Viral: పెళ్లిలో వధూవరులకు భారీ షాక్! మా తప్పేంటో చెప్పండంటూ ఆవేదన
ABN , Publish Date - Nov 12 , 2024 | 03:11 PM
తమ వివాహానికి అతిథులెవ్వరూ రాకపోవడంతో ఓ జంట నివ్వెరపోయింది. తాము ఎవరికీ ఏమీ కామా అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తమకు ఇది తలవంపులని, బాధ నుంచి ఇంకా కోలుకోలేకుండా ఉన్నామని కొత్త పెళ్లికూతురు నెట్టింట ఆవేదన వ్యక్తం చేసింది. ఇది ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: జీవితంలో అతి ముఖ్య ఘట్టమైన వివాహాన్ని బంధువులు, స్నేహితుల సమక్షంలో జరుపుకోవాలని ఏ జంట అయినా కోరుకుంటుంది. శ్రేయోభిలాషుల సమక్షంలో వారి ఆశీర్వాదం, శుభాకాంక్షలతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటుంది. తమ సంతోషం అందరితో పంచుకోవాలని భావిస్తుంది. అందుకే పెళ్లంటే అనేక మందికి ఆహ్వానాలు పంపేది. పాపం.. ఓ అమెరికా జంట కూడా సరిగ్గా ఇలాగే ఆలోచించింది. ఎంతో సంబరంగా అయినవాళ్లందరికీ ఆహ్వానాలు పంపింది. ఆ తరువాత పెళ్లిలో కనిపించిన సీన్ చూసి దిమ్మెరపోయిన వారు చివరకు నెట్టింట ఆవేదన పంచుకుంది (Viral). ప్రస్తుతం అమెరికాలో సంచలనం కలిగిస్తున్న ఈ ఉదంతం పూర్తి వివరాల్లోకి వెళితే..
Viral: ఆన్‌లైన్ డేటింగా? జాగ్రత్త.. ఇలాంటోళ్లు తారసపడితే కొంప కొల్లేరే!
ఓరెగాన్ రాష్ట్రానికి చెందిన కలీనా మారీ, ఆమె బాయ్‌ఫ్రెండ్ షేన్ తొమ్మిదేళ్లుగా కలిసే ఉంటున్నారు. వారికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. వివిధ కారణాల రీత్యా పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చిన ఆ జంట వివాహంతో తమ బంధాన్ని శాశ్వతం చేసుకోవాలని భావించింది. ఇక మారీకి తన పెళ్లి అంగరంగ వైభవంగా జరుపుకోవాలని ఎప్పటి నుంచో కలలు కనేది. బంధువులు స్నేహితులు, పెద్ద ఎత్తున హాజరుకావాలని, వారి సమక్ష్యంలో వైభవంగా తాను మనువాడాలని భావించేంది. ఇందుకు అనుగూణంగానే ఆమె, తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి పెళ్లి ఏర్పాట్లు చేసుకుంది. ముందుగా ఎంచుకున్న థీమ్‌కు అనుగూణంగా పెళ్లి వేదికను అలంకరించింది.
Viral: ఈ స్లిప్పర్స్ చలికాలం కోసమట.. ఏం క్రియేటివిటీరా బాబూ..
కానీ పెళ్లి రోజున మాత్రం ఆ జంటకు ఊహించని షాక్ తగిలింది. వారు వేదికలోపలికి రాగా అక్కడ అతిథులెవరూ లేక బోసిపోయి కనిపించడంతో ఆ జంట షాకైపోయారు. ఆ జంట తొమ్మిదేళ్ల కుమారుడు, మరో ఇద్దరు అతిథులు మినహా ఒక్కరు కూడా పెళ్లికి రాలేదు. మారి మొత్తం 100 మంది ఆహ్వానం పంపించింది. 75 ఆహ్వానాలను డిజిటల్ రూపంలో మరో 25 ఆహ్వానాలను స్వయంగా డబ్బులు కట్టి పోస్టులో పంపించింది. కానీ వారెవరూ ఆమె పెళ్లికి రాకపోవడంతో మారీ హతాశురాలైంది.
‘‘ఇదేమి క్రూరమైన జోక్? మా పెళ్లికి ఎవరూ హాజరు కాలేదు. ఒంటి గంటకు వివాహమని పేర్కొన్నాము. ఇప్పుడు 1.15 అవుతోంది. వేదిక వద్ద ఒక్కరు కూడా లేదు. చివరకు నేను, నా బాయ్‌ఫ్రెండ్ 2.00 గంటలకు వివాహం చేసుకున్నాము. ఎందుకిలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. మేము ఏం తప్పు చేశాము? మేము అంత దారుణమైన వ్యక్తులమా? ఎవరికీ ఏమీ కామా? నా భర్త ఎంతో బాధపడ్డాడు’’ అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. తమకు ఈ ఘటన తలవంపులు తెచ్చిందని, ఈ బాధ నుంచి కోలుకునేందుకు ఇంకా సమయం పడుతుందని చెప్పుకొచ్చింది.