Viral News: సెక్స్ వర్కర్ దారుణం.. హెచ్‌ఐవీ సోకిన విషయం దాచి 200 మందితో శృంగారం.. చివరకు..
ABN , Publish Date - May 21 , 2024 | 12:05 PM
అమెరికాకు చెందిన ఓ సెక్స్ వర్కర్ చేసిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చి ఎంతో మందికి షాక్ కలిగించింది. హెచ్‌ఐవీ బాధితురాలు అయిన ఆ 30 ఏళ్ల మహిళ ఆ విషయాన్ని దాచి ఏకంగా 200 మందికి పైగా పురుషులతో లైంగిక కార్యకలాపాలు సాగించింది.
అమెరికా (America)కు చెందిన ఓ సెక్స్ వర్కర్ (Prostitute) చేసిన దారుణం తాజాగా వెలుగులోకి వచ్చి ఎంతో మందికి షాక్ కలిగించింది. హెచ్‌ఐవీ (HIV) బాధితురాలు అయిన ఆ 30 ఏళ్ల మహిళ ఆ విషయాన్ని దాచి ఏకంగా 200 మందికి పైగా పురుషులతో లైంగిక కార్యకలాపాలు సాగించింది. ఆ విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు హెల్త్ అలెర్ట్‌ను జారీ చేశారు. ఆమెతో శృంగారం సాగించిన వారందరూ వెంటనే హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు (Viral News).
ఒహైయోలోని మరియోట్టాకు చెందిన లిండా లెచెసే అనే 30 ఏళ్ల మహిళ 2022 జనవరిలో హెచ్‌ఐవీ పరీక్ష చేయించుకోగా ఆమెకు పాజిటివ్ అని తేలింది. అయినా ఆమె ఆ విషయాన్ని దాచి సెక్స్ వర్కర్‌గా కొనసాగింది. మరియోట్టాలోని మార్కెట్ స్ట్రీట్‌లో నిల్చుని పురుషులను ఆకర్షిస్తూ వారికి శారీరక సుఖం అందించేది. అలా ఈ రెండున్నరేళ్లలో మొత్తం 211 మందితో ఆమె శృంగారం చేసింది. లిండా గురించి స్థానిక అధికారులకు చాలా ఆలస్యంగా తెలిసింది. వెంటనే వారు పబ్లిక్ హెల్త్ నోటీసులను జారీ చేశారు.
లిండాను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఆమెతో సన్నిహితంగా మెలిగిన వారందరూ వెంటనే హెచ్‌ఐవీ పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. ఆమె క్లయింట్లకు వ్యక్తిగతంగా ఫోన్లు చేస్తున్నారు. మిగతా వారి కోసం వివిధ రకాల మార్గాల ద్వారా ప్రకటనలు ఇస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: వామ్మో.. ఫోన్ పిచ్చి పడితే ఇలాగే ఉంటుందేమో! ఆ మహిళ తెలివి చూస్తే కళ్లు తేలెయ్యాల్సిందే!
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..