Share News

Viral: ఈ బాలికను ఇలాగే వదిలేస్తే బందిపోటు రాణి అవడం పక్కా! షాకింగ్ వీడియో

ABN , Publish Date - Sep 10 , 2024 | 06:06 PM

ఓ బాలిక స్కూటీని చోరీ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండింగ్‌‌గా మారింది. ఆమె తెలివి చూసి షాకైపోతున్న నెటిజన్లు పోలీసులు వెంటనే నిందితురాలిని అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Viral: ఈ బాలికను ఇలాగే వదిలేస్తే బందిపోటు రాణి అవడం పక్కా! షాకింగ్ వీడియో

ఇంటర్నెట్ డెస్క్: ఓ బాలిక స్కూటీని చోరీ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండింగ్‌‌గా (Viral) మారింది. ఆమె తెలివి చూసి షాకైపోతున్న నెటిజన్లు పోలీసులు వెంటనే నిందితురాలిని అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వయసులోనే ఇలా ఉంటే పెద్దయ్యాక ఆమెతో డేంజర్ పక్కా అని కామెంట్స్ చేస్తున్నారు.

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఆ బాలిక ఊహించని రీతిలో ఓ స్కూటీని చోరీ చేసింది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం, స్కూల్ డ్రెస్‌లో ఉన్న ఆమె బాధితురాలి వద్దకు వచ్చి ఆమె స్కూటీ తాళం చెవులు అడిగింది. ఏదో వస్తువును పై అంతస్తుకు తీసుకెళ్లేందుకు స్కూటీ అడ్డంగా ఉందని చెప్పింది. తాళం చెవులు ఇస్తే దాన్ని పక్కకు జరుపుతానంటూ మాయ చేసింది.

Viral: వావ్.. ఇలాంటిదొకటి ఉంటే ఎన్ని దోసలైనా క్షణాల్లో రెడీ చేయొచ్చు!


బాలిక చెబుతోందని నిజమేనని అనుకున్న బాధితురాలు ఆమె చేతికి తాళం చెవులు ఇచ్చి వెళ్లింది. అయితే, బాధితురాలు కనుమరుగు అవగానే బాలిక తన టాలెంట్ చూపించింది. తనని ఎవరూ గమనించట్లేదని నిర్ధారించుకున్నాక స్కూటీతో మెల్లగా అక్కడి నుంచి ఉండాయించింది. ఈ ఘటనాక్రమమంతా సీసీటీవీలో రికార్డు కావడంతో జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. వారాణాసిలో ఈ ఘటన జరగ్గా బాధితురాలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.


మరోవైపు, ఈ ఘటన వైరల్ కావడంతో నెటిజన్లు షాకైపోతున్నారు. బాలిక మరీ ముదురులా ఉందని కొందరు కామెంట్ చేశారు. బాలికను పోలీసులు తక్షణం అదపులోకి తీసుకోవాలని అన్నారు. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు ఈమె భవిష్యత్తులో బందిపోటు రాణి అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని కొందరు కామెంట్ చేశారు.

కాగా, ఇటీవల బెంగళూరులో కూడా దాదాపు ఇలాంటి చోరీ జరిగింది. ఇందిరానగర్‌లో దొంగలు.. పార్క్ చేసి ఉన్న కార్లల్లో చోరీ చేశారు. ప్రత్యేక పరికరంతో కారు అద్దాలను పగలగొట్టాక లోపలున్న లాప్‌టాప్లు, ఇతర విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలు అప్పట్లో నెట్టింట తెగ వైరల్ అయ్యాయి.

Read Latest and Viral News

Updated Date - Sep 10 , 2024 | 06:14 PM