Share News

Viral: పెళ్లికి 14 రోజులుందనగా బాయ్‌ఫ్రెండ్ సీక్రెట్ గురించి తెలిసి..

ABN , Publish Date - Nov 08 , 2024 | 08:19 PM

తన కలల రాకుమారుడు లభించాడని ఆమె మురిసిపోయింది. అతడితో పెళ్లికి సిద్ధపడింది. అయితే, పెళ్లికి సరిగ్గా 14 రోజుల ముందు ఆమె కలలన్నీ కల్లలైపోయాయి. బాయ్‌ఫ్రెండ్ నిజస్వరూపం తెలిసి ఆమె దిమ్మెరపోయింది. ఇంత దారుణంగా మోసపోతానని అస్సలు ఊహించని ఆమె చివరకు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది.

Viral: పెళ్లికి 14 రోజులుందనగా బాయ్‌ఫ్రెండ్ సీక్రెట్ గురించి తెలిసి..

ఇంటర్నెట్ డెస్క్: తన కలల రాకుమారుడు లభించాడని ఆమె మురిసిపోయింది. అతడితో పెళ్లికి సిద్ధపడింది. వివాహం తరువాత అద్భుత వైవాహిక జీవితం తన సొంతమవుతుందని సంబరపడిపోయింది. అయితే, పెళ్లికి సరిగ్గా 14 రోజుల ముందు ఆమె కలలన్నీ కల్లలైపోయాయి. బాయ్‌ఫ్రెండ్ నిజస్వరూపం తెలిసి ఆమె దిమ్మెరపోయింది. ఇంత దారుణంగా మోసపోతానని అస్సలు ఊహించని ఆమె చివరకు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది (Viral). బ్రిటన్‌లో వెలుగు చూసిన ఈ ఉదంతం పూర్తి వివరాల్లోకి వెళితే..

Viral: లీవ్ ఇవ్వని బాస్.. వీడియో కాల్‌‌‌లో పెళ్లి చేసుకున్న యువకుడు


స్థానిక మీడియా కథనాల ప్రకారం, 27 ఏళ్ల మేగన్ క్లార్క్ గతంలో ఓ బార్‌లో మేనేజర్‌గా పనిచేసింది. అప్పట్లో అక్కడ ఆమెకు లార్డ్ బెర్టీ తారసపడ్డాడు. అతడు తనని తాను టైప్ రైటర్ ఆవిష్కర్త మనవడినని చెప్పుకున్నాడు. అతడి మాటతీరు, హుందాతనం నచ్చడంతో మేగన్ ప్రేమలో పడిపోయింది. ఆ తరువాత ఆ జంట ఐదు నెలల పాటు డేటింగ్‌లో మునిగితేలింది. చివరకు ఆమె అతడిని పెళ్లాడేందుకు అంగీకరించింది. ఆ తరువాత ఇద్దరూ ఓ లగ్జరీ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. ఉమ్మడి భవిష్యత్తు కోసం ప్రణాళికలు రచించడం ప్రారంభించారు. అంతేకాదు, బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి మేగన్ చేతిగడియారాల డిజైనింగ్ వ్యాపారాన్ని కూడా మొదలెట్టింది.

ఈ క్రమంలో వారి ఇంటికి రకరకాల ఉత్తరాలు రావడం ప్రారంభమైంది. ఆ ఉత్తరాలపై అపరిచితుల పేర్లు ఉండేవి. ఇదంతా అనుమానాస్పదంగా ఉండటంతో ఆమె బెర్టీని ప్రశ్నించింది. అతడు మాత్రం టెన్షన్ వద్దని ఆమెకు సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు. మునుపు ఆ ఇంట్లో ఉండివెళ్లిన వాళ్ల పేరిట ఉత్తరాలు వస్తున్నాయని అన్నారు.

Viral: స్కూల్లో జరిగేదేంటో తెలుసుకునేందుకు కూతురి ఆటబొమ్మలో సీక్రెట్ కెమెరా


కానీ మేగన్‌లో మాత్రం అనుమానాలు బలపడటంతో ఆమె బెర్టీ పని చేసే ఆఫీసుకు వెళ్లి వాకబు చేసింది. దీంతో, అతడికున్న మరో కోణం వెలుగులోకి వచ్చింది. బెర్టీ వాలెట్‌లో ఆమెకు ఎవరెవరి పేరు మీదో ఉన్న పలు క్రెడిట్ కార్డులు లభించాయి. అవన్నీ చోరీ చేసిన క్రెడిట్ కార్డులనీ ఆమె ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి గుర్తించింది. అంతేకాకుండా, బెర్టీ తన పేర కూడా పలు క్రెడిట్ కార్డులు తీసుకుని రూ.33 లక్షల అప్పు చేసినట్టు గుర్తించింది. అతడు తనకిచ్చిన ఎంగేజ్‌మెంట్ రింగుతో ఆ అప్పులన్నీ తీరుద్దామనుకుంటే ఆ ఉంగరం కూడా నకిలీదని తెలిసి దిమ్మెరపోయింది. చివరకు అతడి పేరు బెర్టీ కూడా కాదని తెలిసి ఆమెకు నోట మాటరాలేదు. చివరకు ఆమె కన్నీరుమున్నీరవుతూ అతడిపై ఫిర్యాదు చేయడంతో కటకటాల పాలయ్యాడు. ఆ తరువాత జైలు నుంచి కూడా తప్పించుకున్నాడు.

Read Latest and Viral News

Updated Date - Nov 08 , 2024 | 08:23 PM