Share News

Viral: ఏ భార్యా చూడలేని దృశ్యం.. కళ్ల ముందే ఆమె భర్తను..

ABN , Publish Date - Jun 25 , 2024 | 05:25 PM

ఏ భార్యా తట్టుకోలేని దారుణ అనుభవం ఓ అమెరికా మహిళకు ఎదురైంది. కళ్లముందే ఆమె భర్తను ఓ సొరచేప ఖండఖండాలుగా కొరికి ముక్కలు చేస్తున్నా ఏం చేయలేక నిస్సహాయంగా చూస్తుండిపోయింది.

Viral: ఏ భార్యా చూడలేని దృశ్యం.. కళ్ల ముందే ఆమె భర్తను..

ఇంటర్నెట్ డెస్క్: ఏ భార్యా తట్టుకోలేని దారుణ అనుభవం ఓ అమెరికా మహిళకు ఎదురైంది. కళ్లముందే ఆమె భర్తను ఓ సొరచేప ఖండఖండాలుగా కొరికి ముక్కలు చేస్తున్నా ఏం చేయలేక నిస్సహాయంగా చూస్తుండిపోయింది. ఫ్లోరిడా రాష్ట్రంలో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా పెను సంచలనానికి దారి తీసింది (Viral).

Viral: వధువు మేకప్ వేసుకుంటుండగా తుపాకీతో కాల్చి హత్య!


థాడియస్ కుబిన్‌స్కీ అనే వృద్ధుడు కొన్నేళ్లుగా ఫ్లోరిడాలోని బోకా సియేగా బే తీరానికి సమీపంలో నివసిస్తుంటారు. ఇటీవల ఆయన తన భార్యతో కలిసి సముద్రంలో ఈత కొట్టేందుకు వెళ్లారు. ఆ సమయంలో అతడిపై ఓ సొరచేప అకస్మాత్తుగా దాడి చేసింది. ఒక్కసారిగా ఆయనను కొరకడంతో శరీరంలో కొంత భాగం ఊడొచ్చేసింది. క్షణకాలంలో నీరు ఎర్రరంగులోకి మారిపోయింది. దారుణం చూసి షాకైపోయిన భార్య వెంటనే అత్యవసర సిబ్బందికి సమాచారం అందించింది. కానీ, తీవ్ర గాయాల పాలైన భర్త అప్పటికే కన్నుమూశాడు (US Man Killed By 9-foot-tall Shark Wife Watches Helplessly).

తీవ్ర గాయాలు, రక్తస్రావం కావడంతో థాడియస్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. తమ సంతానానికి ఈత నేర్పిన చోటే భర్త సొరచేప బారినపడటంతో అతడి భార్య కన్నీరు మున్నీరవుతోంది. ఆకలిగొన్న సొరచేప అతడిపై దాడి చేసి ఉంటుందని అక్కడి జంతుశాస్త్రవేత్తలు అంచనాకు వచ్చారు. ఈ ఘటన స్థానికంగా పెను సంచలనానికి దారి తీసింది.

Read Viral and Telugu News

Updated Date - Jun 26 , 2024 | 10:06 PM