Share News

Viral: వీడేం దొంగరా బాబూ! చోరీకొచ్చి.. అంట్లు తోమి..బట్టలు ఉతికి.. ఆపై..

ABN , Publish Date - Oct 06 , 2024 | 12:52 PM

ఇంటర్నెట్ డెస్క్: చోరీ చేసేందుకొచ్చిన ఓ దొంగ ఆ ఇంటి ఓనర్ బట్టలు ఉతికి, అంట్లు తోమి చివరకు వంట కూడా చేసిపెట్టిన వెళ్లిన వింత ఘటన బ్రిటన్‌లో వెలుగు చూసింది. స్థానికంగా కలకలం రేపుతున్న ఈ ఉదంతం నెట్టింట కూడా వైరల్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Viral: వీడేం దొంగరా బాబూ! చోరీకొచ్చి.. అంట్లు తోమి..బట్టలు ఉతికి.. ఆపై..

ఇంటర్నెట్ డెస్క్: చోరీ చేసేందుకొచ్చిన ఓ దొంగ ఆ ఇంటి ఓనర్ బట్టలు ఉతికి, అంట్లు తోమి చివరకు వంట కూడా చేసిపెట్టిన వెళ్లిన వింత ఘటన బ్రిటన్‌లో వెలుగు చూసింది. స్థానికంగా కలకలం రేపుతున్న ఈ ఉదంతం నెట్టింట కూడా వైరల్‌గా(Viral) మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇటీవల డేమియన్ వొజోనిలోవిక్జ్ మాన్‌మౌత్ షైర్‌లోని ఓ ఇంట్లోకి చోరీకి వచ్చాడు. కానీ, వచ్చిన పని మర్చిపోయి ఇంటి పనులన్నీ చక్కబెట్టాడు. అక్కడున్న కొత్త బూట్లను ప్యాకెట్లోంచి తీసి జాగ్రత్తగా పక్కనబెట్టాడు. వాటి అట్టపెట్టెలను చెత్తబుట్టలో వేశాడు. ఆ తరువాత ఫ్రిజ్‌లోని వస్తువులను జాగ్రత్తగా సర్దిపెట్టాడు.

Viral: తొలిసారి ఇడ్లీని రుచి చూసిన రష్యా యువతి! ఆమె రియాక్షన్ చూస్తే..


అప్పటికే ఇంటి ఓనర్ మార్కెట్ నుంచి తెచ్చి పెట్టుకున్న వివిధ ఆహార వస్తువులను కూడా ఫ్రిడ్జ్‌లో జాగ్రత్తగా సర్దాడు. అనంతరం, అక్కడున్న బట్టలు ఉతికి, అంట్లుతోమి పెట్టాడు. పనంతా అయిపోయాక వంట చేశాడు. చివరకు తాను కొంత తిని, ఇంట్లోని ఉన్న రెండు పెగ్గుల మద్యాన్ని కూడా తాగాడు. చివరకు ఇంట్లోంచి వెళుతూ ఓనర్‌ను ఉద్దేశించి ఓ లేఖ రాశాడు. టెన్షన్ వద్దు.. నచ్చింది తిను..బాగా ఎంజాయ్ చేయి’’ అని రాసిపెట్టి వెళ్లాడు.

ఆ సాయంత్రం ఇంటికి తిరిగొచ్చిన మహిళ అక్కడి వాతావరణం చూసి ఆశ్చర్యపోయింది. అన్ని సర్దిపెట్టి ఉండటం, డైనింగ్ టేబుల్‌పై ఫుడ్, వైన్ గ్లాసులు కనిపించే సరికి డౌటొచ్చింది. దొంగ వదిలివెళ్లిన చిట్టీ చదివాక ఆమెకు విషయం మొత్తం అర్థమైంది. పక్కింటి వ్యక్తిని సంప్రదించగా ఆమె ఇంట్లో ఎవరో బట్టలు ఉతకడం, అంట్లు తోమడం తాను చూశానని అతడు చెప్పారు. దీంతో, మహిళ గాబరా పడిపోతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Viral: కొడుకుకు బైక్ కొనిచ్చిన తండ్రి! తన తప్పేమిటో తెలిసి ఏం చేశాడో చూస్తే..


‘‘నేను ఇంట్లో ఒంటరిగా ఉంటాను. దీంతో, దొంగ వచ్చి వెళ్లడం, నాకో లేఖ రాసిపెట్టడం, బట్టలు ఉతికి, అంట్లు తోమి వెళ్లడం చూసి నేను చాలా టెన్షన్ పడిపోయాను. అతడేమైనా నన్ను ఫాలో అవుతున్నాడా అని అనుకున్నాను. ఆ తరువాత ఇంట్లో క్షణం కూడా ఉండబుద్ధి కాలేదు. స్నేహితురాలి ఇంట్లో తలదాచుకున్నా. అతడిని పోలీసుల పట్టుకున్నాకే తిరిగొచ్చా’’ అని బాధిత మహిళ చెప్పుకొచ్చింది.

ఈ ఘటన జరిగిన రెండు వారాలకు ఆ దొంగ మరో ఇంట్లో చోరీకి ప్రయత్నించి పోలీసులకు చిక్కాడు. ఇటీవల అతడికి కోర్టు 22 నెలల కారాగార శిక్ష విధించింది. అయితే, తన క్లైంట్ అప్పట్లో వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉండేవాడని దొంగ తరపు లాయర్ చెప్పుకొచ్చారు.

Viral: ఇలాంటి వ్యక్తికి రూ.65 లక్షల శాలరీనా! గూగుల్ ఆఫర్‌కు జనాలు షాక్

Read Latest and Viral News

Updated Date - Oct 06 , 2024 | 01:08 PM