Viral: వామ్మో.. సింహాల్లో ఈ యాంగిల్ కూడా ఉందా? అద్భుత దృశ్యం!
ABN , Publish Date - Jun 02 , 2024 | 10:51 AM
ఉధృతంగా ప్రవహిస్తున్న నదికి ఎదురీది అవతలి ఒడ్డుకు చేరిన సింహాల వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చాలా అరుదైన ఘటన అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఈతను బాగా ఎంజాయ్ చేసే జంతువుల్లో పులి ఒకటి. కానీ సింహాలు మాత్రం నీటి జోలికి సాధారణంగా వెళ్లవు. వాటి శరీర నిర్మాణం ఈతను అంత అనుగూణంగా లేకపోవడమే ఇందకు కారణం. అయితే, ఇటీవల సింహాలకు సంబంధించి ఓ అరుదైన దృశ్యం కనిపించింది. సింహాలు తమ సహజ లక్షణాలకు భిన్నంగా ఏకంగా నదిలో ఈదాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా (Viral) మారింది.
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, మూడు మగ సింహాలు ఉధృతంగా ప్రవహిస్తున్న నది వద్దకు వస్తాయి. పోటెత్తుతున్న నది చూసి అవి క్షణకాలం తడపబడ్డాయి. ప్రవాహం తగ్గుతుందేమోనని కాసేపు ఎదురు చూశాయి. నదీ ఒడ్డునే అటూ ఇటూ తిరిగాయి. కానీ, ప్రవాహ వేగం తగ్గలేదు. దీంతో, ధైర్యం కూడదీసుకున్న రెండు సింహాలు మెల్లగా నదిలోకి దిగాయి. మొదట ఒక సింహం దిగగానే రెండో సింహం దాన్నే అనుసరించింది. ప్రవాహ ఉధృతికి అవి కాస్త కొట్టుకుపోయాయి. కానీ తమనితాము కూడదీసుకుని శక్తినంతా కూడదీసుకుని ఈది అవతలి ఒడ్డుకు చేరుకున్నాయి (Video of Male lions crossing raging river goes viral ).
Viral: శరీర దుర్వాసన వస్తోందంటూ నల్లజాతీయుల్ని దింపేసిన ఎయిర్ లైన్స్!
ఇదంతా చూస్తూన్నా మూడో సింహం మాత్రం నదిలోకి దిగలేకపోయింది. ధైర్యం చాలక ఒడ్డునే అటూ ఇటూ తచ్చాడింది. చివరకు ఆ రెండు సింహాలో మాత్రం అవతలి ఒడ్డుపైకి చేరుకుని మెల్లగా కనుమరుగయ్యయి. అక్కడే ఉన్న టూరిస్టులు ఈ మొత్తం వీడియోను రికార్డు సాధించారు. సింహాలు నదిని దాటే తీరును ఉత్కంఠగా చూశారు. అయితే, మూడో సింహం ఆ తరువాత ఏం చేసిందనే దానిపై మాత్రం క్లారిటీ లేదు.
ఇక వీడియో చూసిన జనాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. చిన్న కొలనులో దిగేందుకు వెనకాడే సింహాలు ఇలా ఉగ్రరూపం దాల్చిన నదిని దాటడం అరుదైన ఘటనగా అభివర్ణించారు. తప్పనిసరి పరిస్థితి ఉంటే తప్ప సింహాలు ఇలాంటి సాహసానికి పూనుకోవని అన్నారు. ఇలా అరుదైన దృశ్యమైని కామెంట్ చేశారు. తాము ఇలాంటి ఎప్పుడూ చూడలేదని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో వైరల్ అవుతోంది.