Viral: అచేతనంగా పుట్టిన శిశువును ఈ డాక్టర్ ఎలా బతికించారో చూస్తే..
ABN , Publish Date - Oct 01 , 2024 | 11:17 AM
అచేతనంగా పుట్టిన ఓ చిన్నారి ప్రాణాలు నిలిపిన ఓ డాక్టర్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. డాక్టర్ ఆ చిన్నారి ప్రాణాలు నిలిపిన వైనం చూసి జనాలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఏ దేశంలోనైనా వైద్యులను దేవుళ్లుగా చూస్తారు. అనారోగ్యం బారిన పడ్డ వారిని కాపాడే డాక్టర్లకు చేతులెత్తి నమస్కరిస్తారు. ఈ నేపథ్యంలో డాక్టర్ల గొప్పదనాన్ని చాటే మరో వీడియో నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతోంది. అచేతనంగా పుట్టిన ఓ చిన్నారి ప్రాణాలను ఓ డాక్టర్ నిలిపిన తీరు చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇది నిజంగా అద్భుతమంటూ కీర్తిస్తున్నారు (Viral).
Viral: కుందేలు, తాబేలు మధ్య పరుగు పదెం.. చివరికి ఏమైందో చూస్తే..
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ బిడ్డ అచేతనంగా పుట్టింది. చిన్నారిలో కొంచెం కూడా కదలిక కనిపించలేదు. అక్కడే ఉన్న డాక్టర్ మాత్రం చిన్నారిని ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో రంగంలోకి దిగారు. శిశువు ఎత్తుకుని మరో ఎమర్జెన్సీ గదికి పరుగుపరుగున తీసుకొచ్చారు. అక్కడ వివిధ పరికరాలతో శిశువు ఊపిరితిత్తుల్లోకి గాలి పంపే ప్రయత్నం చేశారు. ఛాతిపై మెల్లగా ఒత్తుతూ చిన్నారి తనంతట తానుగా శ్వాసతీసుకునేలా ప్రయత్నం చేశారు (Video Of Doctor Saving Lifeless Newborn Wins Internets Heart ).
Viral: రాత్రి 2.00 గంటలకు బాస్ నుంచి ఊహించని మెసేజ్! మహిళకు షాక్!
అయితే, వైద్యుడి ప్రయత్నాలకు తొలుత శిశువు స్పందించలేదు. చలనం కనిపించలేదు. కానీ వైద్యుడు మాత్రం తన ప్రయత్నం ఆపలేదు. ఛాతిని ఒత్తుతూనే చిన్నారి నోట్లోకి వివిధ పరికరాలతో గాలిని పంపించారు. ఇంతలోనే అద్భుతం జరిగింది. క్రమంగా శ్వాసతీసుకోవడం మొదలెట్టిన చిన్నారి ఆ వెంటనే ఏడుపు ప్రారంభించింది. దీంతో, అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుతున్నారు.
Viral: వామ్మో! బెంగళూరులో ఇలాంటి సీన్ ఎప్పుడైనా చూశారా! నోరెళ్లబెట్టాల్సిందే!
educativefeed అనే ఇన్‌స్టాగ్రామ్ ఛానల్‌లో కనిపించిన ఈ వీడియో నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఏకంగా 1.4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. లక్షలకు పైగా లైకులూ వచ్చిపడ్డాయి. ఇక శిశువును కాపాడిన డాక్టర్‌పై ప్రశంసలకు అంతేలేకుండా పోయింది. అనేక మంది ఆ వైద్యుడిని దేవుడితో పోల్చారు. అతడిని దేవుడు ఎప్పుడూ చల్లగా చూస్తారంటూ కామెంట్స్ చేశారు.
Viral: వామ్మో.. రోజుకు 18 గంటల పని! ఈ స్టార్టప్ కంపెనీ సీఈఓ కష్టం చూస్తే..
ఇక మధ్యప్రదేశ్‌లోని ఖండ్వాలో వెలుగు చూసిన మరో ఘటనలో ఓ డాక్టర్ 9 ఏళ్ల బాలిక ప్రాణాలు కాపాడారు. కడుపులో సూది ఇరుక్కుపోవడంతో ఆ చిన్నారి తీవ్ర ప్రమాదంలో పడింది. అంతుకు కొద్ది రోజుల ముందే ఆ బాలిక పొరపాటున పిన్ను మింగిందట. ఆ తరువాత ఆమె కడుపులో నొప్పి మొదలడంతో తల్లిదండ్రులకు గాబరా పడుతూ తన కూతురిని డాక్టర్ వద్దకు తీసుకెళ్లారు. చాలా మంది డాక్టర్ల వద్దకు వెళ్లినా ఫలితం లేకపోవడంతో చివరకు ఖండ్వాలోని డాక్టర్ సమస్యను గుర్తించి శస్త్రచికిత్స చేసి సూదిని బయటకు తీశారు.
Viral: మార్స్‌పై మనిషి సెటిలైతే జరిగేది ఇదే.. అమెరికా శాస్త్రవేత్త హెచ్చరిక
Viral: డబ్బున్నోళ్లంటే భారతీయులకు అందుకే ద్వేషం! ప్రముఖ సంస్థ సీఈఓ వ్యాఖ్య
వామ్మో! పెళ్లికొచ్చిన అతిథుల నుంచి వధూవరులు రూ.2 లక్షలు చొప్పున వసూల్!