాల్లోనే పల్టీలు కొట్టాయి. చేపను లాక్కోవడానికి రెండూ శక్తి వంచన లేకుండా ప్రయత్నించాయి. ఆ చేప చివరకు దేనికీ దక్కలేదు. ముక్కలైపోయిన నేల మీద పడిపోయింది. గ్రద్దల విన్యాసానికి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు దాదాపు 80 లక్షల వ్యూస్ వచ్చాయి. దాదాపు 3 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందలను తెలియజేశారు. ``ఇది జీవితకాలపు షాట్``, ``ఈ వీడియో తీసినందుకు మీకు అవార్డు ఇవ్వాలి``, ``అద్భుతమైన ఫైట్ నిరుపయోగంగా మారిపోయింది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Anand Mahindra: ఫొటోకు ఫన్నీ క్యాప్షన్ అడిగిన ఆనంద్ మహీంద్రా.. విజేతకు ఏం గిఫ్ట్ ఇచ్చారంటే..!
Viral Video: ఈ టెక్నాలజీ చూసి టిమ్ కుక్ షాకవడం ఖాయం.. పగిలిపోయిన స్క్రీన్‌తో ఏం చేశాడో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..