Viral: సముద్రంపై డేగను తలదన్నేలా గాల్లో ఎగురుతున్న చేప.. అబ్బురపరిచే వీడియో!
ABN , Publish Date - May 21 , 2024 | 04:09 PM
సముద్రంపై ఓ చేప డేగను తలదన్నే రేంజ్‌లో ఎగురుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. మరీ ఈ రేంజ్‌లో ఎగిరే చేపలు ఉన్నాయని తమకు తెలీదంటూ అనేక మంది వీడియో చూసి కామెంట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: చేపలంటే సాధారణంగా నీళ్లల్లో ఈదుతూ కనిపిస్తాయి కానీ గాల్లో ఎగరగలిగే చేపలు కూడా ఉన్నాయి. వీటిని ఫ్లైయింగ్ ఫిష్ అంటారు. సాధారణంగా ఇవి కొద్ది దూరం మాత్రమే ఎగిరి మళ్లీ నీళ్లలోకి వెళ్లిపోతాయి. కానీ ఓ ఫ్లైయింగ్ చేప ఆసాధారణ రీతిలో డేగను తలదన్నేల్లా గాల్లో ఎగురుతున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. ఈ సన్నివేశం చూసి జనాలు షాకైపోతున్నారు.
Viral: మగ సింహం ప్రేమ అంటే ఇదీ.. ఆడ సింహం కోసం ఎంత రిస్క్ చేసిందంటే..
ఫ్లైయింగ్ ఫిష్‌లు సాధారణంగా బార్బడాస్ ద్వీపం సమీపంలో కనిపిస్తుంటాయి. వీటికి గాల్లో ఎగిరేందుకు అనువైన రెక్కలు ఉంటాయి. తమకు ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు ఇవి ఒక్కసారిగా నీళ్లల్లోంచి పైకి ఎగురుతాయి. ఆ తరువాత రెక్కలు ఆడిస్తూ నీటిఉపరితలంపై కొద్ది ఎత్తున ఎగురుతూ వేగంగా ముందుకు దూసుకుపోతాయి. ఇక తాజా వీడియోను జపాన్ ద్వీపం దగ్గర రికార్డు చేసినట్టు తెలుస్తోంది. ఇందులోని ఫ్లైయింగ్ ఫిష్ డేగ స్పీడుతో వేగంగా నీటిపై ఎగురుతూ ముందుకు దూసుకుపోయింది. పక్కనే పడవపై ప్రయాణిస్తున్న కొందరు దీన్ని కెమెరాలో బంధించి నెట్టింట షేర్ చేశారు. నావతో దాదాపు సమానమైన వేగంతో చేప ఎగురుతున్న తీరు వీడియోలో చూడొచ్చు (video of a flying fish goes viral in social media).
Viral: రేయ్..ఎవర్రా మీరంతా.. పుచ్చకాయల్ని ఎలా కల్తీ చేస్తున్నారో చూస్తే..
ఈ అద్భుతాన్ని చూసి జనాలు షాకైపోతున్నారు. ఎగిరి చేపలు గురించి విన్నాం కానీ అవి మరీ ఈ రేంజ్‌లో ఎగురుతాయని తామెప్పుడూ ఊహించలేదని అనేక మంది కామెంట్ చేశారు. ప్రకృతిలో అద్భుతాలకు అంతేలేదంటూ మరికొందరు అభిప్రాయపడ్డారు. చేపకు ఏదో భారీ ప్రమాదమే ముంచుకు రావడంతో అది నీళ్లల్లోంచి బయటకు వచ్చి మరీ ఈ రేంజ్‌లో ఎగురుతోందని కొందరు అన్నారు. బహుశా సొర చేప వెంటపడి ఉండొచ్చని కూడా అభిప్రాయపడ్డారు. వీడియో కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి