Share News

Viral: శోభనం రాత్రి వధువు కోరిక విని షాక్! పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వరుడు

ABN , Publish Date - Dec 20 , 2024 | 10:37 PM

శోభనం రాత్రి వధువు కోరిక విని తీవ్ర ఆగ్రహానికి లోనైన వరుడు అప్పటికప్పుడు పెళ్లిని తెగదెంపులు చేసుకున్న షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది.

Viral: శోభనం రాత్రి వధువు కోరిక విని షాక్! పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న వరుడు

ఇంటర్నెట్ డెస్క్: శోభనం రాత్రి వధువు కోరిక విని తీవ్ర ఆగ్రహానికి లోనైన వరుడు అప్పటికప్పుడు పెళ్లిని తెగదెంపులు చేసుకున్న షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. స్థానికంగా ఇది చర్చనీయాంశంగా మారింది (Viral).

Viral: ప్రియురాలి ఎఫైర్‌తో మనోవేదన! బాధితుడికి రూ.35 లక్షల పరిహారం!


స్థానిక మీడియా కథనాల ప్రకారం, సహారన్‌పూర్‌కు చెందిన యువకుడికి లూథియానాకు చెందిన యువతితో ఇటీవల వివాహమైంది. అయితే, శోభనం రాత్రి వధువు వరుడిని బీర్ బాటిల్ తెమ్మని కోరింది. దీనికి అంగీకరించిన అతడు లేచి వెళుతుండగా ఆమె అతడిని మళ్లీ పిలిచింది. వస్తూ వస్తూ..గాంజాయి ప్యాకెట్లు, మటన్ కూర కూడా తీసుకు రమ్మని కోరింది. దీంతో వరుడికి కోపం నషాళానికి అంటి ఇంతెత్తున ఆమె మండిపడ్డాడు. పెద్దగా గొడవపెట్టుకున్నాడు.

Viral: యువకుడికి షాక్! పెళ్లికోసమై వలలో పడి.. రూ.55 లక్షల నష్టపోయి..


దీంతో, వధువు కుటుంబం వచ్చి వరుడిని శాంత పరిచే ప్రయత్నం చేసింది. వధువు జోక్ చేసిందని సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని నచ్చచెప్పింది. కానీ వరుడు వెనక్కు తగ్గేదే లేదనడంతో చివరకు పంచాయతీ పోలీస్ స్టేషన్‌కు చేరింది. అక్కడ కూడా వరుడు తన పట్టినపట్టును వీడలేదు. వధువును ఏలుకునేదే లేదని తేల్చి చెప్పాడు. మరోవైపు, వధువు తీరు తమకు అనుమానాస్పదంగా ఉందని వరుడి కుటుంబసభ్యులు కూడా చెప్పుకొచ్చారు. ఆమె ట్రాన్స్ జెండర్ అయి ఉండొచ్చన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. వరుడు నిర్ణయం సరైనదేనని మద్దతు తెలిపారు. దీంతో, వధువు ఆమె కుటుంబం వెనక్కు మళ్లింది.

Viral: ద్రవ్యోల్బణం పీక్స్‌కెళ్లడం అంటే ఇదీ! కప్పు కాఫీ ధర ఎంతో తెలిస్తే..

Read Latest and Viral News

Updated Date - Dec 20 , 2024 | 10:37 PM