Share News

Viral: వీడియో గేమ్‌లో ఓడినందుకు 8 నెలల శిశువును గోడకేసి విసిరికొట్టిన తండ్రి

ABN , Publish Date - Nov 18 , 2024 | 10:12 PM

అమెరికాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వీడియో గేమ్‌లో వెనకబడ్డ ఓ 20 ఏళ్ల యువకుడు తీవ్ర అసహనానికి లోనై తన 8 నెలల శిశువును గోడకేసి కొట్టాడు.

Viral: వీడియో గేమ్‌లో ఓడినందుకు 8 నెలల శిశువును గోడకేసి విసిరికొట్టిన తండ్రి

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వీడియో గేమ్‌లో వెనకబడ్డ ఓ 20 ఏళ్ల యువకుడు తీవ్ర అసహనానికి లోనై తన 8 నెలల శిశువును గోడకేసి కొట్టాడు (Viral). మిల్వాకీ నగరంలో ఈ దారుణం వెలుగు చూసింది.

ఆసుపత్రిలో చిన్నారిని పరీక్షించిన వైద్యులకు ఆందోళన కర స్థాయిలో గాయాలు కనిపించాయి. పలు విరిగిన ఎముకలు క్రమంగా అతుక్కుంటున్న తీరు సీటీ స్కాన్‌లో కనిపించింది. అంతేకాకుండా, చిన్నారి కన్ను కూడా వాచిపోయింది. దీంతో, ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు.

Viral: డాక్టర్ దారుణం! 13 ఏళ్ల కూతురితో పేషెంట్‌కు మెదడు ఆపరేషన్! ఇప్పుడేమో..


అసలేం జరిగిందనే దానిపై చిన్నారి తండ్రి జేలిన్ వైట్ భిన్న వాదనలు వినిపించాడు. చిన్నారి గాయాలకు తల్లే కారణం అని అన్నాడు. చివరకు చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. వీడియో గేమ్‌లో రెండు పాయింట్లు వెనకబడినందుకు చిరాకొచ్చి పక్కనే ఉన్న చిన్నారిని గోడకేసి కొట్టినట్టు చెప్పుకొచ్చాడు. బిడ్డ గోడకు ఢీకొన్న చప్పుడు కూడా వినిపించిందని అతడు పోలీసులకు వాంగ్మూలమిచ్చాడు. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు నవంబర్ 5న కేసు నమోదు చేసుకున్నారు.

Banana Phobia: మహిళా మంత్రికి వింత భయం! అధికారిక కార్యక్రమాల్లో అరటి పళ్లపై నిషేధం!


కాగా చిన్నారిపై వేధింపులకు పాల్పడిన నేరంపై వైట్‌‌‌ కేసు నమోదు చేశారు. ఈ కేసులో అతడికి 62 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ప్రస్తుతం శిశువు చావుబతుకుల్లో ఉన్నట్టు వైద్యులు తెలిపారు. చిన్నారి బతికే అవకాశాలు కూడా తక్కువని అన్నారు. శిశువు మృతి చెందితే తండ్రిపై హత్య నేరం కింద కేసు నమోదవుతుందని, యావజ్జీవ కారాగార శిక్ష పడుతుందని స్థానిక మీడియా పేర్కొంది.

Viral: లాటరీలో రూ.20 కోట్లు గెలిచాక మహిళ జీవితం తారుమారు! విధి అంటే ఇదేనేమో!

Viral: అమ్మో.. సొర చేపపై స్వారీ.. ఇంతకంటే మూర్ఖత్వం ఏమైనా ఉంటుందా

Read Latest and Viral News

Updated Date - Nov 18 , 2024 | 10:17 PM