Share News

Viral: వావ్.. ఈ ట్రైన్‌లో ఒక్కసారైనా జర్నీ చేయకపోతే లైఫ్ వేస్ట్!

ABN , Publish Date - Sep 08 , 2024 | 02:55 PM

ఓ విదేశీయురాలు జపాన్‌లోని ఓ లిమిటెడ్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ప్రయాణించి అబ్బురపడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అందులోని సౌకర్యాలు, ప్రయాణానుభూతి గురించి విన్న నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Viral: వావ్.. ఈ ట్రైన్‌లో ఒక్కసారైనా జర్నీ చేయకపోతే లైఫ్ వేస్ట్!

ఇంటర్నెట్ డెస్క్: ఆధునిక సాంకేతికతకు పర్యాయపదంగా నిలిచే జపాన్‌‌ రైళ్లు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. జపాన్ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేవి బుల్లెట్ ట్రెయిన్స్. అయితే, సామాన్య రైళ్లల్లోనే అత్యాధునిక సౌకర్యాలు ఉండే జపాన్‌లో ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తాజాగా ఓ విదేశీయురాలు అక్కడ ఓ లిమిటెడ్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ప్రయాణించి అబ్బురపడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా (Viral) మారింది.

Viral: భారీ వర్షం, ట్రాఫిక్ జామ్‌‌లో చిక్కుకుని ఫుడ్ ఆర్డరిస్తే..

పరిమిత సంఖ్యలో సర్వీసులు ఉండే ఈ లిమిటెడ్ ఎక్స్‌ప్రెస్ రైలు పేరు సెఫ్ఫైర్ ఒడోరికో. టోక్యో, ఇజుల మధ్య చెక్కర్లు కొట్టే ఈ రైలు ప్రయాణం స్వర్గాన్ని తలపిస్తుంది. రైల్లోని సాధారణ సీట్లే విమానంలోని బిజినెస్ క్లాస్ స్థాయిని మించి ఉంటాయి. ఇక ప్రైవేటు క్యాబిన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ రైలు తీర ప్రాంతం వెంబడి ప్రయాణిస్తుందని, ప్రకృతి అందాలను తిలకించేందుకు వీలుగా రైల్లో ఎన్నో ఏర్పాట్లు ఉన్నాయని మహిళ చెప్పుకొచ్చింది.


రివాల్వింగ్ కుర్చీలు ఈ రైలు ప్రత్యేకత అని ఆ మహిళ వివరించింది. దీంతో, ప్రయాణికులు కిటికీలకు అభిముఖంగా కూర్చుని ప్రకృతి అందాలను తనివితీరా తిలకించొచ్చని పేర్కొంది. ఇక ప్రీమియం కాబ్యిన్స్‌ టిక్కెట్లు ఒక్కోటి రూ.5 వేలని చెప్పింది. రైల్లో ప్రయాణికుల కోసం ఓ రెస్టారెంట్ కూడా ఉందని, ప్రత్యేకంగా తయారు చేసిన ఫుడ్స్ అక్కడ అభిస్తాయని పేర్కొంది. ఈ రైలు ప్రత్యేకత సీట్లేనని కూడా పేర్కొంది. ఒక్కో చోట ఒక్కో విధమైన అధునాతన సీట్ల ఉన్నాయని వెల్లడించింది.

రైల్లోని ప్రైవేటు క్యాబిన్‌లో ఆరుగురు ప్రయాణించొచ్చని మహిళ చెప్పింది. ఇక బాత్రూమ్‌లు కూడా అధునాతన డిజైన్‌తో అత్యంత సౌకర్యవంతంగా, శుభ్రంగా ఉన్నాయని చెప్పింది.


సహజంగానే ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. 40 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. జపాన్ ఇతర దేశాలకంటే ఎంతో ముందుందని, భవిష్యత్ తరాల సాంకేతికతను కూడా అందింపుచ్చుకుందని ఓ వ్యక్తి వ్యాఖ్యానించారు. రోజూ ఆఫీసులకు ఇలాంటి రైళ్లల్లో వెళ్లే అవకాశం ఉంటే భలేగా ఉంటుందని మరో వ్యక్తి అభిప్రాయపడ్డారు. లైఫ్‌లో ఇలాంటి రైల్లో ఒక్కసారన్నా ప్రయాణించకపోతే లైఫ్ వేస్టని మరో వ్యక్తి ప్రశంసలు కురిపించారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది.

Read Latest and Viral News

Updated Date - Sep 08 , 2024 | 03:09 PM