Share News

Viral: పాము పగబట్టిందా? 50 రోజుల్లో ఏకంగా 7 సార్లు యువకుడికి పాము కాటు!

ABN , Publish Date - Jul 21 , 2024 | 05:34 PM

పాము పగబట్టిందని ఒణికిపోతున్న ఓ యువకుడు తనను కాపాడాలంటూ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాడు. ఇప్పటికీ ఏడు సార్లు కాటేసిందని, పదోసారి కాటేస్తే మాత్రం తనకు చావు తప్పదని కల వచ్చినట్టు చెప్పుకొచ్చాడు. యూపీలో వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Viral: పాము పగబట్టిందా? 50 రోజుల్లో ఏకంగా 7 సార్లు యువకుడికి పాము కాటు!

ఇంటర్నెట్ డెస్క్: పాము పగబట్టిందని ఒణికిపోతున్న ఓ యువకుడు తనను కాపాడాలంటూ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాడు. ఇప్పటికీ ఏడు సార్లు కాటేసిందని, పదోసారి కాటేస్తే మాత్రం తనకు చావు తప్పదని కల వచ్చినట్టు చెప్పుకొచ్చాడు. ఇప్పటికే అతడు ఏడు సార్లు పాము కాటుకు ఆసుపత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యాడు. తన కొడుకు కాపాడాలని, చికిత్సకు డబ్బులు కూడా లేవని యువకుడి తండ్రి పోలీసులను ఆశ్రయించడంతో ఇందులో నిజానిజాలను తేల్చేందుకు ప్రభుత్వం ఓ కమిటీ కూడా వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఫతేపూర్ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా (Viral) మారింది.

Viral: మరణ శిక్షకు ముందు కోర్టులో ఖైదీ వింత కోరిక


జిల్లాలోని సౌరా గ్రామానికి చెందిన వికాస్ ద్వివేదీని జూన్ 2 తొలిసారిగా పాము కాటేసింది. ఉమ్మడి కుటుంబంలో ఉన్న అతడు రాత్రి వేళ తన పక్క సర్దుకుంటుండగా పాము కాటేసి వెళ్లిపోయింది. పక్క కిందకు వెళ్లిపోతున్న నల్లని పామును చూసి భయపడిపోయిన అతడు వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు వెంటనే యువకుడిని ఆసుపత్రికి తరలించగా మూడు రోజుల పాటు చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యాడు. అది మొదలు గడిచిన 50 రోజుల్లో వరసుగా ఆరు సార్లు పాము కాటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు అతడికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స చేయించి ఇంటికి తీసుకొచ్చాడు (UP Man Bitten By Same Snake In Seven Times Or Phobia ).


వికాస్ తండ్రి టీకొట్టు నడుపుకుంటూ ఉంటారు. కొడుకుకు పదే పదే చికిత్స చేయించలేక తాను తెగ ఇబ్బందులు పడుతున్నానంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఉదంతం విచిత్రంగా ఉండటంతో అసలేం జరుగుతోందో తెలుసుకునేందుకు వైద్య శాఖ ఓ కమిటీ కూడా వేసింది. కమిటీలోని వైద్యులు యువకుడి పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు. యువకుడు ఇప్పటివరకూ ఏడు సార్లు ఆసుపత్రి పాలవ్వగా అతడి ఆసుపత్రి రికార్డులన్నీ పరిశీలించారు. తొలిసారి మినహా మరెప్పుడూ యువకుడి కుటుంబసభ్యులు పామును చూడలేదని గుర్తించారు.


అంతేకాకుండా, తొలిసారి పాముకాటుకు సంబంధించిన గాయాన్ని మరో పాముకాటు బాధితుడితో పోల్చి చూడగా రెండూ ఒకేలా కనిపించాయి. మిగతా సందర్భాల్లో మాత్రం పాము కాటు గుర్తులు కాస్త భిన్నంగా ఉండటం గమనించారు. బాధితుడిని అతడి కుటుంబసభ్యులు ప్రతిసారీ అనే ఆసుపత్రికి తీసుకెళుతున్న తీరును కూడా గుర్తించారు. యువకుడు భయపడుతున్నట్టుగా పాము పగబట్టలేదని తేల్చారు. అయితే, పాముకాటు భయంతో మనసంతా నిండిపోవడంతో అతడు స్నేక్ ఫోబియా బారిన పడ్డట్టు తేల్చారు. త్వరలో సైకియాట్రిస్టుతో కౌన్సెలింగ్ ఇప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read Viral and Telugu News

Updated Date - Jul 21 , 2024 | 05:40 PM