Share News

Viral: మనసు మాట విని ఏకంగా రూ.20 కోట్లు కొల్లగొట్టాడు! ఎలాగో తెలిస్తే..

ABN , Publish Date - Jun 11 , 2024 | 04:01 PM

సిక్స్త్ సెన్స్‌ నమ్ముకున్న ఓ వ్యక్తి రాత్రికి రాత్రి కోటీశ్వరుడిగా మారాడు. ఏకంగా రూ.20 కోట్లకు అధిపతి అయ్యాడు. ఆశ్చర్యంగొలిపే ఈ ఘటన అమెరికాలో ఇటీవల వెలుగు చూసింది.

Viral: మనసు మాట విని ఏకంగా రూ.20 కోట్లు కొల్లగొట్టాడు! ఎలాగో తెలిస్తే..

ఇంటర్నెట్ డెస్క్: సిక్స్త్ సెన్స్‌ను నమ్ముకున్న ఓ వ్యక్తి రాత్రికి రాత్రి కోటీశ్వరుడిగా మారాడు. ఏకంగా రూ.20 కోట్లకు అధిపతి అయ్యాడు. ఆశ్చర్యంగొలిపే ఈ ఘటన అమెరికాలో ఇటీవల వెలుగు చూసింది. నెట్టింట తెగ వైరల్ (Viral) అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

దక్షిణ కెరొలీనా బ్లఫ్టన్ టౌన్‌కు చెందిన ఈ లక్కీ ఫెలోకు లాటరీ టిక్కెట్లు కొనే అలవాటే లేదు. అసలు ఆ వైపు అతడి ఆలోచనలే వెళ్లలేదు. ఆ రోజు ఇంధనం కోసం గ్యాస్ స్టేషన్ వద్ద ఆగిన అతడు అనుకోకుండా స్టాక్స్ ఆఫ్ క్యాష్ గేమ్ ఆడాడు. అయితే, అతడికి ఆ క్షణంలో తన అదృష్టం మారబోతోందని అనిపించింది. మనసులోని ఈ భావన తీవ్రంగా ఉండటం అతడికి ఎందుకో ఆశ్చర్యం కలిగించింది (US Man Goes With His ‘Gut Feeling’ And Buys Lottery Ticket Wins Over Rs 20 Crore).

Viral: అమెరికా వీధుల్లో పానీ పురి స్టాల్.. జనాల రెస్పాన్స్ చూస్తే..


దీంతో, అతడు మరో ఆలోచన లేకుండా తన సిక్స్త్ సెన్స్ చెప్పినట్టే నడుచుకున్నాడు. 10 డాలర్లు పెట్టి ఆ గ్యాస్ స్టేషన్ లోనే ఓ లాటరీ టిక్కెట్టు కొన్నాడు. చివరకు, అతడి సిక్స్త్ సెన్స్ చెప్పిందే నిజమైంది. ఆ రోజు లాటరీలో అతడు మొదటి బహుమతి కింద ఏకంగా మూడు లక్షల డాలర్లు గెలుచుకున్నాడు. మన కరెన్సీలో చెప్పాలంటే ఏకంగా రూ.20 కోట్లు గెలుచుకున్నాడు. దీంతో, అతడి ఆనందానికి అంతేలేకుండా పోయింది. లాటరీ తగిలిన రోజు ఆఫీసులోనే ఉన్న అతడు హాఫ్ డే సెలవు పెట్టి ఇంటికెళ్లిపోయాడు. ఆ తరువాత తన అప్పులన్నీ తీర్చేసి, మంచి సౌకర్యవంతమైన ఇంట్లోకి మారిపోయాడు.

అంతకుమునుపు జనవరిలో, డేవ్‌సన్ ఎల్విస్ మార్టిన్స్ కూడా దాదాపు ఇదే తరహాలో కోటీశ్వరుడైపోయాడు. తొలిసారి లాటరీ టిక్కెట్ కొన్న అతడు రూ. 50 వేులు గెలుచుకోగా రెండో సారి మళ్లీ లాటరీ టిక్కెట్టు కొనగా ఏకంగా రూ. 8 కోట్లు బంపర్ ఆఫర్ తెగిలింది.

Read Viral and Telugu News

Updated Date - Jun 11 , 2024 | 04:05 PM