Viral: యూఎస్ఏలో భారతీయ బైక్.. దీన్ని చూసి అమెరికన్లు వెర్రెత్తిపోవాల్సిందే!
ABN , Publish Date - Aug 01 , 2024 | 09:35 PM
యూఎస్ఏలో బజాజ్ ప్లాటినా బైక్ ఉన్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. జనాలు షాకైపోయేలా చేస్తున్నాయి. బైక్ మైలేజీ ఎంతో తెలిస్తే అమెరికన్లు ఆశ్చర్యపోతారని కొందరు కామెంట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచంలో ద్విచక్రవాహనాలకు అతిపెద్ద మార్కెట్లో భారత్ ఒకటి. అందుబాటు ధరలో చక్కని మైలేజీ ఇచ్చే ఈ బైకులు మధ్యతరగతి ప్రజలకు అత్యంత అనువైన ప్రయాణ సాధనాలు. ఈ కారణంగా ప్రపంచంలోని అనేక బైక్ కంపెనీలకు భారత్‌లోని పరిస్థితులు, కస్టమర్ల అభిరుచులు అవసరాలను దృష్టిలో పెట్టుకుని పలు డిజైన్లలో బైక్‌లను విడుదల చేస్తుంటాయి. అయితే, ఇండియాలో కనిపించే సాధారణ బైక్ అమెరికాలో కనువిందు చేస్తే మాత్రం నోరెళ్లబెట్టాల్సిందే. అందుకే ఈ ఉదంతం ప్రస్తుతం నెట్టి్ంట వైరల్‌గా (Viral) మారింది.
Viral: అత్యంత ఎత్తైన భవనంపైనున్న యాంటినాపై యువకుడు నిలబడి.. షాకింగ్ వీడియో!
అమెరికా వీధుల్లో బజాజ్ ప్లాటినా బైక్ ఉన్న దృశ్యం నెట్టింట సంచలనంగా మారింది. @satnam_singh_dc పేరిట ఉన్న అకౌంట్‌లో ఈ వీడియో పోస్టు చేశారు. ఈ సీన్ చూసి జనాలు షాకైపోయారు. ఇలాంటి దృశ్యం చూడలేదంటూ కామెంట్లు వెల్లువెత్తించారు.
ఇక బజాజ్ ప్లాటినా మైలేజ్‌పై నెట్టింట సెటైర్లు పేలాయి. బైక్ మైలేజీ ఎంత ఇస్తుందో తెలిస్తే అమెరికన్లు వెర్రెక్కిపోతారని కొందరు అన్నారు. టాంక్ ఫుల్‌గా కొట్టింటి ఇంట్లోంచి బయటికెళితే.. చివరకు అమెరికాలో తేలి ఉంటాడని బైక్ యజమానికి ఉద్దేశించి ఓ వ్యక్తి పేర్కొన్నారు. దాని టాంక్ ఫుల్ చేస్తే అమెరికా అంతా చుట్టిరావచ్చని కొందరు అన్నారు. కాగా, గతంలో అమెరికా రోడ్లపై ఓ ఆటో చెక్కర్లు కొట్టిన దృశ్యం కూడా నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది.