Share News

USA: పొరపాటున కీలక అవయవాన్ని తొలగించిన డాక్టర్.. రోగి మృతి!

ABN , Publish Date - Sep 05 , 2024 | 11:51 AM

వైద్యుడి నిర్లక్ష్యం ఓ రోగి ప్రాణాలను తీసింది. శస్త్రచికిత్స సందర్భంగా పొరపాటున కాలేయాన్ని తొలగించడంతో అతడు మృతి చెందాడు. అగ్రరాజ్యం అమెరికాలో వెలుగు చూసిన ఈ ఘటన పెను సంచలనం కలిగిస్తోంది.

USA: పొరపాటున కీలక అవయవాన్ని తొలగించిన డాక్టర్.. రోగి మృతి!

ఇంటర్నెట్ డెస్క్: వైద్యుడి నిర్లక్ష్యం ఓ రోగి ప్రాణాలను తీసింది. శస్త్రచికిత్స సందర్భంగా పొరపాటున కాలేయాన్ని తొలగించడంతో అతడు మృతి చెందాడు. అగ్రరాజ్యం అమెరికాలో (USA) వెలుగు చూసిన ఈ ఘటన పెను సంచలనం కలిగిస్తోంది.

ఫ్లోరిడాలోని ఎసెన్షన్ సెక్రెడ్ హార్ట్ ఎమరాల్డ్ కోస్ట్ హాస్పిటల్లో ఆగస్టు 21న ఈ ఘటన జరిగింది. అంతకురెండు రోజుల ముందు, ఓ హోటల్‌లో తన భార్యతో కలిసి బస చేసిన విలియమ్ బ్రయన్‌కు అకస్మాత్తుగా కడుపులో నొప్పి మొదలైంది. నొప్పి తీవ్రం కావడంతో వారు ఎసెన్షన్ ఆసుపత్రిని సందర్శించారు.

Weekend Sleep: వారాంతాల్లో తనివితీరా నిద్రతో హృద్రోగాల నుంచి రక్షణ లభిస్తుందా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..


ఆసుపత్రిలోని డా, షాక్నావ్‌స్కీ విలియమ్‌ను పరీక్షించి అతడి స్ప్లీన్ అవయంలో సమస్య ఉందన్నారు. వెంటనే దాన్ని శస్త్రచికిత్స చేసి తొలగించారు. ఆపరేషన్ అంటే తొలుత తటపటాయించిన విలియమ్.. ఆ తరువాత వైద్యుల సూచనకు అంగీకరించారు (USA doctor accidentally removes liver instead of spleen patient).

అయితే, ఆపరేషన్ సందర్భంగా డాక్టర్ ఘోర తప్పిదానికి పాల్పడ్డారని విలియమ్ భార్య ఆరోపించారు. స్ప్లీన్‌కు బదులు లివర్‌ను తొలగించారని, ఈ సందర్భంగా కీలక రక్త నాళం తెగడంతో తీవ్ర రక్తస్రావమై తన భర్త మరణించారని చెప్పారు. తొలగించిన లివర్‌ను స్ప్లీన్‌ అని చెప్పి తమను మభ్య పెట్టే ప్రయత్నం కూడా చేశారని అన్నారు. రోగం కారణంగా దాని సైజు నాలుగు రెట్లు పెరిగి పొట్టలో ఓ చోట నుంచి మరో చోటకు వచ్చేసిందని అన్నారు.


అంతేకాకుండా, అంతుకుముందు ఏడాది కూడా సదరు డాక్టర్ ఇదే పొరపాటు చేశాడని ఆరోపించారు. ఆ తరువాత బాధితులతో సైలెంట్‌గా సెటిల్మెంట్ చేసుకుని విషయం బయటకుపొక్కకుండా జాగ్రత్త పడ్డారని అన్నారు. ఆ డాక్టర్‌కు మరింత మంది బలికాకుండా ఉండాలంటే అతడు ఇకపై ఆపరేషన్లు చేయకుండా నిషేధం విధించాలని కోరారు. అయితే, సదరు డాక్టర్ ప్రస్తుతం శస్త్రచికిత్స చేస్తున్నదీ లేనిదీ మాత్రం ఇంకా తెలియరాలేదు. ఈ ఉదంతం మాత్రం స్థానికంగానే కాకుండా నెట్టింట కూడా సంచలనం సృష్టిస్తోంది.

Read Latest and Viral News

Updated Date - Sep 05 , 2024 | 11:55 AM