Share News

Viral: ఈ స్లిప్పర్స్ చలికాలం కోసమట.. ఏం క్రియేటివిటీరా బాబూ..

ABN , Publish Date - Nov 11 , 2024 | 06:44 PM

చలికాలం కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఓ స్లిప్పర్స్ జత ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ కాలంలో కాళ్లకు వేడి తగిలేందుకు వీలుగా ఈ చెప్పుల్లో బొగ్గులు దాచుకునే ఒక సొరుగును కూడా ఏర్పాటు చేశారు.

Viral: ఈ స్లిప్పర్స్ చలికాలం కోసమట.. ఏం క్రియేటివిటీరా బాబూ..

ఇంటర్నెట్ డెస్క్: చలికాలం వచ్చిందంటే చాలు స్వెట్టర్లు, రగ్గులకు డిమాండ్ పెరిగిపోతుంది. ఇందుకు తగ్గట్టుగా రకరకాల ఉత్పత్తులు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. చలితట్టుకునేందుకు ఏమేం చేయాలో చెప్పే వీడియోలు కూడా ట్రెండింగ్‌లోకి వచ్చేస్తాయి. అయితే, చలికాలం కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఓ స్లిప్పర్స్ జత ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral) అవుతోంది. ఈ కాలంలో కాళ్లకు వేడి తగిలేందుకు వీలుగా ఈ చెప్పుల్లో మండుతున్న బొగ్గులు దాచుకునే ఒక సొరుగును కూడా ఏర్పాటు చేశారు.

Viral: విమానాలకు తెలుపు రంగు పెయింట్ మాత్రమే వేస్తారు.. ఎందుకో తెలుసా?


వాస్తవానికి చెప్పులను రబ్బర్ లేదా లెదర్‌తో చేస్తారు. కానీ ఈ చెప్పుల జతను చూస్తే ఇనుముతో చేసినట్టు అనిపిస్తుంది. అంతేకాకుండా చెప్పు అడుగు భాగంలో ఓ చిన్న సొరుగును కూడా ఏర్పాటు చేశారు. ఈ సొరుగును బయటకు లాగి రెండు మూడు కణకణలాడే బొగ్గు ముక్కలు వేసి మళ్లీ మూసేయాలి. ఆ తరువాత వీటిని వేసుకుంటే చలికాలంలో అరికాళ్లు వెచ్చగా ఉంటాయట. వీడియోలోని వ్యక్తి ఇదంతా ప్రత్యక్షంగా చేసి చూపించాడు. బొగ్గులు ఉన్న చెప్పులను దర్జాగా ధరించి నడుచుకుంటూ వెళ్లాడు.

ఇక వీడియో చూసిన జనాలు షాకైపోతున్నారు. ఈ క్రియేటివిటీ మండినట్టు ఉందని, ఈ చెప్పులు వేసుకుంటే అరికాళ్ల బొబ్బలెక్కడం పక్కా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకు వివిధ ప్రముఖులు చేసిన సరదా కామెంట్స్ కూడా జత చేసి ఎడిట్ చేసిన వీడియో షేర్ చేయడంతో జనాలు పడీ పడీ నవ్వుకుంటున్నారు. అతి తెలివి అంటే ఇదేనంటూ కామెంట్స్ చేస్తున్నారు. వ్యూస్ కోసం చేసిన ఈ ప్రయత్నం బాగుందని కొందరు అభిప్రాయపడ్డారు. (వీడియో కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి)

Viral: తాత పుట్టిన రోజున ఒంటరిగా బామ్మ.. మనవడి ఊహించని సర్‌ప్రైజ్!


ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో కూడా చలి మొదలైంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో రాత్రి వేళ ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్‌ దిగువకు చేరుకుంటున్నాయి. మరో రెండు రోజుల పాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు ఏపీలో కూడా చలి పంజా విసిరింది. అల్లూరిసీతారామ రాజు జిల్లాలో పలుచోట్లు ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల సెల్సియస్ దిగువకు పడిపోయాయి. చింతపల్లిలో కనిష్ఠంగా 14.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్టు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం పేర్కొంది. గతేడాది చింతపల్లిలో కనిష్ట ఉష్ణోగ్రత 12.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు.

Read Latest and Viral News

Updated Date - Nov 11 , 2024 | 07:59 PM