Share News

Viral: వామ్మో.. గర్ల్స్‌ హాస్టల్‌‌లో రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా?

ABN , Publish Date - Oct 01 , 2024 | 03:14 PM

పరీక్షకు ముందు రోజు ఓ హాస్టల్‌లో విద్యార్థినులు చదువు పక్కనపెట్టి డ్యాన్స్ చేస్తున్నట్టుఉన్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. జనాలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. హాస్టల్ లైఫ్ అంటే ఇలాగే ఉంటుందని కొందరు అంటే మరికొందరు మాత్రం విద్యార్థినుల తీరును విమర్శించారు.

Viral: వామ్మో.. గర్ల్స్‌  హాస్టల్‌‌లో రాత్రి వేళ సీన్ ఇలా ఉంటుందా?

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో చాలా మంది విద్యార్థులు ఇంటికి దూరంగా హాస్టల్స్‌లో ఉండి చదువుకుంటున్నారు. హాస్టల్ జీవితంలో సరదాలు, సర్దుకుపోవడాలతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయి. కొత్త స్నేహాలు, అనుభవాలు ఎన్నో తారసపడతాయి. అందరూ ఒకే వయసు వారు కావడంతో ఆ ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. అయితే, పరీక్షకు ముందు రోజు రాత్రి గర్ల్స్ హాస్టల్‌లో పరిస్థితిని చూపించే వీడియో నెట్టింట తెగ వైరల్ (Viral) అవుతోంది. ఇది చూసి జనాలు షాకైపోతున్నారు.

UP: క్యాష్ ఆన్ డెలివరీపై ఐఫోన్ ఆర్డర్! డెలివరీ ఏజెంట్ ఇంటికొచ్చాక..


బెంగళూరులోని ఓ యూనివర్సిటీ హాస్టల్‌లోని వీడియో ఇదని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక వీడియోలో కనిపించిన దాని ప్రకారం, విద్యార్థినులు ఆ రోజు రాత్రి డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు. ముందుగా ఓ విద్యార్థిని తన స్నేహితురాళ్లను పరిచయం చేస్తున్నట్టు ఎంట్రీ ఇవ్వడంతో వీడియో మొదలవుతుంది. ఆ తరువాత మిగతా స్టూడెంట్స్ అందరూ పాటకు లయబద్ధంగా స్టెప్పులేస్తూ మెప్పిస్తారు. ‘పరీక్షకు ముందు రోజు రాత్రి..’ అంటూ ఈ వీడియో షేర్ చేయడంతో ఇది ఒక్కసారిగా నెట్టింట వైరల్ అయిపోయింది.

Viral: కుందేలు, తాబేలు మధ్య పరుగు పదెం.. చివరికి ఏమైందో చూస్తే..

వీడియో చూసిన జనాలందరూ తెగ కామెంట్స్ చేశారు. హాస్టల్ లైఫ్ అంటే ఇలాగే ఉంటుందని కొందరు చెప్పుకొచ్చారు. నాటి రోజులు జీవితాంతం గుర్తుండిపోతాయని కొందరు అన్నారు. ఇలాంటి అల్లరితోనే పరీక్ష ఒత్తిడి మాయమవుతుందనీ అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వైరల్ అవుతున్న ఈ వీడియోకు ఇప్పటివరకూ 2.94 కోట్ల పైచిలుకు వ్యూస్ వచ్చాయి. దాదాపు 23 లక్షల లైక్స్ కూడా వచ్చాయి.


Viral: రాత్రి 2.00 గంటలకు బాస్ నుంచి ఊహించని మెసేజ్! మహిళకు షాక్!

అయితే, కొందరు మాత్రం ఈ వీడియోపై పెదవి విరిచారు. తల్లిదండ్రులు కష్టపడి పిల్లల్ని చదివిస్తుంటే వీళ్లేమో పరీక్షకు ముందు రోజు కూడా ఇలా ఆటపాటలతో గడిపేయడం బాధ్యతారాహిత్యమని ఓ వ్యక్తి అభిప్రాయపడ్డారు. హాస్టల్స్‌ విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టేందుకు కాలేజీ యాజమాన్యాలు మరింత శ్రమించాలని అభిప్రాయపడ్డారు.

Viral: మార్స్‌పై మనిషి సెటిలైతే జరిగేది ఇదే.. అమెరికా శాస్త్రవేత్త హెచ్చరిక

Viral: డబ్బున్నోళ్లంటే భారతీయులకు అందుకే ద్వేషం! ప్రముఖ సంస్థ సీఈఓ వ్యాఖ్య

వామ్మో! పెళ్లికొచ్చిన అతిథుల నుంచి వధూవరులు రూ.2 లక్షలు చొప్పున వసూల్!

Read Latest and Viral News

Updated Date - Oct 01 , 2024 | 03:21 PM