Share News

Viral: వాడకం అంటే ఇదీ! సింహం నాలుకకు యాపిల్ వాచ్ తగిలించి.. ఎందుకో తెలిస్తే..

ABN , Publish Date - Jun 14 , 2024 | 05:29 PM

ఆస్ట్రేలియాకు చెందిన ఓ వెటర్నరీ డాక్టర్.. యాపిల్ వాచ్ సాయంతో సింహం గుండె కొట్టుకునే వేగాన్ని పరిశీలించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. యాపిల్ వాచ్ ను ఇలాక్కూడా వాడి వన్యప్రాణుల్ని కాపాడుతున్న తీరుకు జనాలు ముగ్ధులవుతున్నారు.

Viral: వాడకం అంటే ఇదీ! సింహం నాలుకకు యాపిల్ వాచ్ తగిలించి.. ఎందుకో తెలిస్తే..
Apple watch tracks lion heart beat

ఇంటర్నెట్ డెస్క్: యాపిల్ వాచ్.. ఇప్పటివరకూ ఇది ఎందరికో ప్రాణదానం చేసింది. రాబోయే ముప్పులను ముందుగానే పసిగట్టి అలర్ట్ చేయడంతో పాటు దీన్ని ధరించిన వారు అపాయంలో ఉంటే వెంటనే అత్యవసర సేవల సిబ్బందికి కూడా సమాచారం అందిస్తుంది. అందుకే, యాపిల్ వాచ్ ప్రపంచమంతటా పాప్యులర్. దీన్ని చేతికి పెట్టుకుని, బీపీ, హార్ట్ రేట్ వంటి వాటిపై రియల్‌టైమ్‌లో ఓ కన్నేసి ఉంచొచ్చు. అయితే, ఆస్ట్రేలియాకు చెందిన ఓ డాక్టర్ యాపిల్ వాచ్‌ను వినూత్న రీతిలో వినియోగించి సింహానికి చికిత్స చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ (Viral) అవుతోంది.

Viral: అసలైన మనుషులంటే వీళ్లే.. కుక్క కోసం ఎంత రిస్క్ చేశారో చూడండి!


జంతు సంరక్షణ కోసం యాపిల్ వాచ్‌లను ఎలా వినియోగిస్తోందీ చెబుతూ డా. ఖ్లోయీ బ్యూటింగ్ వీడియోలో చెప్పారు. అయితే, యాపిల్ వాచ్ ను ఇలా వాడొచ్చన్న ఆలోచనకు మూల కారణం మరో డాక్టర్ కెసేడా అని పేర్కొన్నారు. డాక్టర్ కెసెడా ఓసారి యాపిల్ వాచ్‌ను ఏనుగు చెవుకు తగిలించి దాని గుండెకొట్టుకునే తీరును పరిశీలించారని అన్నారు. దీంతో, తాను వాచ్‌ను సింహం నాలుకకు తగిలించి దాని గుండె చప్పుడును జాగ్రత్తగా గమనిస్తూ చికిత్స చేసినట్టు చెప్పుకొచ్చారు. సింహం, పులి, ఏనుగు లాంటి భారీ జంతువుల గుండె చప్పుడు, ఇతర వైటల్స్‌ను పరీశీలించేందుకు ఈ వాచ్ ఎంతో ఉపయోగపడుతోందని చెప్పారు (Vet Discovers Apple Watch Doesnt Only Track Human Heart But Lions Too).


యాపిల్ వాచ్ పనితీరు ఇలా..

ఫొటోథేలిస్మోగ్రఫీ అనే సాంకేతికత ద్వారా యాపిల్ వాచ్ హార్ట్ రేట్ ను కొలుస్తుంది. సాధారణంగా రక్తం ఆకుపచ్చ కాంతిని పీల్చుకుని ఎరుపు రంగు కాంతిని ప్రతిఫలిస్తుంది. ఇక యాపిల్ వాచ్‌లో ఈ రంగులను గుర్తించే సెన్సర్లు ఉంటాయి. చేతి మణికట్టుకు ఉన్న యాపిల్ వాచ్ సెకెనకు కొన్ని వందల సార్లు ఆకు పచ్చ కాంతిని చర్మంపై ప్రసరించి రక్తపోటులో మార్పులను గుర్తించి తద్వారా గుండె కొట్టుకునే వేగాన్ని అంచనా వేస్తుంది.

Updated Date - Jun 14 , 2024 | 05:33 PM