Copper Toxicity: రాగి పాత్రలో నీటిని తాగుతారా? ఈ జాగ్రత్త పాటించకపోతే నీరు విషతుల్యం!
ABN , Publish Date - Dec 08 , 2024 | 02:55 PM
రాగి పాత్రల్లో నిల్వ ఉంచిన నీటితో అనేక ప్రయోజనాలు ఉన్నాయని వైద్య శాస్త్రం చెబుతోంది. అయితే, అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడే ఈ ప్రయోజనాలు చేకూరుతాయి. కానీ ఒక్క పొరపాటు చేస్తే మాత్రం ఇదే నీరు విషతుల్యంగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు
ఇంటర్నెట్ డెస్క్: రాగి పాత్రలోని నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనలో చాలా మందికి తెలిసిందే. వైద్యులు కూడా ఇదే చెబుతారు. ఈ నీటితో కడుపు శుభ్రం అవుతుందని, శరీరంలోని విషతుల్యాలు తొలగిపోతాయని అంటారు. ఈ నీరు తాగే వారిలో వృద్ధాప్యం అంత త్వరగా రాదని, చర్మం యవ్వనకాంతులీనుతూ ఉంటుందని కూడా అంటారు. ఈ నీటితో అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయని వైద్య శాస్త్రం చెబుతోంది. అయితే, అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడే ఈ ప్రయోజనాలు చేకూరుతాయి. కానీ ఒక్క పొరపాటు చేస్తే మాత్రం ఇదే నీరు విషతుల్యంగా మారుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు (Viral).
Contagious Yawning: ఒకరిని చూసి మరొకరు ఆవలిస్తారు! ఎందుకో తెలిస్తే..
ఏదైనా మితంగా ఆచరించడమే ఆరోగ్యానికి ప్రధాన సూత్రమని నిపుణులు చెబుతున్నారు. ఇది రాగి పాత్రలోని నీటికీ వర్తిస్తుంది. వైద్యులు చెప్పే దాని ప్రకారం, ఎముకలు, మెదడు, చర్మం, శరీరంలోని ఇతర కణజాలం ఆరోగ్యంగా ఉండేందుకు రాగి అవసరం. మనుషులకు రోజుకు 10 మిల్లీగ్రాముల రాగి అవసరం. ఇంతకంటే తక్కువ తీసుకుంటే మెదడు పనితీరు మందగిస్తుంది. నాడీ వ్యవస్థ బలహీనపడుతుంది. గుండె పోటు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. కానీ పరిమితికి మించి శరీరంలో పేరుకుపోయే రాగి చివరకు ప్రాణాంతకంగా మారుతుంది.
వైద్యులు చెప్పే దాని ప్రకారం, రాగి పాత్రలో నీరు నిల్వ చేసినప్పుడు రాగి కొంత మేర నీళ్లల్లో కరిగిపోతుంది. ఇది చాలా చిన్న మొత్తం కాబట్టి శరీరానికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. కానీ రాగి పాత్రలను సరిగా శుభ్రం చేయకపోతే మాత్రం ఇదే రాగి విషతుల్యంగా మారుతుంది. ఈ నీరు శరీరంలోకి చేరితే పలు అవయవాలపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
Eating with Hands: వామ్మో.. చేతులతో భోజనాన్ని కలుపుకుని తింటే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా!
మురికిగా ఉన్న రాగి పాత్రల్లోని నీరు తాగినప్పుడు శరీరంలోకి వివిధ రకాల విషతుల్యాలు చేరతాయి. ముఖ్య అవయవాలైన మెదడు, ఊపిరితిత్తులు, కిడ్నీలు, లివర్, గుండెలో పేరుకుంటాయి. తొలుత కడుపు అప్‌సెట్ అవుతుంది. డయేరియా, వాంతులు, కడుపులో తిప్పటం వంటి సమస్యలు వేధిస్తాయి. విషతుల్యాలు ఇలాగే పేరుకుంటూ ఉంటే క్రమంగా తలనొప్పి, తలతిరుగుతున్నట్టు ఉండటం, కళ్లు, చర్మం పసుపు పచ్చ రంగులోకి మారడం వంటివి జరుగుతాయి. చివరకు ఇది ఇతర విపరిణామాలకు దారి తీస్తుంది.
అయితే, రోజూ శుభ్రపరుస్తున్న రాగి పాత్రల్లోని నీటితో ఎటువంటి అపాయం ఉండదని వైద్యులు భరోసా ఇస్తున్నారు. కానీ రాగి పాత్రలను వారానికోసారి కడగడం లేదా దుమ్ము పేరుకున్నట్టు కంటికి కనిపించినప్పుడే వాటిని శుభ్రం చేయడం చేస్తే మాత్రం కాపర్ టాక్సిసిటీ బారిన పడతారు.
రాగి పాత్రలను నిమ్మరసం, ఉప్పుతో శుభ్రం పరచడం ఉత్తమమైన పని అని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజూ వీటితో రాగి బాటిల్స్, పాత్రలను శుభ్రపరచాలి. ఇక వేడి నీటిని రాగి పాత్రల్లో ఎప్పుడు నిల్వ చేయకూడదు. ఇలా చేస్తే, రాగి అధిక మొత్తంలో నీటిలో కరిగి శరీరంలోకి చేరుతుంది. సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీటినే రాగి బాటిల్స్‌లో నింపుకోవాలి. 8 గంటల్లోపు ఆ నీటిని మొత్తం తాగేయాలి. ఈ జాగ్రత్తలు తూచా తప్పకుండా పాటిస్తే ఎటువంటి ప్రమాదాలు సంభవించవని నిపుణులు చెబుతున్నారు.
Viral: మంచనా 85 ఏళ్ల వృద్ధుడు! పక్కనే నిలబడి 22 ఏళ్ల గర్ల్‌ఫ్రెండ్ డ్యాన్స్!